Bigg Boss Telugu 6: బాత్రూమ్ దగ్గర ఆమె ఏడుస్తుంటే సూర్య కౌగిలింతలు.. మళ్ళీ ఇద్దరిని కలిపి ఒకేసారి!
బిగ్ బాస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తినంతా ఉపయోగించి టాస్క్ లో పోరాడేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఈ ఆటలో పగలు ప్రతీకారాలు కూడా గట్టిగానే హైలెట్ అయ్యాయి. గీతూ మొండిగా తన ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఇక మరోవైపు సూర్య అయితే దొరికిందే ఛాన్స్ అని బాధలో ఉన్న అమ్మాయిని పట్టుకొని కౌగిలిలో ముంచేసే ప్రయత్నం చేశాడు. గురువారం ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

శక్తికి మించి పోరాడే ప్రయత్నం
8వ వారం చేపల చెరువు టాస్క్ ఒక విధంగా చాలా సీరియస్ గా కొనసాగింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేశారు. గతంలో కాస్త స్లోగా ఆడుతున్నారు అనేవారు కూడా ఇప్పుడు వేగాన్ని పెంచారు. ముఖ్యంగా గీతూ అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా తన ప్రత్యర్థులను ఒక ఆట ఆడుకుంది. బాలదిత్యా పై కూడా పంతం నెగ్గించుకుంది.

చివరగా నాలుగు జంటలు
ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో చివరగా నాలుగు జంటలు మిగిలి ఉండగా అందులో చివరి కెప్టెన్సీ ఛాలెంజ్ కు ఒక్కో జంట నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. ఇక ఇనయ-రేవంత్ జంట నుంచి రేవంత్ ఎంపికవ్వగా ఆ తరువాత సూర్య, వాసంతి జంట నుంచి సూర్య సెలెక్ట్ అయ్యాడు. మరో రెండు జంటల్లో నుంచి శ్రీహాన్, రోహిత్ , సెలెక్ట్ అయ్యారు.

రేవంత్ వైపు అదృష్టం
కెప్టెన్సీ టాస్క్ లో చివరి ఛాలెంజ్ కోసం హై డ్రామా నడిచించింది. నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాలి అని జంటల్లోని కంటెస్టెంట్స్ అందరూ కూడా బలంగా పోరాడారు. అయితే బిగ్ బాస్ జంటల్లో ఎవరో ఒక్కరు త్యాగం చేసి తదుపరి లెవెల్ కు వెళ్ళాలి అని చెప్పడం కంటెస్టెంట్స్ చీటిలు వేసుకున్నారు. ఇక రేవంత్ వైపు అదృష్టం ఉండగా ఇనయా ఈసారి కూడా కెప్టెన్సీ టాస్క్ లో ఛాన్స్ దొరకాలేదే అని బాధపడింది.

ఓదారుస్తూనే కౌగిలిలో
ఇక ఇనయా కెప్టెన్ కావడం కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఛాన్స్ రాకపోవడంతో ఆమె చాలా అప్సెట్ అయ్యింది. ఇక బాత్రూమ్ దగ్గరకు వెళ్లి ఏడ్చేసింది. ఇక ఇనయాతో ఎప్పుడు క్లోజ్ అవుదామా అని ఎదురుచూస్తున్న సూర్య ఆమెను ఓదారుస్తూనే గట్టిగా కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. అప్పట్లో ఆరోహి రావ్ తో కెమిస్ట్రీని కొనసాగించిన సూర్య ఇప్పుడు ఇనయా పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది.

ఇద్దరితోను అదే తరహాలో
మొదట సూర్య జాలితోనే ఓదారుస్తున్నట్లు అనిపించినా అతని తీరులో మాత్రం చాలా తేడా కనిపించింది. ఆ తరువాత మరోసారి ఇనయా, కీర్తి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటే సూర్య ఇద్దరిని కౌగిలిలో ముంచేశాడు. దొరికిందే ఛాన్స్ అని ఇద్దరితోను అలా రొమాన్స్ చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఆ తరువాత సూర్య ఆలోచనను పసిగట్టిందో ఏమో గాని ఇనయా వదిలించుకుని వెళ్ళిపోయింది. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో శ్రీహన్ గెలిచినట్లు అందరూ ముందుగానే ఉహించేశారు.


Click it and Unblock the Notifications











