నేనే బిగ్‌బాస్ విజేతను: అలీ రెజా.. ఎలిమినేషన్‌పై ఎన్నో అనుమానాలు?

Recommended Video

Bigg Boss Telugu 3 : Bigg Boss Telugu Season 3 Episode 50 Highlights

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమై 50 రోజులు పూర్తి చేసుకొన్నది. 100 రోజుల షోలో అర్ధభాగం ముగిసిపోయింది. ఎలాంటి జోష్ లేకుండా నిస్సారంగా సాగుతున్న షోలో తొలిసారి ప్రేక్షకులను భావోద్వేగంతో కుదిపేసే సంఘటన చోటుచేసుకొన్నది. బిగ్‌బాస్ ఫైనలిస్టు జాబితాలో ఫేవరేట్‌గా ప్రేక్షకులు భావిస్తున్న సమయంలో అలీ రెజా ఎలిమినేట్ కావడం ఇంటి సభ్యులనే కాకుండా అందర్ని షాక్‌కు గురి చేసింది. అయితే ఎలిమినేషన్ తర్వాత అలీ రెజా చూపించిన మనోధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. అంతేకాకుండా అలీని ఇంటి నుంచి పంపించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే..

మూల్యం చెల్లించిన అలీ రెజా

మూల్యం చెల్లించిన అలీ రెజా

బిగ్‌బాస్ తెలుగు 3 షోలో అలీ రెజా టాలెంట్‌తో సమయస్పూర్తి ఉన్న సెలబ్రిటీగా ఓ మార్కు సంపాదించుకొన్నాడు. అలాగే టాస్క్ ఏదైనా 100 శాతం ఎఫర్ట్ పెడుతాడనే పేరుంది. కాకపోతే ఉద్రేక స్వభావమే ఇంటి సభ్యులు ఆగ్రహానికి కారణమైంది. దాంతో ఎలిమినేషన్‌ ప్రక్రియలో మూల్యం చెల్లించాడనే వాదన కూడా వ్యక్తమవుతున్నది.

అలీ రెజా ఎలిమినేషన్‌తో

అలీ రెజా ఎలిమినేషన్‌తో

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్ట సేఫ్ కాగా.. అనూహ్యమైన పరిస్థితుల్లో అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. కాసేపు ఏం జరిగింది.. ఏం జరుగుతున్నదనే విషయం అలీ రెజాతోపాటు ఇంటి సభ్యులకు అర్ధం కాలేదు. అలీ ఎలిమినేట్ అయ్యాడనే విషయం తోటి సెలబ్రిటీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కంటతడి పెట్టిన శ్రీముఖి, శివజ్యోతి

కంటతడి పెట్టిన శ్రీముఖి, శివజ్యోతి

అలీ రెజా ఎలిమినేషన్‌లో ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, శివజ్యోతి (సావిత్రి) బాధ చెప్పనక్కర్లేదు. అలీ రెజా ఇంటిలో ఒక ఉండరనే విషయంతో కన్నీరుమున్నీరు కార్చారు. తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. తన బాధను దిగమింగుతూ ఇంటి సభ్యులకు ధైర్యం చెప్పే విధంగా ప్రవర్తించాడు. ఆ విషయం బుల్లితెర ప్రేక్షకులనే కాకుండా హోస్ట్‌ను విశేషంగా ఆకట్టుకొన్నది.

బిగ్‌బాస్‌ను గెలిచా

బిగ్‌బాస్‌ను గెలిచా

ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో ఏడుస్తున్న తోటి సెలబ్రిటీలను చూసి.. నా కోసం ఇంత మంది ఏడ్వటంతోనే నేను బిగ్‌బాస్ గెలుచుకొన్నాననే ఫీలింగ్ కలుగుతుంది. నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్న తోటి ఇంటి సభ్యులను చూసి హ్యాపీగా ఉంది. షో నుంచి ఎలిమినేట్ కావడం తనకు బాధ కలిగించడం లేదు అని అలీ రెజా అన్నాడు. ఇంటి సభ్యులు తీవ్ర రోదనల మధ్య అలీ రెజా ఇంటి నుంచి నిష్క్రమించాడు.

ఇప్పటి వరకు విజేతను నేనే..

ఇప్పటి వరకు విజేతను నేనే..

ఇంటి నుంచి హోస్ట్ నాగార్జున వద్దకు చేరుకొన్న అలీ రెజా అంతే మనోధైర్యాన్ని చూపించాడు. నాకు బిగ్‌బాస్ టైటిల్ గెలిచినంత ఆనందం ఉంది. గత 50 రోజుల షోలో నేనే విజేతను. ఇక మిగితా 50 రోజుల షోలో ఎవరు విజేతగా నిలిచినా నాకు సంబంధం లేదు అని నాగార్జునతో అలీ రెజా అన్నాడు. మళ్లీ అవకాశం వస్తే ఇంట్లోకి వెళ్తావా అనే నాగార్జున ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తప్పుకుండా వెళ్లడానికి ప్రయత్నిస్తాను అని అలీ అన్నాడు.

అలీ రెజా ఎలిమినేషన్‌పై అనుమానాలు

అలీ రెజా ఎలిమినేషన్‌పై అనుమానాలు

ఇక ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అలీ రెజాను ఊహించుకొన్నారు. అతడి తీరు, టాలెంట్, గ్లామర్, టాస్క్‌లలో చూపించిన చొరవ కూడా అందర్ని ఆకట్టుకొన్నది. అలాంటి కంటెస్ట్‌ను ఎలిమినేట్ చేయడంపై బుల్లితెర ప్రేక్షకుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా ఎలిమినేషన్‌పై పలు రకాలు అనుమానాలు లేస్తున్నాయి. అయితే ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X