Bigg Boss Telugu 6: నువ్ సపోర్ట్ చేశావ్ ఎలిమినేట్ అయ్యారు.. కీర్తిని గెలుకుతూనే ఉంటారు

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ బిగ్ బాస్ హౌజ్ లో 10 వారాలు గడవగా 11 మంది ఇంటి సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. ఇదిలా ఉంటే ఈవారం సాఫీగా సాగిన నామినేషన్లలో ఇంటి కెప్టెన్ ఫైమా తప్పా మిగతా 9 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 6 పదకొండో వారం ఇంటి కెప్టెన్ గా రేవంత్ విన్ అయ్యాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి తన అభిప్రాయాలను చెప్పేందుకు బీబీ కేఫ్ కు వచ్చారు.

 మూడో సీజన్ కంటెస్టెంట్..

మూడో సీజన్ కంటెస్టెంట్..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లు ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మాజీ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు. ఈ బీబీ కేఫ్ లో వీళ్లందరినీ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు బిగ్ బాస్ 3 సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి హాజరైంది. ఆమెకు పలు క్వశ్చన్స్ వేసి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ రాబట్టింది అరియానా గ్లోరి.

 ఏడిస్తే ట్రోల్ చేస్తారు..

ఏడిస్తే ట్రోల్ చేస్తారు..

శివజ్యోతికి హాయ్ అని చెప్పిన అరియానా తర్వాత పంచ్ వేసింది. నువ్ సపోర్ట్ చేశాకా ఆరోహి, సూర్య ఎలిమినేట్ అయి వెళ్లిపోయారని శివజ్యోతితో అంది యాంకర్ అరియానా గ్లోరి. దీంతో ఏంటది అని షాక్ అయింది శివజ్యోతి. కీర్తి.. ఏడవటం, బాధపడటం, ఎక్స్ ప్రెస్ చేయడమో జరుగుతుంది. సింపతి గేమ్ కూడా ఆడుతుందా అని అరియానా అడిగిన ప్రశ్నకు శివజ్యోతి.. వాళ్ల ఎమోషన్ ఎక్స్ ప్రెస్ చేస్తూ ఏడుస్తున్న ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తున్నారు. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. అయినా అవ్వట్లేదు అంటే అది ట్రూ ఎమోషనే అయింటది కదా అని చెప్పింది.

 పోక్ చేస్తూనే ఉంటారు..

పోక్ చేస్తూనే ఉంటారు..

కీర్తి ఉపయోగించిన సామెత ఎంతవరకు కరెక్ట్ అని అరియా అన్నదానికి.. సత్యతోని నువ్ అంటే ఒప్పుకోను. నేను ఆ ఉద్దేశ్యంతో అన్లేదని అంతా గట్టిగా వాదిస్తుంది అంటే ఎంతైనా ఆ ఉద్దేశ్యంతో అన్లేదేమో అని శివజ్యోతి బదులిచ్చింది. అంటే అక్కడ శ్రీసత్య కావాలనే పోక్ చేస్తుందా కీర్తిని అని అరియానా అడగ్గా.. నాకెందుకో శ్రీసత్, శ్రీహాన్.. కీర్తిని ఎప్పుడు అదే చేస్తుంటారని అనిపిస్తుందని శివజ్యోతి తెలిపింది.

సానుభూతైనా లేదోమో..

సానుభూతైనా లేదోమో..

కీర్తిని శ్రీహాన్ టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుందా అని అరియానా అడిగిన దానికి.. అతను మాట్లాడితే ఆమె తీసుకోలేదు.. ఆమె మాట్లాడితే అతను తీసుకోలేదు. సో బేసిక్ గా ఒకరికి ఒకరు నచ్చకపోవడం తప్పితే.. కీర్తిని శ్రీహాన్ టార్గెట్ చేయడం, కీర్తిని సత్య టార్గెట్ చేయడం కాదు అని శివజ్యోతి బదులిచ్చింది. శ్రీహాన్ ఫేవరిటిజం చూపిస్తున్నాడా అన్న ప్రశ్నకు.. నాలుగు వారాల నుంచి ఆ అమ్మాయి ఆ పట్టి వేసుకునే ఉంది. ఒక మనిషి పడనప్పడు సెన్సెటివ్ ఇష్షూస్ ని ఎవరైనా వదిలేస్తారు సానుభూతి కొద్ది అయినా.. అది కూడా లేదేమో అనిపించిందని శివజ్యోతి పేర్కొంది.

మానిప్యులేటర్స్ ఎవరు లేరు..

మానిప్యులేటర్స్ ఎవరు లేరు..

ది మోస్ట్ మానిప్యులేటర్ ఇన్ ది హౌజ్ ఎవరో చెప్పు అని అడిగితే.. అంతా మానిప్యులేట్ చేసి ఆటను కిందా మీద చేసేవాళ్లు ఎవరు లేరులే అని శివజ్యోతి సమాధానం ఇచ్చింది. ది మోస్ట్ స్మార్ట్ ప్లేయర్ ఎవరన్నదానికి రోహిత్ అన్నా.. అడ్డిమారి గుడ్డి దెబ్బ రాజ్ కూడా అని చెప్పింది.

అలా అనడం కరెక్ట్ కాదు..

ఆదిరెడ్డి కాన్ఫెడెన్స్ కరెక్ట్ గా ఉందా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతోందా అన్నదానికి.. ఇంకా ఎందుకు సేవ్ అవుతున్నారు అని అనడం కరెక్ట్ కాదు. జనాలకు నచ్చారు ఓట్లు వేశారు, సేవ్ అవుతున్నారు. మీరే చెప్పారుగా.. ఓట్లు వేస్తేనే గెలుస్తారు.. మిగతాదంతా ఏముండదు ఏముండదు అని అన్నారుగా అని శివజ్యోతి తన అభిప్రాయం తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X