అఖిల్ ప్యాంటులో ఐస్.. స్విమ్మింగ్ పూల్‌లో మోనాల్ రొమాంటిక్‌గా.. అమ్మా, సోహైల్ టార్గెట్ చేస్తూ

బిగ్‌బాస్ ఇంటిలో 54వ రోజు ఇంటి సభ్యుల ప్రవర్తనను బట్టి ఓ ఫన్ గేమ్ నడిపించాడు. ఈ గేమ్ సందర్భంగా అఖిల్, మోనాల్‌కు అహంకారులని పేరు పెడుతూ మెడలో ట్యాగులు వేశారు. ఈ టాస్క్ ప్రకారం వారిని ఇబ్బంది పెడితే అహంకారం ప్రదర్శించకుండా ఉండాలి. వారికి కోపం తెప్పించే ప్రయత్నం చేయాలి అంటూ ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ సూచించాడు. ఈ టాస్క్‌లో అఖిల్, మెనాల్ ఏం చేశారంటే...

 అహంకారుల జంటపై ఎటాక్

అహంకారుల జంటపై ఎటాక్

అహంకారుల జంట అఖిల్, మోనాల్‌ను ఇంటి సభ్యులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. అయితే టాస్క్ ప్రకారం వారు ఎలాంటి సమయంలోనూ కోపానికి రాకూడదు. ఈ క్రమంలో నాకు ఇలాంటి ట్యాగ్ ఎలా ఇస్తావు అంటూ అఖిల్‌తో సోహైల్ వాదనకు దిగారు. అయితే సోహైల్ వాదనకు నవ్వుతూ కనిపిస్తే.. నవ్వడం కాదు.. సమాధానం చెప్పు అంటూ సోహైల్ ఫైర్ అయ్యాడు. అయితే సోహైల్ సీరియస్‌ కావడం చూసి అఖిల్ వెళ్లి కౌగిలించుకొన్నాడు.

అఖిల్ బట్టలు విప్పు అంటూ

అఖిల్ బట్టలు విప్పు అంటూ

అయినా అఖిల్‌ను ఇరిటేట్ చేయడం సోహైల్ ఆపలేదు. నేను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు నవ్వుతున్నావంటూ అడుగుతుంటే మధ్యలో మెహబూబ్ దూరాడు. నాకు అఖిల్ బాడీ చూడాలని ఉంది. బట్టలు విప్పు అంటూ వెంటపడ్డాడు. ఆ తర్వాత వారికి అమ్మా రాజశేఖర్ జతకలిశాడు. ముగ్గురు కలిసి అఖిల్‌ను ఇరిటేట్ చేయడానికి ప్రయత్నించారు.

అఖిల్ ప్యాంటులో ఐస్ వేసి

అఖిల్ ప్యాంటులో ఐస్ వేసి

ఇక అంతటితో ఆగకుండా అఖిల్ ప్యాంటులో అమ్మా రాజశేఖర్ ఐస్ ముక్కలు వేశాడు. వెనుక నుంచి ఐస్ ముక్కలు వేసి చేతులను గట్టిగా పట్టుకొన్నారు. దాంతో చల్లదనానికి తట్టుకోలేక అఖిల్‌ అటు ఇటూ పరుగులు పెట్టారు. ఆ తర్వాత అఖిల్‌ను ఏడిపించేందుకు హారిక ప్రయత్నించడంతో సోహైల్ కూడా జాయిన్ అయ్యాడు.

మోనాల్ తలపై నీళ్లు పోసి

మోనాల్ తలపై నీళ్లు పోసి

ఇక అహంకారులు జంటలోని మోనాల్‌ను కూడా ఇంటి సభ్యలు వదల్లేదు. మోనాల్‌పై అవినాష్ బాటిల్‌తో నీళ్లు పోశాడు. మోనాల్‌కు కోపం తెప్పించేందుకు ఇంటి సభ్యులు శతవిధాల ప్రయత్నించారు. అంతేకాకుండా అఖిల్‌ను, మోనాల్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి తోశాడు. దాంతో అఖిల్ నీటిలో నుంచి ఏదో విసిరితే కోపం వచ్చిందంటూ ఇంటి సభ్యులు అరిచారు.

అఖిల్, మోనాల్‌పై కొడిగుడ్డు కొట్టి

అఖిల్, మోనాల్‌పై కొడిగుడ్డు కొట్టి

ఇక స్విమ్మింగ్ పూల్‌లో పడిన అఖిల్, మోనాల్‌పై కోడిగుడ్లు కొట్టి తలపై పోసేందుకు ప్రయత్నించాడు. అమ్మా రాజశేఖర్ మగ్గులో ఉన్న కోడిగుడ్డు లిక్విడ్‌ను తలపై పోశాడు. ఆ సమయంలో మోనాల్‌ను కవర్ చేస్తూ అఖిల్ గట్టిగా పట్టుకొన్నాడు. నీళ్లలో రొమాంటిక్‌గా ఆ ఇద్దరు కనిపించారు. చివరకు మోనాల్‌ తలపై కోడిగుడ్డు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం కనిపించింది.

సోహైల్, మెహబూబ్‌పై అఖిల్ గుర్రుగా

సోహైల్, మెహబూబ్‌పై అఖిల్ గుర్రుగా

అయితే టాస్క్ సందర్భంగా ఇరిటేట్ చేస్తుంటే అఖిల్ ఫీలవుతున్నాడేంటి అంటూ సోహైల్‌తో మెహబూబ్ అంటూ కనిపించాడు. బెడ్డుపై ఉన్న బట్టలు చిందరవందర చేస్తే వచ్చి ఇద్దరు క్లీన్ చేయని అఖిల్ అడుగుతున్నాడు అంటూ సోహైల్ సమాధానం ఇచ్చారు. కొంటే రాక్షసుల టాస్క్ సమయంలో మనం ఇలాంటి పనులు చేశాం. ఇప్పుడు దానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో అర్ధం కావడం లేదు అంటూ సోహైల్ కాస్త సీరియస్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X