Bigg Boss Telugu 5 Winner: సిరి హన్మంతు, మానస్ ఎలిమినేటెడ్.. ఆ ముగ్గురిలో విజేత ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ విజేత ఎవరో అనే విషయం అధికారికంగా కొద్ది గంటల్లో తేలిపోనున్నది. అయితే టైటిల్ రేసులో ఉన్న విజే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర ప్రథమ స్థానంలో ఉన్నారనే విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం అనధికారికంగా బిగ్‌బాస్ సీజన్ 5 విజేత ఖారారు అయిందనే సమాచారం అందింది. ఈ సీజన్ విజేత ఎవరంటే..

టాప్ 6 కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్
బిగ్‌బాస్ సీజన్ 5లో ఫైనలిస్టులుగా టాప్ 5లో సిరి హన్మంతు, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు. చివరి వారంలో టాప్ 6 కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్ ఇంటి నుంచి నిష్క్రమించారు. ఆర్జే కాజల్ ఫైనలిస్టుగా మారడానికి అవిశ్రాంత పోరాటం చేయడం బిగ్‌బాస్ అభిమానులను ఆకట్టుకొన్నది.

ఫినాలేకు ముఖ్య అతిథులుగా రణ్‌వీర్, దీపిక, ఆలియా
అయితే ఉత్కంఠగా మారిన బిగ్‌బాస్ ఫైనల్ విజేత ఎంపిక కోసం బాలీవుడ్ ప్రముఖులు తరలిరావడంతో ఈ ఫినాలేపై మరింత అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ నుంచి రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్, ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్‌తోపాటు రాంచరణ్ ముఖ్య అతిథులుగా రానుండటంతో బిగ్‌బాస్ తెలుగు 5 ఫినాలేపై భారీ అంచనాలు, ఆసక్తి పెరిగింది.

ఫినాలేలో నాని శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్
అయితే శనివారం అర్ధరాత్రి జరిగిన బిగ్‌బాస్ ఫైనల్ షూట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. ఈ వేదికపై ఆలియాభట్ RRR ప్రమోషన్స్ చేయడమే కాకుండా.. టాప్ కంటెస్టెంట్‌లో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను తన భుజాల మీదకు ఎత్తుకొన్నారు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ కోసం మాజీ బిగ్ బాస్ తెలుగు హోస్ట్ నానీ తన టీమ్‌తో కలిసి వేదికపైన మరిశారు. నాగార్జునను ఆటపట్టిస్తూ నానీ చేసిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

5వ కంటెస్టెంట్‌గా సిరి ఎలిమినేట్
తాజా సమాచారం ప్రకారం.. టాప్ 5లో ఉన్న సిరి హన్మంతు బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో 5వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యారని, ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆమె గతంలో ఎలిమినేట్ అయిన తాజా సీజన్ కంటెస్టెంట్లను కలిశారని బయటకు వచ్చింది.

4వ కంటెస్టెంట్‌గా మానస్ ఎలిమినేషన్
సిరి హన్మంతు ఎలిమినేషన్ తర్వాత మానస్ 4వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ కావడం జరిగింది అనే విషయం బయటకు వచ్చింది. అయితే ఇక అందరూ ఊహించినట్టే శ్రీరామచంద్ర, విజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ కోసం పోటీ పడ్డారు. అయితే శ్రీరామచంద్ర 25 లక్షల సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఇది అధికారికంగా రేపు షూట్ చేస్తారని తెలుస్తున్నది.

విజేతగా వీజే సన్నీ?
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు 5 విజేతగా వీజే సన్నీ నిలిచినట్టు ఓ వార్త వైరల్ అవుతున్నది. అయితే బిగ్‌బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసినట్టు తెలిసింది. అయితే ఓట్ల లెక్కింపు తర్వాత విజే సన్నీ విజేతగా నిలిచినట్టు స్పష్టమైంది. అయితే శ్రీరాం ఎలిమినేషన్ ప్రక్రియను, అలాగే షన్ను రన్నరప్‌గా, విజే సన్నీగా విన్నర్‌గా నిలిచే సన్నివేశాలను ఆదివారం ఉదయం షూట్ చేయనున్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











