Bigg Boss Telugu 6:ఎంతో కూల్ గా సాగిన నామినేషన్లు.. తన నెత్తిపై తానే చెత్త వేసుకున్న ఆదిరెడ్డి

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ జోరుగా సాగుతోంది. ఇక ఈ సీజన్ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పటికి 70 రోజులు 71 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. అంటే ఇంకో 20 రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. కంటెస్టెంట్లుగా 21 మంది ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికీ 10 వారాలకు 11 మంది ఎలిమినేట్ అయి వెళ్లిపోగా ప్రస్తుతం హౌజ్ లో 10 మంది మిగిలారు. ఇక సోమవారం వచ్చిందటే నామినేషన్ల పర్వం రసవత్తరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ పది మందిలో వచ్చే వారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయేందుకు 11వ వారం నామినేషన్స్ జరిగాయి. దీనికి సంబంధించిన నవంబర్ 14 సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.

10 వారాలు 11 మంది..

10 వారాలు 11 మంది..

బిగ్ బాస్ తెలుగు 6 లోకి వచ్చిన 21 మంది కంటెస్టెంట్లలో పది వారాలకు గాను మొత్తం 11 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ వీడి వెళ్లిపోయారు. వారిలో మొదటి వారంలో షానీ సల్మాన్, అభినయ శ్రీ ఎలిమినేట్ కాగా నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ తోపాటు పదో వారంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బాలాదిత్య అండ్ గ్లామర్ డాల్ వాసంతి కృష్ణన్ డబుల్ ఎలిమినేషన్ తో ఇంటి బయటకు వెళ్లిపోయారు.

ఫస్ట్ టైమ్ నామినేట్ చేస్తున్నా..

ఫస్ట్ టైమ్ నామినేట్ చేస్తున్నా..

ఇక బిగ్ బాస్ తెలుగు 6 11వ వారం నామినేషన్ల ప్రక్రియ రానే వచ్చింది. ఇందులో భాగంగా సరైనా కారణాలు చెప్పి నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుల తలపై బకెట్ లో చెత్త తీసుకొచ్చి వేయాలి. అందులో ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. ముందుగా ఆదిరెడ్డి వచ్చి.. నేను ఇంతవరకు వాళ్లను నామినేట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ నామినేట్ చేస్తున్నా అని చెప్పి శ్రీహాన్ అండ్ రోహిత్ పేర్లు చెప్పాడు.

వాళ్ల అజాగ్రత్త ఎక్కువ ఉంది..

వాళ్ల అజాగ్రత్త ఎక్కువ ఉంది..

సంచాలక్ తప్పు వల్ల మనం గెలవాలనుకోవడం శ్రీహాన్ నుంచి ఊహించలేదని ఆదిరెడ్డి చెప్పాడు. తెలిసి కూడా చెప్పకపోవడం కంటే.. వాళ్ల అజాగ్రత్త ఎక్కువ ఉంది అని నేను అనుకుంటున్నాను అని శ్రీహాన్ అన్నాడు. తర్వాత వచ్చిన ఫైమా.. రోహిత్ అండ్ ఇనయాను నామినేట్ చేసింది. ఇదివరకే ఇనయాకు ఎఫ్ అనే పదంపై 2 నామినేషన్స్ పడ్డాయి అని ఫైమా అంటే నేను నిజం చెబుతున్నాను నేను ఎఫ్ వర్డ్ చెప్పానా నాకు గుర్తు లేదు అని రోహిత్ అన్నాడు.

అప్సట్ అండ్ కన్ఫ్యూజ్ అయ్యావ్..

అప్సట్ అండ్ కన్ఫ్యూజ్ అయ్యావ్..

నేనైతే అబద్ధం చెప్పట్లేదు రోహిత్.. క్లారిటీగా వినే చెబుతున్నాను అని ఫైమా అంది. తర్వాత రోహిత్ ను శ్రీహాన్ నామినేట్ చేశాడు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అన్యాయం జరిగిందని అనుకోవడం కరెక్టే.. కానీ మీరు అలా చేయడం వల్ల మీకు జరిగిన అన్యాయానికి కారణం కాని వాడు బలి అవుతాడు అని శ్రీహాన్ తెలిపాడు. అనంతరం మెరీనా రేవంత్ ను నామినేట్ చేస్తూ ఫస్ట్ టైమ్.. నువ్ అప్సట్ అయ్యావ్ అండ్ కన్ఫ్యూజ్ అయ్యావని అంది.

నాకు ఎవరి హెల్ప్ వద్దు..

నాకు ఎవరి హెల్ప్ వద్దు..

నేను ఒకవేళ అప్సట్ అయి గేమ్ ఆడకపోయి ఉంటే ఈపాటి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉండేవాన్ని అని రేవంత్ సమాధానం ఇచ్చాడు. ఫైమా, ఇనయా మధ్య పెద్దగా మాటల యుద్ధం జరగకుండానే ముగిసింది. తర్వాత కీర్తిని శ్రీహాన్ నామినేట్ చేశాడు. ఈవారం నిన్ను అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. నువ్ గెలవలాని గట్టిగా కోరుకున్నాం అని చెప్పాడు. దీంతో నాకు ఎవరి హెల్ప్ వద్దని కీర్తి అంది.

పిచ్చి పడుతుందమ్మా..

చివరిగా ఆదిరెడ్డిని ఇనయా నామినేట్ చేసింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్ బాస్ నా నెక్ట్స్ వీక్ నామినేషన్ ఇనయా అని చెప్పాడు. ఆదిరెడ్డి వేసిన నామినేషన్లలో కోపం వచ్చినప్పుడు ఒక లిమిట్ ఉండాలని చెప్పారు అని ఇనయా అంటుంటే.. నీ నామినేషన్ అదేనా అని తన నెత్తిపై తానే చెత్త వేసుకున్నాడు ఆదిరెడ్డి. దీంతో అందరూ నవ్వారు. పిచ్చి పడుతుందమ్మా అని ఆదిరెడ్డి అన్నాడు. అయితే ఈసారి నామినేషన్లలో ఎలాంటి అరుపులు లేకుండా కూల్ గా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X