Bigg Boss Telugu 6: అమ్మాయిలని పడేసే ఆటలో ఆదిరెడ్డి రొమాన్స్.. ఫైమా అందాన్ని పొగుడుతూ..

బిగ్ బాస్ ఈవారం ఒకవైపు ఎమోషన్స్ ను హైలైట్ చేస్తూనే మరొకవైపు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. కంటెస్టెంట్స్ అందరూ కూడా కామెడీ తో అదరగొట్టేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్ లోకి రప్పిస్తూ మరింత ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు. ఇక 81 వ రోజు ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త ఎమోషనల్ సన్నివేశాలు హైలెట్ కాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

హార్ట్ తో ఫ్లటింగ్

హార్ట్ తో ఫ్లటింగ్

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరితోనూ సరికొత్త కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా శ్రీహాన్ కూడా తన కామెడీ టైమింగ్ తో బాగానే నవ్విస్తున్నాడు. అతనికి రాజశేఖర్ కూడా ఈసారి తోడయ్యాడు.. ఇక బిగ్ బాస్ ట్రైనింగ్ సెంటర్ లో భాగంగా హార్ట్ ఫ్లటింగ్ ట్రైనర్ గా శ్రీహాన్ ఎంపికయ్యాడు. ఇక మొదట అతను రాజశేఖర్ కు అమ్మాయిలను ఎలా పడేయాలి అనే విధానంలో మెలకువలు నేర్పే ప్రయత్నం చేశాడు.

ఫైమా ను ఫ్లట్ చేసిన ఆదిరెడ్డి

ఫైమా ను ఫ్లట్ చేసిన ఆదిరెడ్డి

ఇక స్టూడెంట్స్ లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఎవరిని ఫ్లట్ చేయాలని అనుకుంటున్నావు అని రాజశేఖర్ ని అడగడంతో ఎవరైనా పర్వాలేదు అని అతను స్పందించిన విధానం అందరిని నవ్వించింది. అయితే ఆదిరెడ్డికి కూడా మెలకువలు నేర్పుతూ మనం పొగిడే పొగడ్తలకు అమ్మాయిలు ఐసులా కరిగిపోవాలి అని అన్నాడు. ఇక ఆదిరెడ్డి ఫైమాను పొగిడే ప్రయత్నం చేశాడు. ఏమైనా దెబ్బలు తగిలాయా? అనే ప్రశ్నకు ఎందుకు అని ఆడింది.. ఇక స్వర్గం నుంచి కింద పడేటప్పుడు దెబ్బలు తగిలయేమో అని కామెడీగా స్పందించడంతో ఆమె చీపోరా అంటూ పెట్టుకుంటూ వెళ్లిపోయింది.

కీర్తి కోసం సర్ ప్రైజ్

కీర్తి కోసం సర్ ప్రైజ్

ఇక బిగ్ బాస్ లో మరో ఫ్యామిలీ మెంబర్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఏవండోయ్ భాను గారు అంటూ కీర్తిని ఆమె ప్రియడు పిలవడంతో ఆమె ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక కీర్తి భర్త ఒకసారి కామెడీ స్పెల్లింగ్ చెప్పండి అంటూ ఫైమాను అడిగాడు. ఇక ఆమె కరెక్ట్ గా చెప్పినప్పటికీ మరింత అనుమానం వచ్చేలా.. కరెక్ట్ గా చెప్పకపోతే మరింత కామెడీ అవుతుంది అని అన్నాడు. తప్పుగా చెప్పడంతో అదే కరెక్ట్ అన్నట్లు శ్రీహన్ రియాక్ట్ అయ్యాడు. దీంతో అందరూ కూడా సరదాగా నవ్వుకున్నారు.

బిగ్ బాస్ ఒక గొప్ప అవకాశం

బిగ్ బాస్ ఒక గొప్ప అవకాశం

ఇక ఇనయా సుల్తానా ను పలకరించిన కీర్తి హస్బెండ్ ఇనయా గారు మీరు ముద్దు ఎక్కడ పెడతారు అని చెంపలు చూపించడంతో అందరు షాక్ అయ్యారు. ఇక కీర్తి కి సంబంధించిన ఇద్దరు పిల్లల ఫోటోలను కూడా చూపించడంతో ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. ఇక నువ్వు లైఫ్ లో చాలా కోల్పోయావు. ఇప్పటివరకు ఆ దేవుడు నీ దగ్గర నుంచి చాలా తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు మళ్ళీ నీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. అదే బిగ్ బాస్.. అని అతను చెప్పడంతో కీర్తి మరింత ఎమోషనల్ అయిపోయింది.

ఇనయా ఎమోషనల్ మూమెంట్

ఇనయా ఎమోషనల్ మూమెంట్

ఇక తర్వాత ఇనయా తల్లి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె రావడంతో ఒక్కసారిగా ఇనయా ఏడ్చేసింది. గెలిచి రావాలి అని నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని ఆమె చెప్పింది. ఇనయా తన తల్లి కాళ్లకు నమస్కరిస్తూ బ్లెస్సింగ్స్ తీసుకుంది. మొత్తానికి ఈ వారం అయితే బిగ్ బాస్ ఎమోషనల్ కంటెంట్ తోనే ఎక్కువగా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో రేటింగ్ తగ్గిపోయిందనుకున్న బిగ్ బాస్ షో కి ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఇదే తరహాలో కొనసాగుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X