twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Nominations: 10వ వారం నామినేషన్స్ లీక్.. ఆ ముగ్గురు తప్ప అందరూ.. ముఖంపై నీళ్లు విసరడంతో!

    |

    వెరైటీ సన్నివేశాలు.. కంటెస్టెంట్ల మధ్య అన్ని రకాల ఎమోషన్స్.. పైగా ఊహకే అందని ట్విస్టులతో సాగుతూ.. ప్రేక్షకులకు పదిహేను వారాల పాటు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే ఈ షో అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే తెలుగులో ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో నామినేషన్స్, ఎలిమినేషన్స్ షాకింగ్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 10వ వారానికి సంబంధించిన నామినేషన్స్ లిస్ట్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

    ఇప్పుడిప్పుడే పెరుగుతోంది

    ఇప్పుడిప్పుడే పెరుగుతోంది

    భారతదేశంలోని ఎన్నో భాషల్లో వస్తున్నా తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్థాయిలో స్పందన దక్కుతోందన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆరో దాన్ని కూడా సరికొత్త హంగులతో నడుపుతున్నారు. కానీ, దీనికి రేటింగ్ అంతగా రావట్లేదు. అయితే, క్రమంగా దీనికి రెస్పాన్స్ పెరుగుతోంది. దీంతో రేటింగ్ కూడా కొద్ది కొద్దిగా వృద్ధి చెందుతోంది.

    బట్టలు లేకుండా అమ్మాయి: అలాంటి పిక్ షేర్ చేసిన దీప్తి సునైనాబట్టలు లేకుండా అమ్మాయి: అలాంటి పిక్ షేర్ చేసిన దీప్తి సునైనా

    21మందిలో 9మంది అవుట్

    21మందిలో 9మంది అవుట్

    ఈ సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూలు వెళ్లిపోయారు.

    వాళ్లు ఎలిమినేట్.. ఆసక్తిగా

    వాళ్లు ఎలిమినేట్.. ఆసక్తిగా

    బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఎంతో ఆసక్తికరంగా మారాయి. మరీ ముఖ్యంగా ఇందులో టాప్ ప్లేయర్లు అనుకున్న వాళ్లు చాలా మంది వెళ్లిపోయారు. ఫలితంగా నామినేషన్స్ టాస్కులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక, తొమ్మిదో వారం గీతూ వెళ్లిపోవడంతో పదో వారం నామినేషన్స్ టాస్కు మీద అందరూ దృష్టి సారించారని చెప్పొచ్చు.

    వాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలేవాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలే

    పదో వారం... నీళ్లు చల్లుతూ

    పదో వారం... నీళ్లు చల్లుతూ

    గతంలో మాదిరిగానే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కూడా నామినేషన్స్ టాస్కులు ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి. ప్రతి వారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అప్పుడే కొంత మంది మధ్య దూరం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు పదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్లు నామినేట్ చేసే వాళ్ల ముఖాలపై నీళ్లు కొట్టాల్సి ఉంటుంది.

    గొడవలతో రచ్చ రచ్చగానే

    గొడవలతో రచ్చ రచ్చగానే

    బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఇనాయా సుల్తానాను కొందరు కంటెస్టెంట్లు టార్గెట్ చేశారు. దీంతో ఆమె వాళ్లతో గొడవ పెట్టుకుంది. అలాగే, రేవంత్ - ఇనాయా, ఆది రెడ్డి - ఇనాయా మధ్య కూడా పెద్ద పెద్ద వాగ్వాదాలు జరిగినట్లు తెలుస్తోంది.

    నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!నోయల్‌పై ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు: పెళ్లైన 16 రోజులకే అలా.. అక్కడ యాసిడ్ పోస్తానన్నాడు అంటూ!

    ఈసారి 9 మంది నామినేట్

    ఈసారి 9 మంది నామినేట్

    ఆరో సీజన్‌లోని పదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్లు తెలిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారని సమాచారం. అందులో ఇనాయా సుల్తానా, శ్రీహాన్ చోటు, బాలాదిత్య, రేవంత్, కీర్తి భట్, మెరీనా, వాసంతి కృష్ణన్‌, ఆది రెడ్డి, ఫైమాలు నామినేషన్‌లో ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా లీకైంది.

    ఆ ముగ్గురు మాత్రమే సేఫ్

    ఆ ముగ్గురు మాత్రమే సేఫ్

    బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిది వారాలకు గానూ తొమ్మిది మంది ఎలిమినేట్ అవడంతో 12 మంది మిగిలారు. అలాంటిది ఈ వారం 9 మంది నామినేషన్‌లోకి వచ్చినట్లు తెలిసింది. అంటే ఈ వారం కెప్టెన్ శ్రీ సత్యతో పాటు రోహిత్, రాజశేఖర్‌లు మాత్రమే సేఫ్ అయ్యారని అంటున్నారు.

    English summary
    Bigg Boss Telugu 10th Season Running Successfully. Revanth, Inaya, Shrihan, Faima, Adi Reddy and other 4 Contestants Gets Nominated in 10th Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X