twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 నువ్ రెచ్చిపోవద్దు బ్రో.. రేవంత్-ఆదిరెడ్డి-శ్రీహాన్ మాటల యుద్ధం

    |

    అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో చాలా ప్రాముఖ్యత సాధించిన షో బిగ్ బాస్. అనేక అనుమానాలు, అంచనాల నడుమ ఈ రియాలిటీ షో తెలుగులో మొదటగా 2017లో ప్రారంభమైంది. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వహించి సూపర్ సక్సెస్ కొట్టారు. తారక్ హోస్టింగ్, విపరీతమైన ప్రేక్షకాదరణతో మంచి విజయం సాధించింది. దీంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఇప్పటికీ 13 మంది ఎలిమినేటై వెళ్లిపోగా.. 13వ వారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. నవంబర్ 28 సోమవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

    ప్రస్తుతం 8 మంది..

    ప్రస్తుతం 8 మంది..

    బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటికీ ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ కూడూ దాదాపు పూర్తి దశకు వచ్చింది. ఇప్పటికీ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 84 రోజులు 85 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. గత ఎపిసోడ్ లో 12వారం ఎలిమినేషన్ కింద మోడల్ రాజశేఖర్ హౌజ్ వీడి వెళ్లిపోయాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో 8 మంది ఉన్నారు.

    బిగ్ బాస్ హౌజ్ లోకి 21 మంది..

    బిగ్ బాస్ హౌజ్ లోకి 21 మంది..

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ కి 21 మంది కంటెస్టెంట్లు రాగా ప్రస్తుతం 13వ వారానికి 8 మంది మిగిలారు. ఇక ప్రతి సోమవారం నామినేషన్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత రంజుగా సాగినట్లు తెలుస్తోంది. ఈ నామినేషన్ల ప్రక్రియను షూట్ చేసే విధానం ద్వారా పెట్టారు. ఎప్పటిలానే ఒక్కొక్కరుగా వచ్చి నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుడికి కారణం చెప్పి చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పారు.

    ఇంకో పదేళ్లయినా..

    ఇంకో పదేళ్లయినా..

    ఫైమా వచ్చి రోహిత్ ను నామినేట్ చేసింది. ఈ హౌజ్ లో ఫిజికల్ స్ట్రాంగ్ ఉండేది రేవంత్ తర్వాత నువ్వే అని చెప్పింది ఫైమా. స్ట్రాంగ్ అని నన్ను నామినేట్ చేస్తున్నావ్.. ఇప్పటివరకు నేను కెప్టెన్ అయ్యానా అని ఫైమాను రోహిత్ అడిగితే సైలెంట్ గా చూస్తూ ఉంది. ఇక ఆదిరెడ్డి గతవారం టాస్క్ లో రేవంత్ కి తనకు జరిగిన గొడవ గురించి మాట్లాడాడు. ఆరోజు వేసిన వీడియోకు ముందు జరిగిన వీడియో అక్కడ లేదు. ఇప్పుడు, ఎప్పుడూ, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాటపై స్టాండ్ అయి ఉంటానని ఆదిరెడ్డి చెప్పాడు.

    నువ్ రెచ్చిపోవద్దు బ్రో..

    నువ్ రెచ్చిపోవద్దు బ్రో..

    ఆదిరెడ్డి అన్న మాటకు నాగార్జున గారు చూపించిన వీడియోకు నేను స్టాండ్ అయ్యాను. ఫ్రూఫ్ మ్యాటర్స్ అని మీరే చాలా సార్లు చెప్పారని రేవంత్ అన్నాడు. దీనికి ఫ్రూఫ్స్ మ్యాటర్స్ కాదు.. నీ మనసాక్షికి ఏం తెలుసు అన్నది మ్యాటర్స్ అని ఆదిరెడ్డి చెప్పాడు. దీంతో అది కరెక్టా కాదా అనేది జనాలు చెబుతారని రేవంత్ అంటే.. జనాలు చెబుతారు, నువ్ రెచ్చిపోవద్దు బ్రో.. నువ్ ఒప్పుకో.. ఒప్పుకోకు అని ఆదిరెడ్డి అన్నాడు.

    ఒక్క రూపాయే రాసేవాన్ని..

    ఒక్క రూపాయే రాసేవాన్ని..

    నేను ఒప్పుకోను అనిపిస్తే.. నువ్వెళ్లి నామినేషన్ వేసి వెళ్లిపో అని రేవంత్ అంటే.. ఏంది వెళ్లిపోయేది. చెబితే విను.. లేకుంటే పోయి సోఫాలో కూర్చ. ఎవడు భయపడడు ఇక్కడా అని ఆదిరెడ్డి గట్టిగా అరిచాడు. తర్వాత రేవంత్ గమీదా స్టోరీ తీసుకొచ్చాడు. తర్వాత వచ్చిన శ్రీహాన్.. ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. ఇమ్యూనిటీ పవర్ కోసం చెక్ అమౌంట్ గురించి వాదించుకున్నారు. గరిష్ట ఇచ్చి కనిష్ట ఇవ్వలేదంటే నేనైతే ఒక్క రూపాయే రాసేవాన్ని అని శ్రీహాన్ అన్నాడు.

    బేసిక్ కామన్ సెన్స్ అన్నా..

    అంతా అయిపోయాకా ఎన్నో మాట్లాడతారు బ్రో.. రూ. లక్షా 50 వేలు రాసిన శ్రీహాన్.. రూ. లక్ష రాసిన వాడిని తక్కువ రాసి ఉంటే బాగుండేదనడం కామెడీగా ఉందని ఆదిరెడ్డి అన్నాడు. నాది ఫిక్స్ డ్ ప్రైస్, నాకు బేరం ఆడే అవకాశం ఉందా అని శ్రీహాన్ అడిగాడు.. అలాయి అయింటే బాగుండేదని ఆదిరెడ్డి అన్నాడు. దీనికి బేసిక్ కామన్ సెన్స్ అన్నా కనిష్టం చెప్పనప్పుడు రూపాయి అద్దరూపాయి అయినా రాయొచ్చని శ్రీహాన్ అన్నాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే శ్రీహాన్, ఇనయా సుల్తానా తప్పా మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నట్లు సమాచారం.

    English summary
    Bigg Boss Telugu 6: Revanth Adireddy Shrihan Heavy Arguments In 13th Week Nominations In November 28 Episode Promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X