twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షో ఆగిపోనుందా? అక్టోబర్ 11న ఏం జరగనుంది? కోర్టు ఏం చెప్పనుంది?

    |

    రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. ఇటీవలే బిగ్​బాస్​ ఆరో సీజన్​ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. అయితే ఇటీవల ఓ న్యాయవాది బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ షోని నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు ఘాటుగా స్పందించింది.

     ఊహించని పరిణాలు..

    ఊహించని పరిణాలు..

    రియాలిటీ షో అనే పేరుకు తగినట్లుగానే నిజమైన సంఘటనల ఆధారంగా నడుస్తూ.. ఎన్నో ఊహించని పరిణాలు.. ట్విస్టులతో సాగుతోంది బిగ్ బాస్ తెలుగు 6 షో. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది ఈ రియాలిటీ షో. ఈ కారణంగానే తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.

     సూపర్ డూపర్ హిట్ అవడంతో..

    సూపర్ డూపర్ హిట్ అవడంతో..

    గత సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. ఇక అంచనాలకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు.

    రొమాన్స్, ప్రేమ కహానీలు..

    రొమాన్స్, ప్రేమ కహానీలు..

    మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ షోలో లేడి కంటెస్టెంట్లు చూపించే గ్లామర్ షో కూడా అంతా ఇంతా ఉండదు. తాజాగా ప్రసారం అవుతున్న ఆరో సీజన్ లో కూడా లేడి కంటెస్టెంట్లు అయిన శ్రీ సత్య, వాసంతి, కీర్తి భట్ పొట్టి దుస్తుల్లో బాగానే గ్లామర్ షో చేశారు

    నిలిపివేయాలని పిటిషన్..

    నిలిపివేయాలని పిటిషన్..

    ఇదిలా ఉంటే ఇటీవల ఈ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ను నిలిపివేయాలని ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షోలో అశ్లీలత ఎక్కువైందని, కుటుంబంతో కలిసి చూడాలంటే ఇబ్బందిగా ఉందని న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేస్తూ ఆరోపించారు. ఈ షోలో అశ్లీల ఎక్కువైన కారణంగా, చట్ట ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రసారం చేయాలని కోరారు.

    బిగ్ బాస్ షోపై కోర్టు ఆగ్రహం

    బిగ్ బాస్ షోపై కోర్టు ఆగ్రహం

    దీనిపై స్పందించిన హైకోర్టు బిగ్ బాస్ షోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రియాలిటీ షోలోని అశ్లీలతపై ఘాటుగా స్పందించింది కోర్టు. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయం తీసుకుంటామని, దీనిపై విచారణను అక్టోబర్ 11 వరకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అక్టోబర్ 11న బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి సరైనా సమాధానం రాకపోతే హైకోర్టు బిగ్ బాస్ షోను నిలిపివేసినా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ వినిపిస్తుంది.

    వ్యతిరేకత ఎక్కువగా..

    వ్యతిరేకత ఎక్కువగా..

    ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటే మాత్రం ఈ షోపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ నడుస్తుందా.. లేక ఆగిపోతుందా.. అన్నది చూడాలి. అయితే ఈ బిగ్ బాస్ షోను నిలిపివేయాలని ప్రతి సంవత్సరం నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గతంలో ఢిల్లీ స్థాయిలో ఈ షోని ఆపేయడానికి ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) గైడ్ లైన్స్ కి లోబడే షోని ప్రసారం చేస్తున్నారని బిగ్ బాస్ నిలుపుదల కాలేదు.

    English summary
    రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. ఇటీవలే బిగ్​బాస్​ ఆరో సీజన్​ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. అయితే ఇటీవల ఓ న్యాయవాది బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ షోని నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు ఘాటుగా స్పందించింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X