Bigg Boss Telugu 6: నీ భార్యతో కాదంటూ అరిచిన ఆదిరెడ్డి.. కోపంతో ఊగిపోయిన రోహిత్

బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన బిగ్​బాస్​ ఆరో సీజన్​ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి సోమవారం నామినేషన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. తాజాగా అక్టోబర్ 10 సోమవారం నాడు బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ సాగింది. దీనికి సంబంధించిన రెండో ప్రోమోను తాజాగా విడుదల చేసింది స్టార్ మా.

ముఖాలపై ఫోమ్ కొట్టి..

ముఖాలపై ఫోమ్ కొట్టి..

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఆరో వారం నామినేషన్లకు సంబంధించిన రెండో ప్రోమోను తాజాగా విడదల చేశారు. నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుల ముఖాలపై ఫోమ్ కొట్టి కారణాలు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రోమోలో గీతూ రాయల్ ముఖానికి ఫోమ్ కొట్టి నామినేట్ చేశాడు ఆర్జే సూర్య. ఎవరైనా గేమ్ ఆడుతున్నప్పుడు ల్యాగ్.. ల్యాగ్ అని అంటావ్ అని సూర్య అంటాడు.

నువ్ చాలా వీక్ అని అర్థం..

నువ్ చాలా వీక్ అని అర్థం..


దీనికి నేను ఒక మాట అంటే నీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతోందంటే నువ్ చాలా వీక్ అని అర్థం. నా కామెంట్స్ కే మీరు ఎఫెక్ట్ అయ్యారంటే, బయట వచ్చే కామెంట్స్ కు మరింత అవ్వొచ్చు. కాబట్టి స్టే స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ అని ఎప్పటి స్టైల్ లోనే గీతూ రాయల్ చెప్పింది. ఇక సుదీపను ఫైమా నామినేట్ చేసింది. నాకు ఫ్లాప్ ఎందుకిచ్చావ్ అని సుదీపను అడిగింది ఫైమా. దానికి సుదీప నా వల్లే నీకు ఫ్లాప్ రాలేదు అంది.

గేమ్ ఆడితే తెలుస్తుంది..

గేమ్ ఆడితే తెలుస్తుంది..

దీంతో గేమ్ ఆడితే తెలుస్తుంది అని ఫైమా వాదించింది. దీనికి నేను కూడా గేమ్ ఆడాను. నా ఒపినీయన్ తప్పు అని చెప్పే అధికారం లేదు అని సుదీప అంది. బాగా మాట్లాడాతావ్ అని ఫైమా అంటే థ్యాంక్యూ అని సుదీప అంది. దీనికి వెల్ కమ్, లవ్ యూ అని ఫైమా వెటకారంగా అన్నట్లుగా అనిపించింది. తర్వాత కీర్తికి ఇనయా ఫోమ్ కొట్టి.. కెప్టెన్ అయితే పెద్ద పవర్సేం రావు. ఇది నా ఆర్డర్, దట్స్ ఇట్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడింది.

 నాకు 80 మార్కులు వచ్చేవి కావు..

నాకు 80 మార్కులు వచ్చేవి కావు..

దానికి కీర్తి గట్టిగానే రెస్పాండ్ అవుతూ నేను ఆర్డర్ చేయడం తప్పు అయితే నాకు 80 మార్కులు వచ్చేవి కావు అంది. దానికి ఇనయా ఇంకో 20 తగ్గింది కదా అంటే.. 80 కంటే ఎక్కువ తెచ్చుకో అప్పుడు చూసుకో అని చెప్పింది కీర్తి. అనంతరం ఆదిరెడ్డి ముఖానికి మెరీనా ఫోమ్ కొట్టింది. మీరు కెప్టెన్ గా ఎలా చేశారు అని అడిగింది మెరీనా. నేను కెప్టెన్ గా ఫెయిల్ అయిన మాట నిజం, కానీ మీరిద్దరు ఆర్గ్యూ చేసిన విషయంలో మీ ఇద్దరిదే తప్పు కానీ నాది లేదు అంటూ గట్టిగా మాట్లాడాడు.

 నీ పాయింట్ వచ్చినప్పుడు రైజ్ చేయి..

నీ పాయింట్ వచ్చినప్పుడు రైజ్ చేయి..

దీంతో వాయిస్ మీరే కాదు, మేము కూడా పెంచగలం అని రోహిత్ అన్నాడు. దానికి ఆదిరెడ్డి వాయిస్ రైజ్ చేయు, రైజ్ చేయు అంటూ రోహిత్ దగ్గరికి వెళ్లిపోయాడు. దీంతో ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఆన్సర్ చెప్పు అని రోహిత్ అంటే.. నీ పాయింట్ వచ్చినప్పుడు రైజ్ చేయి వైఫ్ తో కాద.. కలిసి ఆడుతున్నారా అంటూ చాలా గట్టిగా అరిచాడు ఆదిరెడ్డి. దీంతో ఆదిరెడ్డిని చాలా సీరియస్ గా చూశాడు రోహిత్.

నామినేషన్లలో 9 మంది..


ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 ఆరో వారం నామినేషన్లలో బాలాదిత్య, రాజశేఖర్, గీతూ రాయల్, కీర్తి భట్, సుదీప, మెరీనా, శ్రీహాన్, అర్జున్, ఆదిరెడ్డి మొత్తం 9 మంది ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇక ఐదోవారం చలాకి చంటి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X