Bigg Boss Telugu 6: ఆది రెడ్డి గురించి ఆసక్తికరమైన పాయింట్స్.. బిగ్ బాస్ రివ్యూలతోనే క్రేజ్..
బిగ్ బాస్ ద్వారా కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా మరి కొంతమంది కూడా మంచి క్రేజ్ అందుకుంటూ ఉంటారు. ఇక అందులో బిగ్ బాస్ పై ప్రత్యేకంగా రివ్యూలు ఇచ్చేవారికి కూడా ఇటీవల కాలంలో ఆడియన్స్ లో మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక ఆ విధంగా బిగ్ బాస్ రివ్యూలతోనే ఎక్కువగా ఆకట్టుకున్న ఆదిరెడ్డి గురించి సోషల్ మీడియా జనాలకు బాగా తెలుసు. ఇక ఇప్పుడు అతను బిగ్ బాస్ సీజన్ 6 లో 18 వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అలాగే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ విధంగా హైలెట్
ఆదిరెడ్డి పూర్తి పేరు వెంకట ఆది నారాయణ రెడ్డి. ఆది మొదటి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ వచ్చాడు. కేవలం టెలివిజన్ షోల గురించి మాత్రమే కాకుండా ఇతర క్రీడలకు సంబంధించిన రివ్యూలు అలాగే మరికొన్ని సామాజిక అంశాలపై కూడా నిత్యం ఏదో ఒక తరహాలో స్పందిస్తూ హైలైట్ అవుతూ వస్తున్నాడు. ఎక్కువగా అయితే అతను క్రికెట్ విశ్లేషణ, ఫాంటసీ క్రికెట్ కు నిపుణుడిగా కూడా క్రేజ్ అందుకున్నాడు.

బిగ్ బాస్ లీక్స్
ఒక తెలుగులో బిగ్ బాస్ మొదలైన తర్వాత ఆదిరెడ్డికి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ పెరిగింది. కంటెస్టెంట్స్ గురించి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి కూడా తనదైన శైలిలో విశ్లేషిణ ఇచ్చిన ఆదిరెడ్డి.. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారు అలాగే స్పెషల్ గెస్ట్ ఎవరు అంటూ ఇలా అనేక రకాల విషయాలు కూడా తన సోషల్ మీడియాలో లీక్ చేస్తూ కూడా క్రేజ్ అందుకుంటూ వచ్చాడు.

యూట్యూబర్ గా..
ఇక నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి తన విద్యాభ్యాసాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తి చేసుకున్నాడు. అతను ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా ఒక చిన్న కంపెనీలో కూడా వర్క్ చేశాడు. అనంతరం కొత్తగా ఏదైనా సాధించాలి అనే కోరికతో మొదట యూట్యూబ్ రివ్యూవర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. అందులోనే ఎన్నో రకాల సినిమాల రివ్యూలు ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వస్తున్నాడు.

ఎక్కువగా రివ్యూలు ఇస్తూ..
ఆదిరెడ్డి మొదట 2018 లోనే మూవీ క్రిక్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ను మొదలు పెట్టాడు. సినిమాలపై అలాగే సోషల్ ఇన్సిడెంట్స్ పై అందులో రివ్యూలు ఇస్తూ వచ్చిన ఆదిరెడ్డి ఆ తర్వాత తెలుగులో ఫాంటసీ క్రికెట్ ఎక్స్ పర్ట్ గా కూడా మంచి గుర్తింపునందుకున్నాడు. దాదాపు లక్ష వరకు అతనికి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇక 2019 నుంచి ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూ ఇస్తూ వస్తున్నాడు.

బిగ్ బాస్ 6లో బలమైన కంటెస్టెంట్ గా
బిగ్ బాస్ వీడియోలతోనే ఆదిరెడ్డి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. గతంలో కంటే అతనికి బిగ్ బాస్ రివ్యూల ద్వారా చాలా మంచి గుర్తింపు లభించింది. ఇక 2020లో కవిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను తన ఫ్యామిలీకి సంబంధించిన అనేక రకాల విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 6 వ సీజన్ లో ఒక బలమైన కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్న ఆదిరెడ్డి ఎలాంటి క్రేజ్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











