Bigg Boss Telugu 6 Voting: టాప్ 5లో చోటు కోసం తీవ్రమైన పోటీ.. ఆ ఇద్దరి మద్యే అసలైన ఫైట్!

బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకోవడానికి ఇంకా ఎంతో సమయం లేదు. టాప్ 5 లోకి వెళ్లడానికి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంతో బలంగా పోరాడుతున్నారు. అయితే మొత్తానికి 15వ వారం కూడా ఓటీటీ ప్రక్రియ మొదలైపోయింది. ఈ వారం ఓట్లు అయితే చాలా కీలకంగా కానున్నాయి. ఎందుకంటే టాప్ 5లోకి వెళ్లడానికి ఇదే మంచి సమయం కాబట్టి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆడియెన్స్ ను మరింత అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది.. ఇక ఈవారం శ్రీహన్ మినహాయిస్తే మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్ ఎవరెవరు ఏ స్థాయిలో ఓట్లు అందుకుంటున్నారు? ఏ స్థానంలో ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

శ్రీహన్ ఫైనల్స్ లోకి వెళ్ళడంతో..

శ్రీహన్ ఫైనల్స్ లోకి వెళ్ళడంతో..

మొత్తంగా గతవారం హౌస్ లో ఏడు మంది కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అందులో శ్రీహన్ ముందే టికెట్టు ఫినాలే ద్వారా ఫైనల్స్ లోకి వెళ్లిపోయాడు. అతనికి మొదటి నుంచి కూడా జనాల్లో మంచి గుర్తింపు అయితే అందుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు శ్రీహాన్ వెళ్లిపోవడం వలన రేవంత్ తర్వాత రెండవ స్థానం కోసం మిగతా వాళ్ళు చాలా పోటీ పడుతున్నారు.

రేవంత్ నెంబర్ వన్

రేవంత్ నెంబర్ వన్

అయితే రేవంత్ మళ్ళీ ఎప్పటిలానే అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రతివారం కూడా అతనికి అత్యధిక ఓట్లు వస్తున్నాయి. మూడు వారాల క్రితం కొంత ఓట్లు తగ్గినప్పటికీ కూడా గత రెండు వారాలు మాత్రం రేవంత్ అయితే జనాల సపోర్ట్ అయితే బాగానే అందుకుంటున్నాడు. దీంతో అతను తప్పకుండా టాప్ ఫైనల్స్ లోకి వెళ్లడం ఖాయమని క్లారిటీ వచ్చేసింది.

రెండవ స్థానంలో

రెండవ స్థానంలో

రేవంత్ తర్వాత అతని స్థానంలో గతంలో అయితే శ్రీ అనుకొనసాగుతూ వచ్చాడు. ఇక అతను ఫైనల్స్ లోకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు రెండవ స్థానం కోసం మిగతా వాళ్ళు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ శ్రీ సత్య మధ్యలో పోటీ ఎక్కువగా కొనసాగుతోంది. అయితే ఇద్దరిలో రోహిత్ అయితే రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఊహించని విధంగా మిగతా వారి కంటే అతనికి ఈ మధ్య ఓట్లు ఎక్కువగా వస్తున్నాయి.

శ్రీ సత్యకు ఏ స్థానంలో అంటే..

శ్రీ సత్యకు ఏ స్థానంలో అంటే..

ఇక మూడవ స్థానంలో శ్రీ సత్య కొనసాగుతూ ఉండడం విశేషం. ఆమె గత రెండు వారాల క్రితం అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఆఖరి స్థానంలో కొనసాగుతూ వచ్చింది. కానీ గత వారం జరిగిన టాస్క్ లలో కొంత క్రేజ్ అయితే పెంచుకుంది. రేవంత్ విషయాలతో తప్పితే మిగతా అన్ని విషయాల్లోనూ ఆమెకు మంచి గుర్తింపు అయితే ఉంది. అందుకే ఓ వర్గం జనాలు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఇప్పుడు శ్రీ సత్య మూడవ స్థానంలో ఉంది.

చివరలో ఉన్న ఆ ఇద్దరు

చివరలో ఉన్న ఆ ఇద్దరు

ఇక చివరి రెండు స్థానాల కోసం ఇప్పుడు కంటెస్టెంట్స్ మధ్యలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఎలాగూ ఒకరు ఫైనల్స్ లోకి వెళ్లారు కాబట్టి మరో నలుగురు టాప్ 5 లోకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో చివరలో ఇద్దరిలో ఎవరో ఒకరు డామినేట్ చేస్తూ ఉండాలి.

చివరలో ఉన్న అది రెడ్డి కీర్తి ఇద్దరికీ కూడా కేవలం కొంత శాతం డిఫరెన్స్ తోనే ఓట్లు పడుతున్నాయి. అయితే కీర్తి కంటే ముందుగా ఆదిరెడ్డి 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అందరికంటే తక్కువగా ఓట్లు అందుకున్న వారిలో ఇప్పుడు కీర్తి ఉంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X