Bigg Boss Telugu 6:ఆగ్రహంతో రెచ్చిపోయిన కూల్ బాయ్.. సంచాలక్ రేవంత్ పట్టించుకోకపోవడంతో ఫైర్
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. టాస్క్ ల్లో ఫిజికల్ అవ్వడాలు, వీక్ నెస్ లపై దెబ్బ కొట్టడం, ఫేవరిటిజం చూపించడం వంటి తదితర ఆసక్తకిర అంశాలతో జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఇంటి సభ్యుల మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ ను ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో స్నేక్స్ టీమ్ గెలిచి ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్స్ గా మరో రౌండ్ కు చేరుకున్నారు. అలాగే లాడర్స్ టీమ్ నుంచి మెరీనా ఎంపికైంది. తాజాగా వీరందరికీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో పక్షపాతం, అగ్రెషన్ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన నవంబర్ 10 ఎపిసోడ్ ప్రోమో వివరాల్లోకి వెళితే..

ఏకంగా 8 ఓట్లతో ఇనయా సుల్తానా..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ పదో వారం నామినేషన్స్ అరుపులు, గొడవలతో రంజుగానే సాగింది. ఈ పదో వారం నామినేషన్లలో మొత్తం 9 మంది ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా శ్రీ సత్య, ఎవరు నామినేట్ చేయకపోవడంతో రాజ్, రోహిత్ సేఫ్ అయ్యారు. కానీ హౌజ్ మొత్తం ఇనయా సుల్తానాను టార్గెట్ చేసింది. ఆమెకు ఏకంగా 8 ఓట్లు పడగా.. కొంతమంది ఒక్క ఓటుతో నామినేషన్ ఎదుర్కొన్నారు.

స్నేక్స్ అండ్ లాడర్స్ టాస్క్..
బిగ్ బాస్ తెలుగు 6 పదో వారం నామినేషన్లలో బాలాదిత్య, మెరీనా అబ్రహం, కీర్తి భట్, జబర్దస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, సింగర్ రేవంత్, రివ్యూవర్ ఆదిరెడ్డి, శ్రీహాన్ చోటు, ఇనయా సుల్తానా ఉన్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లలో ఇంటి సభ్యులందరికీ స్నేక్స్ అండ్ లాడర్స్ టాస్క్ ఇచ్చారు. వారిలో స్నేక్స్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, ఫైమా, రోహిత్, వాసంతి, కీర్తి భట్, వాసంతి కంటెండర్ టాస్క్ కు వెళ్లారు.

వస్తా నీ వెనుక టాస్క్..
అలాగే నాగమణి ఉన్న కారణంగా లాడర్స్ టీమ్ నుంచి మెరీనా సెలెక్ట్ అయింది. స్నేకే టీమ్ లోని శ్రీహాన్ కు పనిష్ మెంట్ కారణంగా తనకు బదులు శ్రీ సత్యకు కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఇచ్చాడు. వీరందరికి మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన నవంబర్ 10 గురువారం ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులకు వస్తా నీ వెనుక అనే టాస్క్ ఇచ్చారు.

రోహిత్ బాడీని ఫైమా టచ్ చేయడంతో..
ఒక్కొక్కరు బిన్నీ బ్యాగ్స్ వేసుకుని మూడు సర్కిల్ లో నడుస్తారు. ఇలా రెండో సర్కిల్ లో తిరిగే సమయానికి కీర్తి అండ్ మెరీనా అవుట్ అయ్యారు. తర్వాత సర్కిల్స్ లో ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, శ్రీ సత్య పోటీ పడ్డారు. రోహిత్ బాడీని ఫైమా టచ్ చేయడంతో అలా చేయొద్దని చెప్పాడు. మధ్యలో రాజ శేఖర్ ఫైమాకు గేమ్ గురించే చెబితే.. నువ్ వచ్చి ఆడు అంటూ ఫైర్ అయ్యాడు రోహిత్. తర్వాత పోటీ దారులు బస్తాలు చేత్తో పట్టుకోకూడదని అనౌన్స్ మెంట్ వచ్చింది.

రేవంత్ పట్టించుకోలేదు..
ఈ అనౌన్స్ మెంట్ తో ఆట మరింత రసవత్తరంగా మారింది. ఎస్ అంటూ సంచాలక్ అయిన రేవంత్ అనుకున్నాడు. ఫైమా బ్యాగ్ ను చించేసటందుకు రోహిత్, ఆదిరెడ్డి ట్రై చేశారు. తర్వాత ఆదిరెడ్డి తన బ్యాగ్ పట్టుకుంటూ రోహిత్ బ్యాగ్ చింపడానికి ప్రయత్నించాడు. బ్యాగ్ పట్టుకోకూడదని రోహిత్ గట్టిగా అరుస్తున్నా రేవంత్ పట్టించుకోలేదు. చివరిగా రోహిత్ ఎంత చెప్పినా రేవంత్ వినకపోయేసరికి రోహిత్ బాగా కోపం తెచ్చుకున్నాడు. కోపంతో బ్యాగ్ ను తన్నాడు. మెరీనా వెళ్లి కూల్ చేసేందుకు ప్రయత్నించినా.. అసలు వినిపించుకోలేదు రోహిత్.


Click it and Unblock the Notifications











