Bigg Boss Telugu 6 హౌజ్ లో తొలిసారి కన్నీళ్లు పెట్టుకున్న ఆదిరెడ్డి.. ఆమె ఒక్కమాట అనడంతో ఆపుకోలేక!
బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమై భారీగా ప్రేక్షకాదరణ పొందింది. వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఇప్పటికీ 13 వారాలు పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకుని ఆదిరెడ్డి తొలిసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు.

ఫండే సండే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ ఇప్పటికే 91 రోజులు 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇక శని, ఆదివారాలు వచ్చిందంటే చాలా హోస్ట్ వచ్చి ఇంటి సభ్యులను ఎంటర్టైన్ చేస్తాడు. ఈ ఆదివారం కూడా మంచి ఫండేగా జరిగింది.

ఫైమాతో కలిపి 14 మంది..
ఈవారం కూడా ఎప్పటిలానే చివరిలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ను ప్రకటించి హౌజ్ నుంచి బయటకు పంపించారు. తాజాగా ఫైమాతో కలిపి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 13 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు.
ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఫైమాతో పాటు ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఫ్రీ ఎవిక్షన్ పాస్ తో సేవ్..
ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 13వ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ఫైమా ఎలిమినేట్ అయి హౌజ్ ను వీడింది. జబర్ధస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫైమా షేక్ గత వారమే ఎలిమినేట్ కావాల్సింది. గతవారం కూడా ఆమె తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది.
కానీ ఆమె దగ్గర ఉన్న ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించి సేవ్ అయింది ఫైమా. ఇక ఆమెకు బదులు ఆమె తర్వాత స్థానంలో ఉన్న మోడల్ రాజ్ ఎలిమినేట్ అయ్యాడు.

నాగార్జునతో ప్రశంసలు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో మొదటగా తనదైన కామెడీ, గేమ్స్ లో పోటీ ఇవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది జబర్ధస్త్ కమెడియన్ ఫైమా. చూడటానికి సన్నగా ఉన్న ఫిజికల్ టాస్కుల్లో సైతం మిగతా వారికి గట్టి పోటీ ఇచ్చి మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అనిపించుకుంది. ఆమె ఆటతీరును హోస్ట్ నాగార్జున ఎన్నోసార్లు ప్రశంసించారు. అయితే నామినేషన్స్ సమయంలో సుదీప పింకీ, బాలాదిత్య, మెరీనాలతో వెటకారంగా మాట్లడటం ఆమెకు మైనస్ అయింది.

పొద్దున్నే అది చేసి ఇవ్వు..
ఇక ఇదిలా ఉంటే ఆదివారం నాడు నామినేషన్లో ఉన్న ఆరుగురిలో నలుగురు సేవ్ కాగా చివరిగా ఆదిరెడ్డి, ఫైమా మిగిలారు. వీరిద్దరిలో అతి తక్కువ ఓట్లతో ఫైమా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు. ఇక హౌజ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫైమా అంతా సరదాగానే ఉంది. కానీ గేట్ దగ్గర ఆదిరెడ్డిని బాగా చూసుకోమ్మని ఇనయాకు చెప్పింది ఫైమా. అలాగే ఆదికి పొద్దున్నే ఎగ్ ఆమ్లేట్ ఇవ్వు అని ఫైమా చెప్పింది.

మిడిల్ క్లాస్ అమ్మాయిలకు స్ఫూర్తి..
ఫైమా అలా చెప్పడంతో ఇక ఆపుకోలేక ఏడ్చేశాడు ఆదిరెడ్డి. దీంతో ఫైమా కళ్లలో కూడా కన్నీళ్లు తిరిగాయి. ఇంటి సభ్యులు అంతా చాలా ఎమోషనల్ అయ్యారు. మిడిల్ క్లాస్ అమ్మాయిలకు నువ్ ఒక ఇన్స్ ప్రేషన్ అని ఫైమాతో ఆదిరెడ్డి చెప్పాడు. కన్నీళ్లు ఆపుకుంటూ సంతోషంతో, థ్యాంక్యూ అన్నట్లుగా తల ఊపింది ఫైమా. ఇక ఆమె వెళ్లిన తర్వాత గీతూ వెళ్లినప్పుడు కూడా ఇంతా బాధపడి ఉండవు అని రేవంత్ అన్నాడు.
ఆ మాటతో బాధ వచ్చేసింది..
గీతూ వెళ్లినప్పుడు బాధ ఉంది కానీ కంట్రోల్ చేసుకున్నా. కానీ ఇప్పుడు ఫైమా నా గురించి అంత చిన్న విషయం కూడా చెప్పేసరికి అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న బాధ పైకి వచ్చేసిందని చెప్పాడు ఆదిరెడ్డి. తర్వాత ఆదిరెడ్డిని రేవంత్, శ్రీహాన్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా ఎమోషనల్ గా సాగిన ఫైమా ఎలిమినేషన్.. స్టేజిపై జర్నీ, ఫన్ అండ్ ఫస్ట్రేషన్ టాస్క్ తర్వాత సరదాగా, హ్యాపీగా బయటకు వెళ్లింది.


Click it and Unblock the Notifications











