For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6 నువ్వేమైనా తోపువా? ఆదిరెడ్డికి భార్య కవిత షాక్

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మొత్తానికి 12వ వారానికి చేరుకుంది. ఇప్పటికి 78 రోజులు 79 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది ఈ రియాలిటీ షో. 90 రోజులుగా సాగే ఈ షోకి టైటిల్ విన్నర్ ఎవరో మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. హౌజ్ నుంచి ఇప్పటికీ 12 మంది వెళ్లిపోగా.. ప్రస్తుతం హౌజ్ లో 9 మంది ఉన్నారు. ఇక ఈ వారం బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఫ్యామిలీ వీక్ సాగనుంది. అంటే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఒక్కో రోజు వచ్చి హౌజ్ లో సందడి చేస్తారు. దీంతో ఈ వీక్ అంతా కంటెస్టెంట్స్ కు చాలా సంతోషంగా, ఎమోషనల్ గా గడవనుంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా ముందుగా ఆదిరెడ్డి భార్య, అతని పాప హౌజ్ లో సందడి చేశారు.

  11 వారాలకు 12 మంది..

  11 వారాలకు 12 మంది..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్‌లోకి 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ నామినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనాలు వెళ్లిపోయారు. 11 వారాలకు 12 మంది వెళ్లిపోగా.. ప్రస్తుతం హౌజ్ లో 8 మంది ఉన్నారు.

  ఫైమా వద్ద ఫ్రీ ఎవిక్షన్ పాస్..

  ఫైమా వద్ద ఫ్రీ ఎవిక్షన్ పాస్..

  ఇక 12వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ రేవంత్, కీర్తి భట్ మినహా మిగతా ఏడుగురు ఉన్నారు. అంటే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 ఈవారం నామినేషన్లలో శ్రీహాన్, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఫైమా, ఇనయా సుల్తానా ఉన్నారు. అయితే వీరిలో ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఫైమా వద్ద ఉంది. ఒకవేళ ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చినా ఆ పాస్ ద్వారా ఫైమా సేఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

   ఇంగ్లీష్ టీచర్ గా ఫైమా..

  ఇంగ్లీష్ టీచర్ గా ఫైమా..

  ఇక బిగ్ బాస్ తెలుగు 6 నవంబర్ 22 మంగళవారం నాటి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రోమో స్టార్టింగ్ లో బిగ్ బాస్ కోచింగ్ సెంటర్ టాస్క్ ఇచ్చాడు. అందులో డ్యాన్స్ టీచర్ గా ఆదిరెడ్డి, ఇంగ్లీష్ టీచర్ గా ఫైమా అని చెప్పారు. దీంతో అందరూ నవ్వారు. తర్వాత టీచర్ గా వచ్చిన ఫైమా.. బోర్డ్ పై ఉన్న డ్రాయింగ్స్ చూసి ఈ డర్టీ పిక్చర్ ను ఎవరు రాశారు అని అడగింది. దీంతో అందరూ తెగ నవ్వేశారు.

  మీరు మాకు బీట్ కొట్టొచ్చా..

  మీరు మాకు బీట్ కొట్టొచ్చా..

  బోర్డ్ పై స్పెల్లింగ్స్ సరిగా రాయలేదు ఫైమా. ఇంగ్లీష్ క్లాష్ అని రాసింది. అలాగే ఎలిఫెంట్ స్పెల్లింగ సరిగా రాయకపోవడంతో.. మేడమ్ ఆ స్పెల్లింగ్ మీకు రాలేదని ఆదిరెడ్డి కామెడీ చేశాడు. దీంతో ఐ విల్ కొడతా అని ఫైమా అంది. తర్వాత అది సరిదిద్దుకుని ఐ విల్ బీట్ అని అంది. దీంతో మీరు మాకు బీట్ కొట్టచ్చా అని రేవంత్ నవ్వించాడు. దీనికి నో నో అంటూ ఫైమా అంది. తర్వాత అటు వైపు నుంచి పాప ఏడుపు సౌండ్ వినిపించింది.

  నీ పది ఓట్లు నాకే కదా..

  నీ పది ఓట్లు నాకే కదా..

  పాప ఏడుపు సౌండ్ తో ఒక్కసారిగా అటువైపు తిరిగాడు ఆదిరెడ్డి. మెయిన్ గేట్ నుంచి ఆదిరెడ్డి భార్య కవిత, అతని కూతురు ఎంట్రీ ఇచ్చింది. వాళ్లను చూసి ఆదిరెడ్డి తెగ సంబరపడ్డాడు. కూతురును ముద్దాడుతూ అన్నం తినిపించాడు. తర్వాత కవిత కాళ్ల దగ్గర కూర్చుని చెప్పు నాన్నా నేను ఎలా ఆడుతున్నానో అని కవితను అడిగాడు. తర్వాత ఆదిరెడ్డి హెయిర్ స్టైల్ ను సరిచేసింది. నీ పది ఓట్లు నాకే కదా అని ఆదిరెడ్డి అడిగితే.. కవిత నవ్వేశారు.

  నన్ను కూడా కొట్టొచ్చా..

  నన్ను కూడా కొట్టొచ్చా..

  వరస్ట్ గా ఉంది కదా నా డ్యాన్స్ అని ఆదిరెడ్డి అడిగితే.. లేదు నవ్వుకున్నాం అని కవిత ఆన్సర్ ఇచ్చారు. ఏంటి నువ్ కూడా నవ్వుకున్నావా అని షాక్ అయ్యాడు. తర్వాత కిచెన్ లోకి మిగతా ఇంటి సభ్యులందరూ వచ్చారు. అందరూ మంచి వాళ్లు.. గేమ్ వరకు మీరు కొట్టుకోండి.. తిట్టుకోండి అని కవిత అంటే.. నన్ను కూడా కొట్టొచ్చా అని ఆదిరెడ్డి అడిగాడు. దీనికి హా.. నువ్ ఏమైనా తోపా.. అని ఆదిరెడ్డికి కవిత షాక్ ఇచ్చింది. దీంతో ఇంటి సభ్యులంతా (ఇదే డైలాగ్ ను వీక్ ఎండ్ లో నాగార్జున అన్నారు) నవ్వేశారు.

  కన్నీళ్లతో రేవంత్..

  ఈరోజు మా పాప అద్విత ఫస్ట్ బర్త్ డే.. ఐ లవ్యూ బిగ్ బాస్ అంటూ కేక్ కట్ చేయించాడు ఆదిరెడ్డి. ఇంటి సభ్యులందరి ముందు ఆదిరెడ్డి కోరుకున్నట్లుగానే అతని పాప బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. తర్వాత తన పాపను ఎత్తుకుంటూ ఆడుకుంటూ సంతోషపడ్డాడు ఆదిరెడ్డి. అనంతరం పాపతోపాటు భార్య కవితను కూడా ఎత్తుకున్నాడు ఆదిరెడ్డి. ఐ లవ్యూ కవిత అంటూ కింద కూర్చుని కవితకు ప్రపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు కన్నీళ్లతో రేవంత్ కనిపించాడు. రేవంత్ భార్య అన్విత ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss Telugu 6: Adireddy Wife Kavitha And His Daughter Entry Bigg Boss House Over Family Week November 22 Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X