Bigg Boss Telugu 6:రేవంత్ కు ఆ ఎఫెక్ట్.. నటుడు కిరీటి ఆన్సర్స్ కి తలపట్టుకున్న అరియానా గ్లోరి

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ జోరుగా, రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికీ తొమ్మిది వారాలకు గాను తొమ్మిది మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. ఇక మరోసారి నామినేషన్ల ప్రక్రియ జోరుగానే సాగింది. తొమ్మిది మంది నామినేషన్లలో ఉన్నారు. ప్రస్తుతం హౌజ్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. అయితే ఇదివరకే ఆ టాస్క్ అయిపోగా.. బిగ్ బాస్ తెలుగు 6 పదోవారం ఇంటి కెప్టెన్ గా జబర్దస్త్ ఫైమా కెప్టెన్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్, నటుడు కిరీటి దామరాజు తన అభిప్రాయాలను చెప్పేందుకు బీబీ కేఫ్ కు వచ్చాడు.

ఆసక్తికర సమాధానాలు..

ఆసక్తికర సమాధానాలు..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లు ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు. ఈ కేఫ్ కు అరియానా గ్లోరితో పాటు అప్పుడప్పుడు ఆర్జే కాజల్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు బిగ్ బాస్ రెండో సీజన్ సభ్యుడు, నటుడు కిరీటి దామరాజు హాజరయ్యారు. ఆయన్ను బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి పలు ప్రశ్నలు వేసి ఆసక్తికర సమాధానాలు రాబట్టింది.

 అమ్మాయిలు కొట్టుకుంటుంటే..

అమ్మాయిలు కొట్టుకుంటుంటే..

బిగ్ బాస్ సీజన్ 6.. ఎంటర్టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్.. మిమ్మల్ని ఎవరు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అని అరియానా అడగ్గా.. ఫిజికల్ టాస్క్ బాగా జరిగింది. అదే కదా మనకు కావాల్సింది. మా ఆడియెన్స్ కి కావాల్సింది అదే కదా అని కిరిటీ సమాధానం ఇస్తే అరియానా గ్లోరి తల పట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 6లో ఫస్ట్ టైమ్ ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే.. అమ్మో దేవుడా ఏంటి ఇలా కొట్టుకుంటున్నారనిపించిందని అరియానా అంది.

 ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్..

ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్..

అరియానా అలా అంటే బాగుంది అని కిరిటీ అని నవ్వించాడు. మరి ఇనయా సుల్తానా నిజంగానే సూర్యను మిస్ అవుతుందా అని అడిగిన ప్రశ్నకు బయట నుంచి సూర్య అనుకుంటాడు.. అరే వదిలేయవే.. ప్లీజే.. ఆడవే.. అని కిరిటీ నవ్విస్తే.. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్ అంటూ అరియానా మరింత నవ్వించింది. ఒక గేమర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఇనయాకు ఉన్నాయా అని క్వశ్చన్ చేసింది అరియానా గ్లోరి.

అది చాలా ఓవర్..

అది చాలా ఓవర్..

ఇనయా మాటలు అబ్బా.. చాలా ఇరిటేటింగ్ ఉంటాయిని సమాధానం ఇచ్చాడు కిరీటి. మరి మొన్న నామినేషన్లలో ఇనయా తనే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ నేనే.. నేనే విన్నర్ అని అరిచిందిగా అన్నదానికి అది ఓవర్.. చాలా ఓవర్ అండి అని కిరీటి చెప్పుకొచ్చాడు. రేవంత్ గురించి మాట్లాడుకుందాం అని.. ఫస్ట్ లో చాలా అగ్రెసివ్ గా ఉండే.. నిన్న ఫస్ట్ టైమ్ అందరికి మట్టి పంచాడు మీరు కూడా తీసుకోండి అని, ఈ మార్పు ఎలా ఉంది అని అరియానా అడిగింది.

ఇంకా టాప్ 5 అడుగుతారేమో..

ఇంకా టాప్ 5 అడుగుతారేమో..

రేవంత్ మార్పు గురించి అరియానా అడగ్గా.. మరి యెల్లో కార్డ్ ఇచ్చారుగా నాగార్జున గారు అని నవ్వుకుంటూ చెప్పాడు కిరీటి. దాని ఎఫెక్టా ఇది అని అరియానా అంది. తర్వాత చివరిగా మీ గెస్ ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయి ఇంటి నుంచి ఎవరు బయటకు వస్తారనుకుంటున్నారు అని అడిగింది అరియానా. దీనికి షాక్ అవుతూ.. అయ్యా బాబాయ్.. ఇంకా టాప్ 5 అడుగుతారేమో అనుకున్నా అని కిరీటి సమాధానం ఇచ్చాడు.

 కెప్టెన్ గా ఫైమా..

కెప్టెన్ గా ఫైమా..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో తొమ్మిది వారాలకు గాను షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ, అర్జున్ కల్యాణ్, ఆర్జే సూర్య, గీతూ రాయల్ మొత్తం తొమ్మిది మంది ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 పదోవారం ఇంటి కెప్టెన్ గా జబర్దస్త్ ఫైమా గెలిచినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X