Bigg Boss Telugu 6:ఇనయాకు హ్యాండ్ ఇచ్చిన సూర్య.. మరదల్ని వదిలి వాళ్ల కోసం.. ప్రతికారమా?

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో అరుపులు, గొడవలు, లూపులు, బలహీనతలే కాదు ఊహించిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటిదాగా తొమ్మిదో వారం కంటెండర్ టాస్క్ లో బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్ మధ్య పోటీ జోరుగా సాగింది. అయితే రెడ్ టీమ్ అగ్రెషన్ తో రెచ్చిపోయింది. రెడ్ టీమ్ కు లీడర్ గా ఉన్న గీతూ రాయల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దాని ఫలితంగా ఆమె బిగ్ బాస్ తెలుగు 6 తొమ్మిదో వారం ఎలిమినేట్ అయి హౌజ్ బయటకు వెళ్లినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇలానే గత వారం అనూహ్యంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఆర్జే సూర్య. టాప్ 5లో ఉంటాడనుకున్న మిమిక్రీ ఆర్టిస్ట్ సూర్య ఎలిమినేట్ కావడంతో మిగతా ఇంటి సభ్యలందరూ అవాక్కయ్యారు. ముఖ్యంగా ఇనయా సుల్తానా. వీళ్లిద్దరి మధ్య జరిగిన ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే బయటకు వెళ్లిన ఆర్జే సూర్య తాజాగా ఇనయాకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 క్లోజ్ రిలేషన్ షిప్ కారణం..

క్లోజ్ రిలేషన్ షిప్ కారణం..

బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో ఎనిమిదో వారం ఎలిమినేషన్ కింద అనూహ్యంగా మిమిక్రీ ఆర్టిస్ట్, ఫెమినిస్ట్, ఆర్జే సూర్య బయటకు వచ్చాడు. అందుకు కారణం గేమ్ కన్నా ఎక్కువగా అమ్మాయిలతో ఎక్కువగా సన్నిహితంగా ఉండటమే కారణమని తెలిసిందే. నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన ఆరోహి రావుతో చాలా క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేశాడు సూర్య. అప్పుడు వాళ్లిద్దరి మధ్య ప్రేక్షకులు మెచ్చని సన్నివేశాలు దర్శనమిచ్చాయి.

 ఇనయాతో సన్నిహితంగా ఉండటమే..

ఇనయాతో సన్నిహితంగా ఉండటమే..

ఆరోహి రావు ఎలిమినేట్ అయి వెళ్లిన తర్వాత సూర్య దృష్టి అంతా ఇనయా సుల్తానావైపు మళ్లింది. అయితే సూర్యకు బుజ్జమ్మతో బియాండ్ ఫ్రెండ్ షిప్ ఉందని ఎన్నోసార్లు చెప్పాడు. బుజ్జమ్మ కూడా అలాగే చెప్పింది. కానీ, సూర్యపై ఇనయాకు క్రష్ ఉందని, అతనంటే చాలా ఇష్టమని బాహటంగానే చెప్పింది. బుజ్జమ్మ గురించి తెలిసి తప్పు చేస్తున్నానా అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సూర్యతో సన్నిహితంగా ఉంది. దాన్ని సూర్య ఎంకరేజ్ చేస్తూనే వచ్చాడు. ఫలితంగా ఎలిమినేట్ అయ్యాడని తెలిసిన సమాచారం.

 ఫేక్ అని అనడంతో..

ఫేక్ అని అనడంతో..

ఇదిలా ఉంటే హౌజ్ లో ఉన్నప్పుడు సూర్య, ఇనయా కలిసి ఎంచక్కా కలిసిమెలిసి తిరిగారు. ఏ మూల దొరకిన అక్కడికి వెళ్లి ప్రేమ, ఆప్యాయతలు పంచుకున్నారు. ఇద్దరు వేసుకున్న ప్లాన్ ప్రకారమో, నిజంగానే సూర్య వెళ్లాలని అనిపించిందో తెలియదు కానీ నామినేట్ చేసింది. టాప్ 5లో ఉండకూడదని గట్టిగా చెప్పింది. సూర్యది అంతా ఫేక్, బాగా నటిస్తాడు అంటూ రేవంత్ తో చెప్పుకుంది. ఈ వీడియోను అంతా సూర్యకు యాంకర్ శివ చూపించాడు.

హ్యాండ్ ఇచ్చిన సూర్య..

హ్యాండ్ ఇచ్చిన సూర్య..

తన గురించి ఇనయా ఫేక్ అని మాట్లాడిన వీడియో చూసిన సూర్య మెండ్ బ్లాంక్ అయే ఉంటుంది. అతనికి ఇది పెద్ద షాక్. ఇనయా అలా ఎందుకు చేసిందో అర్థం కాక తలపట్టుకున్నాడు. సూర్య ఎలిమినేషన్ తర్వాత అతనిపై ఇనయా ప్రేమ మరింత పెరిగిపోతుంటే.. సూర్య మాత్రం ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు. హౌజ్ నుంచి బయటకు వెళ్లిన సూర్య.. ఇనయాకు సపోర్ట్ చేయకపోగా ఆమెను అసలు టాప్ 5లో కూడా ఉండదని తేల్చి చెప్పాడు.

 చివరికీ గీతూకు కూడా..

చివరికీ గీతూకు కూడా..

టాప్ 5లో శ్రీహానా, రేవంత్, బాలాదిత్య, గీతూ రాయల్ తదితరులు ఉంటారని సూర్య చెబుతున్నాడు గానీ, ఇనయా సుల్తానా పేరు మాత్రం చెప్పట్లేదు. అలాగే బావ అంటూ తిరిగిన మరదలు ఇనయాకు సపోర్ట్ చేయకుండా అక్కాబావలకు (మెరీనా-రోహిత్) ఓట్ వేయాలని, వాళ్లను గెలిపించాలని కోరుతున్నాడట. తన సోషల్ మీడియా అకౌంట్ లలో రోహిత్ అండ్ మెరీనా ఫొటోలను షేర్ చేస్తూ అక్కాబావలకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాడట.

సూర్య జపం..

సూర్య జపం..

చివరికీ గీతూ రాయల్ కు కూడా సపోర్ట్ చేయమని స్టోరీలు పెడుతున్నాడు కానీ ఇనయాకి మాత్రం ఓట్ చేయమని పోస్ట్ పెట్టట్లేదంటే సూర్య బాగా హర్ట్ అయినట్లే తెలుస్తోంది. ఇదంతా తెలియని ఇనయా హౌజ్ లో సూర్య కోసం తెగ ఆరాటపడిపోతుంది. ఎప్పుడూ కూడా సూర్య గురించే మాట్లాడుకుంటుంది. సూర్య బట్టలే వేసుకుంటున్నట్లు చెబుతుంది. అతను తినే ప్లేట్ లోనే తినింది. అతని కప్పులోనే తాగింది. అయితే ఇదంతా ఫేక్ అని, దొంగ ప్రేమ అని శ్రీహాన్, శ్రీసత్య, గీతూ రాయల్ ప్రతిసారి కౌంటర్లు వేస్తూనే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X