twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: మళ్లీ హౌజ్ లో ఆ బూతు పదం.. ఆమెపై అక్కడ చేయి వేసి అలా.. తట్టుకోలేక కన్నీళ్లు

    |

    అత్యధికంగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ముందుగా వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ షోను భారతదేశంలో ముందుగా హిందీ భాషలో బిగ్ బాస్ పేరుతో స్టార్ట్ చేశారు. హిందీలో ఈ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు. తెలుగులో వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 12వ వారం నామినేషన్ల ప్రక్రియను కన్ఫెషన్ రూమ్ లో నిర్వహించారు. ఈ వారం నామినేషన్లలో మొత్తం కెప్టెన్ రేవంత్, కీర్తి భట్ మినహా ఏడుగురు నామినేషన్లలో ఉన్నారు.

    కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్స్..

    కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్స్..

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సీజన్ ముందుగా మందకోడిలా సాగిన క్రమక్రమంగా జోరు పెంచింది. బిగ్ బాస్ సీజన్ లో నామినేషన్ల పర్వం మంచి హీట్ తో సాగుతుంది. అయితే గతవారం చాలా కూల్ గా, సాఫీగా సాగింది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ కన్ఫెషన్ రూమ్ లో నిర్వహించారు.

    ఫెయిర్ గేమ్ ఆడలేదని..

    ఫెయిర్ గేమ్ ఆడలేదని..

    నామినేషన్ లో ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాల్సిన విషయం తెలిసిందే. ఎవరినీ నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోను ముక్కలు చేసి కారణం చెప్పాలని అడిగారు బిగ్ బాస్. ముందుగా వచ్చిన రోహిత్.. శ్రీహాన్, ఫైమాలను నామినేట్ చేశాడు. టాస్క్ లో మెరీనా విషయంలో శ్రీహాన్ గట్టిగా అరవడంపై శ్రీహాన్ ను, సంచాలక్ గా ఉన్న ఫైమా ఫెయిర్ గేమ్ ఆడలేదనే కారణాలతో ఇద్దరిని నామినేట్ చేశాడు.

    రూల్ బ్రేక్ చేసినందుకు..

    రూల్ బ్రేక్ చేసినందుకు..

    శ్రీహాన్ అండ్ శ్రీసత్యను నామినేట్ చేశాడు రాజశేఖర్. గత వారం టాస్క్ లో రోహిత్ కోప్పడ్డాడని అతన్ని శ్రీహాన్ నామినేట్ చేశాడు. ఈవారం టాస్క్ లో మెరీనాపై శ్రీహాన్ అరవడం కరెక్ట్ కాదనిపించిందని, చెక్ రాసే గేమ్ లో వేరే వాళ్ల అమౌంట్ తగ్గించడం ఇష్టం లేదన్న శ్రీహాన్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ లో రూ. 1.5 లక్షలు పెట్టడం నచ్చలేదని చెప్పాడు రాజ్. అలాగే చెక్ టాస్క్ లో అమౌంట్ ను ఎవరితో డిస్కస్ చేయొద్దన్న బిగ్ బాస్ రూల్ ను బ్రేక్ చేసినందుకు శ్రీసత్యను నామినేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

    వాలిడ్ రీజన్ చెప్పుమన్న బిగ్ బాస్..

    వాలిడ్ రీజన్ చెప్పుమన్న బిగ్ బాస్..

    రోహిత్, రాజశేఖర్ లను నామినేట్ చేసింది శ్రీసత్య. రాజ్ అయితే మూడు వారాల నుంచి నామినేషన్స్ నుంచి సేవ్ అవుకుంటూ వస్తున్నాడని అతన్ని నామినేట్ చేసింది శ్రీసత్య. తర్వాత శ్రీసత్య నామినేషన్ కు వాలిడ్ రీజన్ చెప్పాల్సిందిగా బిగ్ బాస్ చెప్పాడు. దీంతో శ్రీసత్య షాక్ అయి ఈవారం టాస్క్ లో రాజ్ సరిగ్గా గేమ్ ఆడలేదన్న కారణం చెప్పింది. అలాగే ఈ వారం కారణాలు ఏం లేనందున, గత వారం రీజన్ తో రోహిత్ ను నామినేట్ చేస్తున్నట్లు శ్రీసత్య తెలిపింది.

    గతవారం కారణంతో..

    గతవారం కారణంతో..

    గతవారం టాస్క్ లో రోహిత్ ఎఫ్.. వర్డ్ ఉపయోగించాడని.. అదేవారం నామినేషన్లలో చెప్పిన కారణాన్నే శ్రీసత్య తెలిపింది. అయితే అప్పుడెప్పుడో హీట్ మూమెంట్ లో జరిగిన బూతు పదాన్ని మరోసారి నామినేషన్లలో పెట్టింది శ్రీసత్య. నిజానికి అప్పుడు టాస్క్ లో రోహిత్ ఆ పదం వాడలేదు. ఎఫ్ అనే పదాన్ని రేవంత్ వాడాడు. ఈ విషయంపై ఇప్పటివరకు హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇవ్వలేదు.

    ఇనయా అలా చేస్తుందేమో..

    ఇనయా అలా చేస్తుందేమో..

    ఇక ఆడియెన్స్ అడిగిన ప్రశ్నలో సమాధానాలు చెప్పారు హౌజ్ మేట్స్. అందులో రాజ శేఖర్ కు ఈ ఇంట్లో మీకు రియల్ ఫ్రెండ్స్ ఎవరు.. మీ వెనుక బ్యాక్ బిట్చింగ్ ఎవరు చేయరని అనుకుంటున్నారని ప్రశ్న వచ్చింది. నా వెనుక ఇనయా అలా మాట్లాడుతుందేమో అని అనిపిస్తుందని రాజ్ అన్నాడు. దీంతో నేను తప్పు చేస్తానని అనిపిస్తుంది కదా అంటూ ఇనయా నామినేషన్ కి చాలా మంచి పాయింట్ ఇచ్చావు అని కౌంటర్ ఇచ్చింది.

    ఇనయను రెచ్చగొడుతూ రేవంత్..

    ఇనయను రెచ్చగొడుతూ రేవంత్..

    ఇనయ కౌంటర్ ఇచ్చినప్పటికీ రాజ్ అన్న మాట తట్టుకోలేక చాలా ఫీల్ అవుతూ కనిపించింది. ఇక ఆమెను మరింత రెచ్చగొట్టే విధంగా రేవంత్ మాట్లాడాడు. ఇక ప్రతిదానికి నా మీదకు తీసుకొస్తారు అంటూ ఇనయా ఎమోషనల్ అయిపోయింది. కంటతడి పెట్టుకుంది. కీర్తి ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటే రాజు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ నన్ను వదిలేయ్ అంటూ ఆమె అలా ఏడ్చుకుంటూ ఉండిపోయింది.

    వదిలేయ్ అన్నప్పుడు చేయి తీయి..

    వదిలేయ్ అన్నప్పుడు చేయి తీయి..

    రాజశేఖర్.. ఇనయా భుజంపై చేయి వేయడంతో.. వదిలేయ్ అన్నప్పుడు చేయి తీయి అని పక్కనే ఉన్న రేవంత్ కూడా చెప్పాడు. అదంతా ఫన్నీ వేలో చెప్పానని ఇనయాను ఓదార్చే ప్రయత్నం చేశాడు రాజ్. కానీ ఆమె అలా కొద్దిసేపు ఏడుస్తూనే ఉంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 12వ వారం నామినేషన్లలో రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, రాజ్, ఫైమా, ఆదిరెడ్డి, ఇనయా ఉన్నారు. కెప్టెన్ కారణంగా రేవంత్, ఎవరు నామినేట్ చేయకపోవడంతో కీర్తి సేఫ్ అయ్యారు.

    English summary
    Rajasekhar Consoling Inaya Sultana After Bigg Boss Telugu 6 12th Week Nominations In November 21 Day 78 Episode 79 Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X