Bigg Boss Telugu 6: ఆదిరెడ్డిని భయపెట్టిన బిగ్ బాస్.. దెయ్యాన్ని చూసి వణికిపోయిన శ్రీహన్

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ముగింపు దశకు చేరుకోవడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ గ్యాప్లో బిగ్ బాస్ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక బిగ్ బాస్ లో 94వ రోజు కంటెస్టెంట్ మధ్యలో గొడవలతోపాటు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీరియస్ గా ఉండే వారిపైనే బిగ్ బాస్ ఒక భయానక ప్లాన్ వేశాడు. నేడు హైలెట్ కాబోయే ఎపిసోడ్ లోని వివరాల్లోకి వెళితే..

బయపెట్టిన బిగ్ బాస్

బయపెట్టిన బిగ్ బాస్

బిగ్ బాస్ ఒక చీకటి గదిలోకి వెళ్లి ప్రతిసారి కూడా ఏదో ఒక పని చెబుతూ ఉంటాడు. అందులో ముఖ్యమైన వస్తువులను తీసుకొని రావాలని కంటెస్టెంట్స్ ను వదిలిపెట్టి భయపెడుతూ ఉంటాడు. ఒక చీకటి గదిలోకి ముందుగా ఆది రెడ్డిని పంపించడం జరిగింది. చాలా చీకటిగా ఉంది అని ఆదిరెడ్డి ముందుగానే భయపడ్డాడు. అంతేకాకుండా అక్కడ గజ్జల సౌండ్ కూడా రావడంతో అతను కొంత భయభ్రాంతులకు గురయ్యాడు.

కావాలంటే పడుకోవచ్చు

కావాలంటే పడుకోవచ్చు

ఇక బిగ్ బాస్ ఆదిరెడ్డిని లోపలికి రమ్మని చెప్పాడు. అయితే ఇక్కడ కూర్చునేందుకు అవకాశం ఉందా బిగ్ బాస్ అని ఆదిరెడ్డి ప్రశ్నించగా.. కావాలంటే పడుకోవచ్చు అని కూడా బిగ్ బాస్ అదే తరహాలో సెటైర్ వేశాడు. అయితే కన్ఫెషన్ రూమ్ లో ఉన్న క్యాండిల్ ను వెతికి తీసుకువెళ్లాలని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఇక ఆ చీకటి గదిలో ఆదిరెడ్డి దాన్ని వెతికెందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.

 శ్రీహన్ కూడా

శ్రీహన్ కూడా

కొద్దిసేపటి తర్వాత బిగ్ బాస్ మీకు తోడుగా ఎవరినైనా పంపించమంటారా అని అన్నప్పుడు ఆదిరెడ్డి శ్రీహాన్ ను పంపించాలి అని కోరాడు. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా శ్రీహన్ ను లోపలికి తోసేశారు. దీంతో అతను భయపడుతూ లోపలికి వెళ్ళాడు. క్యాండిల్ మాత్రమే కాకుండా గన్ను కూడా వెతికి తీసుకువెళ్లాలని బిగ్ బాస్ మరొక విషయం చెప్పడంతో శ్రీహన్ తల పట్టుకున్నాడు.

 వణికిపోయాడు

వణికిపోయాడు

ఇక శ్రీహన్ అయితే ఆదిరెడ్డి కంటే ఎక్కువ స్థాయిలో భయపడుతూ కనిపించాడు. అతను ప్రతి దాన్ని ముట్టుకున్నప్పుడు ఎంతగానో వణికిపోయాడు. దీంతో ఆదిరెడ్డి.. నేను ఒకడిని ఉన్నప్పుడే బాగుంది అంటూ పంచ్ వేశాడు. ఎందుకంటే ఆ రెంజ్ లో శ్రీహాన్ భయపడుతూ ఆదిరెడ్డిని కూడా భయపెట్టాడు. ఇక వారిద్దరూ భయపడడంతో బయట ఉన్న హౌస్ మెంట్స్ అందరూ కూడా ఎంతగానో నవ్వుకున్నారు.

దెయ్యంలా వింత ఆకారం

ఇక కొద్దిసేపటికి ఆ చీకటి గదిలోకి ఎవరో వింత ఆకారంలో దెయ్యంలా కనిపించడంతో శ్రీహన్ మరి దారుణంగా భయపడిపోయాడు. ఇక ఇద్దరి భయంతో అరుపులు రావడంతో బయట ఉన్న శ్రీ సత్య కూడా ఎంజాయ్ చేస్తున్నట్లు నవ్వేసింది. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం శ్రీహన్ ఆదిరెడ్డి కన్ఫెషన్ రూమ్ లో భయపడిన విధానం హైలెట్ కాబోతున్నట్లు అర్థమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X