Bigg Boss Telugu 6: బురదతో బిగ్ బాస్ నామినేషన్.. మరోసారి రేవంత్ టార్గెట్.. ఇనయా vs శ్రీహన్!

ఏడవ వారం నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఒకరిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి సమయం ఆసన్నమైంది.. అంటూ బిగ్ బాస్ నామినేషన్స్ మొదలుపెట్టారు. అయితే ఈసారి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారిపై బురద చల్లే పైపు కింద కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ పై టార్గెట్ అయితే పడింది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇనయా వర్సెస్ శ్రీహాన్

ఇనయా వర్సెస్ శ్రీహాన్

ఇక ఇనయా వర్సెస్ శ్రీహాన్ మధ్య గొడవ గట్టిగానే నడిచినట్లు అనిపిస్తోంది. ఇక బిహేవియర్ లో నాకు కొంత నచ్చలేదు అని శ్రీహాన్ చెప్పడంతో ఏ నచ్చలేదు అని ఆమె అడిగింది. ఇక గతంలో ఆమె హేళన చేస్తూ కనిపించిన విధానం తనకు నచ్చలేదని అనడంతో.. కావాలని ఇక్కడ డ్రామా చేస్తున్నావు అంటూ కూడా ఇనయా శ్రిహాన్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వెళ్లి కూర్చో పో అంటూ శ్రీహన్ చికాకుతో చెప్పాడు.

రేవంత్ టార్గెట్

రేవంత్ టార్గెట్

ఇక రోహిత్ అయితే కెప్టెన్ గా నువ్వే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ రేవంత్ పై కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత బాలదిత్యా కూడా అదే అన్నాడు. ఇక మెరీనా కూడా రేవంత్ పడుకోవడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇక రేవంత్ అయితే చిరాకుతో మీ దగ్గర ప్రాపర్ రీసన్ ఏమీ లేదు అని అన్నాడు. ఇక చివరికి రేవంత్ వెళ్లి బురదపడే పైపు కింద కూర్చున్నాడు.

 వాసంతి వర్సెస్ ఆదిరెడ్డి

వాసంతి వర్సెస్ ఆదిరెడ్డి

ఇక వాసంతి వర్సెస్ ఆదిరెడ్డి గొడవ కూడా గట్టిగా జరిగింది. ఆదిరెడ్డి అయితే మీరు నామినేషన్స్ కు భయపడుతున్నారు అని అనడంతో.. అందుకు భయపడుతుంది అనేది ఒక్కటే రీసన్ చెబుతున్నారు అంటూ వాసంతి ప్రశ్నించింది. ఇక తర్వాత అర్జున్ కూడా ఆదిరెడ్డిని నామినేట్ చేసాడు. మీరు చేయనివి నేను చాలా చేస్తాను అని కూడా ఆదిరెడ్డి అన్నాడు. మీరు అసలు ఏమీ ఎంటర్టైన్మెంట్ చేయలేదు అని మీరు కూడా నాలానే ఉన్నారు అని కౌంటర్ ఇచ్చాడు.

నీకు బిగ్ బాస్ అనేది కరెక్ట్ కాదు

నీకు బిగ్ బాస్ అనేది కరెక్ట్ కాదు

ఆ తర్వాత గీతూ ఆదిత్యను నామినేట్ చేస్తూ మొదట ఎలా ఉన్నావో అలానే వెళ్ళిపోతే బాగుంటుంది అని అన్నాడు. అలాగే నీకు బిగ్ బాస్ అనేది కరెక్ట్ కాదు అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది అని కూడా చెప్పడంతో ఆదిత్య నీకు సమాధానం చెప్పాలని అని కూడా లేదు అని అన్నాడు.

చాలా క్లారిటీ వచ్చింది

చాలా క్లారిటీ వచ్చింది

నాకు ఒక విషయం చాలా క్లారిటీగా అర్థమైంది అంటూ ఏ హౌస్ గురించి నేను మంచి కోసం ఆలోచిస్తున్నానో.. అదే హౌస్ నా గురించి ఇలా ఆలోచిస్తున్నారని ఆరోజు నాగర్జున గారు నాకు లోపల వీడియో చూపించారు. అప్పుడు క్లారిటీ రాలేదు.. కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లారిటీ వచ్చింది అని ఆదిత్య మరొక కౌంటర్ అయితే ఇచ్చాడు. మరి ఈ నామినేషన్ గొడవ ఇంకా ఇలాంటి గొడవలకు దారితీస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X