twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: గీతూ వెళ్లిపోవడంతో ఆ ముగ్గురికి లక్కీ ఛాన్స్.. టాప్ 5లో ఇక వాళ్ళే!

    |

    బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఎలిమినేషన్స్ అయితే మరింత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఊహించని విధంగా బలమైన కంటెస్టెంట్స్ వెళ్లిపోతున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక గతవారం గీతూ రాయల్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇక మరో ముగ్గురికి ఇప్పుడు టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకునేందుకు అవకాశం వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

     బిగ్ బాస్ పై మచ్చ తొలగింది

    బిగ్ బాస్ పై మచ్చ తొలగింది

    గీతూ రాయల్ హౌస్ లో నుంచి వెళ్లిపోవడంతో బిగ్ బాస్ తనపై ఉన్న అతిపెద్ద మచ్చను తొలగించుకున్నాడు అని చెప్పాలి. ఆమె ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా బిగ్ బాస్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అనే నెగటివ్ కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. అంతేకాకుండా ఆమెకి ఓట్లు కూడా చాలా వరకు తగ్గుతూ ఉండడంతో బిగ్ బాస్ బలమైన నిర్ణయం తీసుకోవడంతో ఆటకు సరైన న్యాయం చేశాడు అని మంచి కామెంట్స్ అయితే అందుకుంటున్నాడు.

     అలా చేయకపోయి ఉంటే..

    అలా చేయకపోయి ఉంటే..

    అయితే గీతూ రాయల్ కేవలం గత రెండుమూడు వారాలలోనే చాలా పేలవమైన ఆటతో నెగిటివ్ కామెంట్స్ అందుకుంది. అయితే ఆమె అంత దారుణమైన కంటెస్టెంట్ అయితే ఏమీ కాదు. అనవసరంగా రూల్స్ బ్రేక్ చేయడం వల్లనే గీతూ బిగ్ బాస్ లోనుంచి వెళ్లిపోయే పరిస్థితిని తెచ్చుకుంది. లేదంటే మరికొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండేది అని చెప్పవచ్చు.

    సరైన పోటీ అని

    సరైన పోటీ అని

    అయితే ఇప్పుడు గీతూ రాయల్ వెళ్లిపోవడంతో టైటిల్ విన్నర్ గా నిలిచే టాప్ 5 కంటెస్టెంట్స్ ర్యాంకులలో కూడా చాలా మార్పులు వచ్చినట్లు అర్థమవుతుంది. గీతూ రాయలైతే తప్పకుండా టైటిల్ విన్నారుగా పోటీని ఇస్తుంది అనుకున్నారు. ఇక రేవంత్ తో పాటు శ్రీహాన్ కూడా టాప్ లో ఉండగా వారిద్దరికీ గీతూ సరైన పోటీ అని గత రెండు మూడు వారాల వరకు ఆమె సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అయితే అందుకుంది.

    టాప్ 3లో

    టాప్ 3లో


    అయితే గీతు రాయల్ గత వారం చేసిన అతి పెద్ద పొరపాట్లు ఆమె ఎలిమినేషన్ కు దారితీసాయి. ఇక ఇప్పుడు ఆమె వెళ్లిపోవడంతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో మళ్ళీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ఎలాగూ టాప్ 2 లో అయితే ఇప్పుడు రేవంత్ తో పాటు శ్రీహన్ కొనసాగుతుండగా ఆ తర్వాత టాప్ 3 కంటెస్టెంట్ గా బాలదిత్యా కొనసాగుతున్నాడు. ఇక వీరికి పోటీగా ఇనయా నిలుస్తోంది.

    టాప్ 5 లిస్టులో..

    టాప్ 5 లిస్టులో..


    ఇక ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే టాప్ 5 కంటెస్టెంట్లలో రేవంత్ శ్రీహాన్ బాలాదిత్య ఇనాయ సుల్తానా తో పాటు మరొక కంటెస్టెంట్ కొనసాగుతోంది. గీతూ వెళ్లిపోవడంతో ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఒక స్థానం కోసం శ్రీ సత్య తో పాటు ఫైమా కూడా పోటీ పడుతుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు టాప్ 5లో చివరి వరకు కొనసాగే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. మరి ఈ లెక్క ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 after geethu royal eliminated top 5 list ranks changed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X