Bigg Boss Winner: 3వ రోజు ఓటింగ్‌లో ట్విస్ట్.. హాట్‌స్టార్‌లో ఒకరు.. మిస్‌డ్ కాల్స్‌లో మరొకరు టాప్

దేశంలోని పలు భాషల్లో ఎప్పుడో ప్రారంభం అయినా.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే వచ్చింది బిగ్ బాస్ షో. సరికొత్త కంటెంట్‌తో నడిచే కార్యక్రమమే అయినా.. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇలా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఐదోది కూడా ముగించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ సీజన్‌లో ఫినాలే వీక్ జరుగుతోంది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇక, ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో రోజు ఓటింగ్‌లో మాత్రం బిగ్ ట్విస్ట్ కనిపించిందట. తాజా సమాచారం ప్రకారం.. హాట్‌స్టార్‌లో ఒకరు.. మిస్‌డ్ కాల్స్‌లో మరొకరు టాప్ ఉన్నారట. ఆ వివరాలు మీకోసం!

14 వారాలు.. 14 మంది ఎలిమినేట్

14 వారాలు.. 14 మంది ఎలిమినేట్

భారీ అంచనాల నడుమ ప్రారంమైన ఐదో సీజన్‌కు 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారం ప్రియాంక సింగ్‌, పద్నాలుగో వారం కాజల్‌లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారం బయటకు వచ్చేశాడు.

టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్

టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్


భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 19 అంటే వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. దీంతో ఇప్పుడు ఫినాలేకు చేరుకున్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలలో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీళ్ల ఐదుగురి మధ్య పోరు ఆసక్తికరంగా సాగబోతుంది. దీంతో ఈ వారం మొత్తం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమకు నచ్చిన వాళ్లను గెలిపించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ వీక్ మరింత రంజుగా సాగబోతుంది.

వాళ్లిద్దరిలో ఒకరు విన్నర్ అంటూ

వాళ్లిద్దరిలో ఒకరు విన్నర్ అంటూ

తాజాగా జరుగుతోన్న సీజన్‌లో చాలా మంది టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అయితే, అందులో ఎందరో మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఇప్పుడున్న ఐదుగురూ తమ తమ స్టామినాను నిరూపించుకుని ఇక్కడి వరకూ చేరుకున్నారు. ఇక, ఫినాలేకు చేరుకున్న ఐదుగురిలో టైటిల్ పోటీ మాత్రం వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ మధ్యనే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరికీ ఆరంభం నుంచే ఎక్కువ ఆదరణ దక్కుతూ వస్తోంది. వీళ్లిద్దరి ఫ్యాన్స్ పోటాపోటీగా ఓట్లు వేస్తూ మరింత ప్రచారం చేస్తున్నారు.

ఆరంభం నుంచే హవా చూపిస్తూ

ఆరంభం నుంచే హవా చూపిస్తూ


బిగ్ బాస్ ఫినాలలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారు. దీంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఆసక్తికరంగా సాగబోతుంది. ఆదివారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవడంతో బుల్లితెర ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకుంటున్నారు. ఇక, ఈ వారం మొదటి నుంచే వీజే సన్నీ ఓటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అనాధికారిక ఓటింగ్‌లో సైతం అతడే హవాను చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మరో టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానంలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

మిగిలిన వాళ్ల స్థానాలు ఎలాగంటే

మిగిలిన వాళ్ల స్థానాలు ఎలాగంటే


ఈ సీజన్ ఆరంభం నుంచి చక్కని ఆటను కనబరచడంతో పాటు అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించిన వారిలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. టికెట్ టు ఫినాలే గెలుచుకుని అందరి కంటే ముందే ఫైనల్స్‌లో అడుగు పెట్టాడతను. ఇక, మొదటి రోజు ఓటింగ్‌లో శ్రీరామ్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు, వివాదరహితుడిగా ఉంటూ ప్రతి టాస్కులో వందకు వంద శాతం ఇచ్చిన మానస్‌ మాత్రం నాలుగో స్థానంలో ఉన్నాడట. ఇక, ఆడవాళ్లందరినీ దాటుకుంటూ ఫినాలేలో అడుగు పెట్టిన సిరి హన్మంత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మూడో రోజు ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్

మూడో రోజు ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్

ఆదివారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ కావడంతో బిగ్ బాస్ ప్రియులు తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఉత్సాహంగా ఓట్లు వేసుకుంటున్నారు. దీంతో ఎక్కువ ఓట్లు పోలవుతున్న వీజే సన్నీనే ఈ సీజన్‌కు విజేతగా నిలవబోతున్నాడని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మూడో రోజు అంటే మంగళవారం ఓటింగ్‌లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుందని ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కంటెస్టెంట్ల పొజిషన్స్‌లో మార్పులు కూడా కనిపించినట్లు తెలిసింది. దీంతో రాను రానూ మరిన్ని మార్పులు కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు.

అందులో ఒకరు.. ఇందులో ఒకరు

అందులో ఒకరు.. ఇందులో ఒకరు

బిగ్ బాస్ వర్గాల నుంచి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మూడో రోజు ఓటింగ్‌‌లో ఒక్కసారిగా తేడా కనిపించిందట. హాట్‌స్టార్ యాప్ ద్వారా పడిన ఓట్లలో వీజే సన్నీ టాప్‌లో ఉండగా.. మిస్‌డ్ కాల్స్ ద్వారా షణ్ముఖ్ జస్వంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయట. అంటే అందులో ఒకరు.. ఇందులో ఒకరు టాప్‌లో ఉన్నారని అంటున్నారు. మొదటి రెండు రోజులు సన్నీకి యాభై శాతం ఓట్లు పోలవగా.. మంగళవారం మాత్రం కొంత తగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో షన్నూకు మాత్రం ఓటింగ్ పెరిగిందట. శ్రీరామ్‌కు కూడా ఓటింగ్ పెరిగిందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X