చేయని తప్పుకు శిక్షలు అనుభవించా.. నాపై నిందలు వేసి బురద చల్లారు.. అరియానాతో వీజే సన్నీ హాట్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 5 విజేతగా నిలిచిన వీజే సన్నీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సన్నీని తన వాడికి చేసుకొని ఎంతో మంది నెటిజన్లు విషెస్ చేస్తున్నారు. అయితే బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూను బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా గ్లోరికి ఇచ్చారు. ఈ సందర్భంగా అరియానా, మానస్‌తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఇంటిలోని విషయాలు, తన కష్టాలు, కన్నీళ్లను, సంతోషాన్ని పంచుకొంటూ..

Recommended Video

Bigg Boss Telugu Season 5 | 18th December 2021 - Promo | ఫైనలిస్ట్ లతో ఓ ఆటాడుకున్న సీనియర్స్
మెడలో గిల్టీ బోర్డు వివాదం గురించి

మెడలో గిల్టీ బోర్డు వివాదం గురించి


టైటిల్ గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకుల సపోర్ట్‌ను నేనెప్పుడూ మరిచిపోను. నేను నా వంతుగా ఆడాను. వాళ్ల సపోర్ట్ గెలిచాను. ఇంటిలో అందరూ టాలెంట్ ఉన్నవారే. కానీ టాస్క్‌ల సమయంలో నేను చాలా కష్టపడ్డాను. నాతోపాటు అందరూ కష్టపడ్డారు. నా కష్టాన్ని చూసి కొందరు నాపై బురద చల్లాలని చూశారు. అలాంటి పరిస్థితుల్లోనే గిల్టీ బోర్డులు, గొడవలు, కొట్లాటలు అని వీజే సన్నీ అన్నారు.

చేయని తప్పుకు శిక్ష

చేయని తప్పుకు శిక్ష

టాస్క్‌ల సమయంలో తెలియకుండా కొందరు నాపై ఎమోషనల్ ఎటాక్ చేశారు. చాలా సార్లు నేను చేయని తప్పుకు శిక్షపడ్డాను. చాలాసార్లు నా తోటి కంటెస్టెంట్లు చేస్తున్న ఎమోషనల్ ఎటాక్స్‌ గురించి ఆలోచించి చాలా బాధ పడ్డాను. నాలో నేను బాగా మదనపడ్డాను. మానసికంగా ఉండే బాధను నేను అనుభవించాను. నాకు సపోర్ట్ చేస్తున్న వారికి సపోర్ట్‌గా నిలువడానికి నేను మరింత కష్టపడ్డాను. దాని ఫలితమే ఈ ట్రోఫి అని వీజే సన్నీ తెలిపారు.

అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలనే పట్టుదల

అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలనే పట్టుదల


బిగ్‌బాస్ ఇంటిలో మధురమైన గుర్తు ఏమిటంటే.. ఇంటిలోకి అమ్మ వచ్చిన సందర్భం. ఇంటిలోకి వచ్చిన సమయంలో స్విమ్మింగ్ పూల్‌ వద్ద నాకు ఒక గిఫ్ట్ ఇవ్వు నాన్న అని అడిగింది. అప్పుడే కప్ సాధించాలి. విజేతగా నిలవాలనే కోరిక కలిగింది. అలాగే నా ఫ్రెండ్ కూడా వచ్చి.. కప్పు తీసుకురా బిగిల్ అనే డైలాగ్ కొట్టాడు. ఆ రోజు రాత్రి నిద్ర కూడా సరిగా పట్టలేదు. అప్పటి నుంచి విన్నర్ కావాలనే కసి నాలో పెరిగింది అని వీజే సన్నీ చెప్పారు.

మానస్ సపోర్ట్ వల్లే ఈ కప్

మానస్ సపోర్ట్ వల్లే ఈ కప్


బిగ్‌బాస్ ఇంటిలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చింది మానస్. మానస్ నా వెనుక నిలిచిన ఓ కనిపించని శక్తి. వాడు లేకపోతే నేను ఇది సాధించే వాడిని కాదు. నా పక్కన ఉండి నన్ను నడిపించాడు. అలాగే నా ఫ్రెండ్స్, మచాస్ కూడా నాతోపాటు ట్రావెల్ లేదు. నాకు మొదటి నుంచి విన్నర్ కావాలి, మంచి గేమ్ ఇవ్వాలని నేను అనుకొన్నాను అని వీజే సన్నీ తెలిపారు.

వరస్ట్ ఫెర్ఫార్మర్ అని చెప్పి..

వరస్ట్ ఫెర్ఫార్మర్ అని చెప్పి..


వీకెండ్స్‌లో హోస్ట్ నాగ్ వచ్చి నన్ను రకరకాలుగా తిట్టాడు. అయితే నా తప్పు ఏమీ లేదని చెబుతాను. టాస్కుల సమయంలో నేను ఆడిన తీరు ఎదుటి వారిని డిఫెన్స్‌లో పడేసింది. దాంతో ఇంటిలోని కొందరు నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు నాపై కక్ష కట్టి నన్ను వరస్ట్ పెర్ఫార్మర్ అని ఇవ్వడం బాధ కలిగించింది. చాలా మందికి నేను నచ్చలేదు. అందుకే నన్ను టార్గెట్ చేశారు అని వీజే సన్నీ అన్నారు.

అప్పడం వివాదం గురించి

అప్పడం వివాదం గురించి

సిరి హన్మంతుతో గొడవ గురించి మాట్లాడుతూ.. గేమ్ ఆడుతుంటే వచ్చి నన్ను పట్టుకొన్నది. కాజల్ ఎవరినో డిస్ట్రబ్ చేస్తుంటే సిరి వచ్చి నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేసింది. నేను విసిరికొడితే కింద పడింది. ఆ తర్వాత నేను పక్కకు వెళ్లి కూర్చుంటే నాపై కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అప్పుడు నేను వారికి కౌంటర్ ఇచ్చాను. అప్పడం అయిపోతావనే గొడవ పీక్స్‌కు వెళ్లింది. ఆ తర్వాత నన్ను టార్గెట్ చేసి గిల్టీ బోర్డు మెడలో వేశారు. అయితే నేను అలాంటి వాడిని కాదు అని వీజే సన్నీ చెప్పారు.

అందుకే వారిని అడుకొన్నాను..

అందుకే వారిని అడుకొన్నాను..


నా కోపం వల్ల నేను ఇబ్బంది పడిన క్షణాలు ఉన్నాయి. ఐస్ గడ్డలు టాస్క్‌లో నన్ను స్వాప్ చేసిన తర్వాత నన్ను సిరి, షణ్ముఖ్ టార్గెట్ చేశారు. అయితే అప్పుడు నా గేమ్ నేను ఆడాను. దాంతో అందరి కాళ్లు దెబ్బ తిన్నాయి. నన్ను కెలికినందుకే నేను అలా చేయాల్సి వచ్చింది. ఆ టాస్క్‌లో అందర్నీ నేను ఆట ఆడించాను అని వీజే సన్నీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X