Bigg Boss Telugu 7 బిగ్‌బాస్ టాప్ 5లో ఆ ఐదుగురు.. జాతకం చెప్పేసిన వీజే సన్నీ
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అందరికి పరిచయమైన వ్యక్తి వీజే సన్నీ. జర్నలిస్టుగా, యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన బిగ్‌బాస్‌లోకి వెళ్లి తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకొన్నాడు. అంతేకాకుండా విజేతగా కూడా నిలిచారు. బిగ్‌బాస్ అందించిన పాపులారిటీతో తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన నటించిన సౌండ్ పార్టీ సినిమా నవంబర్ 24వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మాట్లాడుతూ..
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ గురించి పెద్దగా చూసే అవకాశం రావడం లేదు. సౌండ్ పార్టీ సినిమా రిలీజ్ కారణంగా నా పరిస్థితి నామినేషన్, ఎలిమినేషన్ మాదిరిగా ఉంది. సినిమా బిజీలో ఉండటం వల్ల రెగ్యులర్‌గా ఫాలో కావడం లేదు. కానీ అప్పుడప్పుడు చూడటం, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం చేస్తున్నాను అని వీజే సన్నీ చెప్పాడు.

సౌండ్ పార్టీ సినిమాను బిగ్‌బాస్ తెలుగు 7 వేదికపై ప్రమోట్ చేద్దామని అనుకొన్నాను. కానీ అప్పటికే పెద్ద సినిమాలు తమ ప్రమోషన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకొన్నారు. నాకు నా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం దక్కలేదు. బిగ్‌బాస్ వేదికపై ప్రమోషన్స్ కోసం రెండు నెలల ముందే వారిని అప్రోచ్ కావాలి. ఆ కారణంగా మా సినిమా ప్రమోషన్స్‌కు అవకాశం దక్కలేదు అని వీజే సన్నీ తెలిపాడు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో టాప్ 5 ఎవరు ఉంటారనే విషయంపై స్పష్టంగా ఓ క్లారిటీకి రాలేకపోతున్నాను. ఒక వారం ఒకరు బాగా ఆడితే.. మరోవారం మరోకరు బాగా ఆడుతున్నారు. నాకే కాదు.. జనాలకే పిచ్చెక్కించేలా ఆడుతున్నారు. ఈ సారి టాప్ 5 లో ఎవరు ఉంటారు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది అని వీజే సన్నీ చెప్పాడు.
బిగ్‌బాస్ తెలుగు 7లో టాప్ 5లో ఎవరు ఉంటారని అడిగితే.. నాకు అనిపించిన వారి పేర్లు చెబుతాను. టాప్ 5లో శివన్న, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్ ఉంటారని అనుకొంటున్నాను. ఈ ఐదుగురిలో టఫ్ పోటీ నెలకొని ఉంది. ఇప్పుడే విజేత ఎవరని చెప్పలేం అని విజే సన్నీ తెలిపాడు.

బిగ్‌బాస్ తెలుగు 7 విజేత ఎవరనే విషయాన్ని చెప్పడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. నేను ఒకరిపేరు చెబితే.. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల అభిమానులు నన్ను ట్రోల్ చేస్తారు. అందుకే నేను ఎవరి పేరు చెప్పను. ప్రేక్షకుల తీర్పు ప్రకారమే ఆలోచిద్దాం. ఒక్కరి పేరు చెప్పినా నన్ను ఆడేసుకొంటారు. అందుకే తెలిసినా చెప్పకపోవడమే కరెక్ట్ అని వీజే సన్నీ అన్నాడు.


Click it and Unblock the Notifications











