Bigg Boss Telugu 6: నాకు ఇన్సూరెన్స్ కూడా లేదు, చనిపోతే అలా చేయండి.. బిగ్ బాస్ తో ఆదిరెడ్డి!

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఈసారి అనుకున్నంత స్థాయిలో అయితే రేటింగ్స్ తో రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. ఈసారి షో ప్లాప్ కావడానికి అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తానికి బిగ్ బాస్ అయితే చివరి దశకు చేరుకుంటున్న కొద్ది ఎంతో కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోల్పోయిన బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని తిరిగి గెలిచేందుకు ఛాలేంజ్ లు, డార్క్ రూమ్ లో కంటెస్టెంట్లను భయపెట్టే టాస్క్ లను నిర్వహిస్తున్నారు. కామన్ మ్యాన్, రివ్యూవర్ గా ఎంటరైన ఆదిరెడ్డి 95వ ఎపిసోడ్ లో బిగ్ బాస్ తో ఇన్సూరెన్స్, చావు గురించి మాట్లాడాడు.

ఇంటి సభ్యులు భయపడేలా..

ఇంటి సభ్యులు భయపడేలా..

ఇక బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ముగింపు దశకు చేరుకోవడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ గ్యాప్ లో బిగ్ బాస్ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక బిగ్ బాస్ లో 94వ రోజు 95వ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ మధ్య గొడవలతోపాటు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా హైలెట్ అయ్యాయి. హౌజ్ లో కన్ఫెషన్ రూమ్ ను డార్క్ రూమ్ గా క్రియేట్ చేసి హౌజ్ మేట్స్ భయపడేలా చేశారు.

గీతూతో ఎక్కువ బాండింగ్..

గీతూతో ఎక్కువ బాండింగ్..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 కంటెస్టెంట్లలో ఒకరిగా వచ్చాడు ఆదిరెడ్డి. రివ్యూవర్ అయిన ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కోటాలో వచ్చి తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. సీజన్ ప్రారంభం నుంచి మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ టాస్క్ లను ఎలా ఆడాలో మిగతా కంటెస్టెంట్స్ కు చెబుతూ ముందుకు సాగాడు. అయితే మొదట్లో గీతూ రాయల్ తో ఎక్కువ బాండింగ్ పెంచుకున్న ఆదిరెడ్డి ఆమె తప్పులను స్ట్రాంగ్ గా చెప్పలేకపోయాడు.

గమీదాగా ఆదిరెడ్డి..

గమీదాగా ఆదిరెడ్డి..

ఇక గీతూ రాయల్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయినప్పటి నుంచి ఆదిరెడ్డి ఆటతీరులో మార్పు కనిపించింది. ఆదిరెడ్డి బిగ్గెస్ట్ మ్యానుపులేటర్ అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా గమీద అనే కథ చెప్పిన హోస్ట్ నాగార్జున.. అతన్ని గట్టు మీద దాసుగా అభివర్ణించాడు. రేవంత్ పై ఆరోపణలు చేసి చివరిగా తనే ఇరుక్కున్నాడు. గతవారం కూడా ఇంతటితో వదిలేయి.. ఇక తక్కువ కాకు అని నాగార్జున చెప్పేదాకా తెచ్చుకున్నాడు ఉడాల్ మామ.

బలవంతంగా డార్క్ రూమ్ లోకి..

బలవంతంగా డార్క్ రూమ్ లోకి..

ఇదిలా ఉంటే గత ఎపిసోడ్ లో డార్క్ రూమ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా కన్ఫెషన్ రూమ్ లోకి ఆదిరెడ్డి వెళ్లమని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అతను వెళ్లేసరికి అక్కడ అంతా పాములు, ఎముకలు, గడ్డి ఉన్నాయి. దీంతో అతను వెళ్లనని తిరిగి బయటకు వచ్చాడు. మిగతా హౌజ్ మేట్స్ అతన్ని బలవంతంగా కన్ఫెషన్ రూమ్ లోకి పంపించారు. డోర్ దగ్గరే ఉండి ఆలోచిస్తున్నా ఆదిరెడ్డితో లోపలికి రమ్మని బిగ్ బాస్ పిలిచాడు. దీంతో యాడకి బిగ్ బాస్ వచ్చేది అని తన యాసలో మాట్లాడాడు ఆదిరెడ్డి.

అసలే నాకు ఇన్సూరెన్స్ కూడా లేదు..

అసలే నాకు ఇన్సూరెన్స్ కూడా లేదు..

అనంతరం లోపలికి వెళ్లిన ఆదిరెడ్డి.. మీరు ఉన్నారు కదా బిగ్ బాస్ అని ధైర్యం తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. బిగ్ బాస్ సౌండ్స్ ఓకే కానీ, కాళ్లు చేతులు పట్టుకుని లాగొద్దు.. నా చేతిలో కర్ర ఉంది కొట్టేస్తా.. అసలే నాకు ఇన్సూరెన్స్ కూడా లేదు అన్నాడు. తర్వాత గదిలో ఉన్న క్యాండిల్ ను వెతకమని బిగ్ బాస్ చెప్పారు. దీంతో ఇక్కడ క్యాండిల్ యేడ దొరుకుద్ది బిగ్ బాస్.. రూపాయి క్యాండిల్ పెట్టారా ఏంటీ అని సెటైర్ వేశాడు ఆదిరెడ్డి.

ఆగవమ్మా సామీ..

ఆగవమ్మా సామీ..

ఆ గదిలో గజ్జల చప్పుడు, అరుపులు వినిపిస్తే నువ్ ఆగవమ్మా సామీ అంటూ కామెడీ పండించాడు ఆదిరెడ్డి. తర్వాత విచిత్రమైన సౌండ్ చేసినవాళ్లలో ఎవరినైనా పంపించమంటారా ఆదిరెడ్డి అని బిగ్ బాస్ అడిగి కామెడీ చేశాడు. అనంతరం డార్క్ రూమ్ లోకి శ్రీహాన్ వచ్చాడు. అతను ఆదిరెడ్డి కంటే ఎక్కువగా భయపడ్డాడు. ఆ గదిలో దెయ్యం వేశంలో ఉన్న మనుషులను చూసి భయపడినా ఆదిరెడ్డి.. నేను చనిపోతే నా శవాన్ని మోసుకెళ్లండని చెప్పాడు. ఎలాగో భయపడుతూ ఆదిరెడ్డి, శ్రీహాన్.. క్యాండిల్, గన్ ను వెతికి పట్టుకుని బయటకు వెళ్లారు.

టాయిలెట్ ఎక్స్ పీరియన్స్..

టాయిలెట్ ఎక్స్ పీరియన్స్..

బయటకు వచ్చిన ఆదిరెడ్డి.. గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఎక్స్ పీరియన్స్ మాములుగా ఉండదు.. ఎవరికైనా తడిచిపోద్ది.. టాయిలెట్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుందో చూపించారు. ఎంత పుడింగికి అయిన తడిచిపోద్ది అంటూ మిగతా ఇంటి సభ్యులతో చెప్పాడు ఆదిరెడ్డి. ఇక వాళ్లు తీసుకొచ్చిన క్యాండిల్ కు రూ. 25 వేలు, గన్ కి రూ. 20 వేల అమౌంట్ బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అయింది. దీంతో ఆ ప్రైజ్ మనీ రూ. 44, 36, 100 అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X