VJ Sunny కి చేదు అనుభవం.. డేటింగ్ యాప్‌లో అలా షాకిచ్చిన అమ్మాయి
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో తనదైన శైలిలో వినోదాన్ని పంచి ప్రేక్షకులకు చేరువైన వీజే సన్నీ విజేతగా నిలిచారు. సాధారణ కంటెస్టెంట్‌గా ఇంటిలోకి వెళ్లిన సన్నీ అలియాస్ అరుణ్ రెడ్డి అసాధారణ వ్యక్తిగా బయటకు వచ్చారు. అయితే వీజే సన్నీపై కోట్లాది మంది అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా డేటింగ్ యాప్‌లో సన్నీకి ఎదురైన చేదు అనుభవం గురించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ క్రమంలో సన్నీ బిగ్‌బాస్ జీవితం, వ్యక్తిగత జీవితం గురించిన విషయాల్లోకి వెళితే..

భారీ పారితోషికంతో వీజే సన్నీ
వీజే సన్నీకి ఇచ్చిన మాట ప్రకారం బిగ్‌బాస్ తెలుగు 5 ట్రోఫిని చేతిలో పెట్టారు. 50 లక్షల రూపాయల పారితోషికంతోపాటు 25 లక్షలు విలువ చేసే ప్లాట్‌ను సొంతం చేసుకొన్నారు. అంతేకాకుండా ఓ మోటార్ బైక్‌ను కూడా తన ఖాతాలో వేసుకొన్నారు. అంత కంటే ముఖ్యంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకొన్నారు.

స్వప్న సుందరి కోసం వేట
అయితే బిగ్‌బాస్ షోలోకి అడుగుపెట్టడానికి ముందు హోస్ట్ నాగార్జున కోరిక మేరకు తన స్వప్న సుందరి బొమ్మను గీసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్‌లో తన స్వప్ప సుందరిని వెతుక్కోమని అడిగితే.. సిరి హన్మంతు, లహరి షారీ, శ్వేత వర్మ లాంటి కంటెస్టెంట్లతో తన బొమ్మను పోల్చి చూసుకొన్న సంగతి తెలిసిందే.

ఆలియాభట్‌తో ఐ లవ్ యూ
అయితే తన బిగ్‌బాస్ ప్రయాణంలో ఇంటిలోని లేడి కంటెస్టెంట్లలో తన స్వప్న సుందరిని చూసుకోవడంలో విఫలమయ్యాడు. అయితే గ్రాండ్ ఫినాలే సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో ఐ లవ్ యూ చెప్పించుకొన్నాడు. ఆ తర్వాత కిందపడి గిలగిల కొట్టుకొన్నాడు.

త్వరలోనే స్వప్న సుందరిని కలుసుకొనే..
అయితే హోస్ట్ నాగ్ కోరికను తీర్చుకుండానే వీజే సన్నీ చివరకు స్వప్న సుందరి లేకుండానే ట్రోఫి పట్టుకొని బయటకు వచ్చాడు. అయితే త్వరలోనే తన స్వప్న సుందరిని కలుసుకొంటారని బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన జ్యోతిష్కురాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే షోలో అఫైర్ విషయంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకొన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Recommended Video

డేటింగ్ యాప్‌లో చేదు అనుభవం
తన జీవితంలో డేటింగ్ వ్యవహారం చాలా ఇబ్బంది పెట్టింది. డేటింగ్ యాప్ ద్వారా నేను ఒక అమ్మాయితో డేటింగ్ చేశాను. అలా ఆమెను వ్యక్తిగతంగా కూడా కలుసుకొన్నాను. ఆ సమయంలో తన మాజీ ప్రియుడితో జరిగిన ఓ సంఘటన గురించి నాకు చెప్పింది. ఆ తర్వాత ఆమెతో నా డేటింగ్‌కు ముగింపు కార్డు పడింది. అలా నా తొలి డేటింగ్ వ్యవహారం అలా ముగిసింది అని తెలిపారు.


Click it and Unblock the Notifications











