Bigg Boss Telugu 6: అది తప్పా గేమ్ కనిపించట్లేదు.. శ్రీహాన్-శ్రీ సత్యపై షాకింగ్ కామెంట్స్

ఇంతకుముందెన్నడూ చూడని కాన్సెప్టుతో చిత్ర విచిత్రమైన టాస్కులు, కంటెస్టెంట్ల కొట్లాటలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో భావోద్వేగాలతో కూడిన ప్రయాణమే బిగ్ బాస్ షో. అందుకే ఇది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అనేక సీజన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కూడా పూర్తి కానుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరనేది తేలనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్ల ఆట తీరుపై రివ్యూ ఇచ్చేందుకు బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్ అనిల్ రాథోడ్ హాజరయ్యాడు.

 మోడల్ అండ్ యాక్టర్ హాజరు..

మోడల్ అండ్ యాక్టర్ హాజరు..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బీబీ కేఫ్ కు బీబీ తెలుగు నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్, మోడల్ అండ్ యాక్టర్ అనిల్ రాథోడ్ హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

 ఫ్రెండ్స్ తప్పా గేమ్ కనిపించలేదు..

ఫ్రెండ్స్ తప్పా గేమ్ కనిపించలేదు..

అనిల్ రాథోడ్ ను ఇన్వైట్ చేసిన బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి అతనితో కలిసి డ్యాన్స్ చేసింది. నీ ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరు అని అరియానా గ్లోరి అడగ్గా రేవంత్, రోహిత్, రాజ శేఖర్ తప్పా మిగతా అంతా ఫేక్ గా ఆడుతున్నారని అనిపించిందని అనిల్ రాథోడ్ సమాధానం ఇచ్చాడు. శ్రీ సత్య గురించి చెప్పమని అడగ్గా.. ఫ్రెండ్స్ తప్పా ఆమె గేమ్ నాకు ఎక్కడా కనిపించలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రతి ఒక్క కార్డ్ ఉపయోగించింది..

ప్రతి ఒక్క కార్డ్ ఉపయోగించింది..

శ్రీహాన్ కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తాడు. ఫ్యామిలీ వీక్ తర్వాత కొత్తగా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు సేఫ్ ఆడాడా.. ఇప్పుడు సేఫ్ ఆడుతున్నాడా.. ఇంతకుమందు ఫేక్ ఆ.. ఇప్పుడు ఫేక్ ఆ.. అర్థం కావట్లేదని చెప్పాడు అనిల్ రాథోడ్. ఇనయా సుల్తానా గురించి చెప్పమని అడగ్గా.. ఆమె ప్రతి ఒక్క కార్డ్ ఉపయోగించి గేమ్ ఆడింది. ఫ్రెండ్షిప్ అని ఆడింది.. సూర్యతో కొంచెం క్లోజ్ అయి అలా ట్రై చేసింది.. ఆ ఫ్రెండ్ నే మళ్లీ నామినేట్ చేసి ఆడింది. ఆమె ఏం చేసిన గానీ గేమ్ అయితే బాగా ఆడుతుంది అని అనిల్ రాథోడ్ వివరించాడు.

 కీర్తికి బ్యాడ్ ట్యాగ్..

కీర్తికి బ్యాడ్ ట్యాగ్..

శ్రీసత్య ఇంకా కీర్తి పేరే తీసుకోలేదు అని అనిల్ రాథోడ్ ను అరియానా గ్లోరి అడగ్గా.. వాళ్లు నాకు టాప్ 5లో ఉండేవాళ్లు కాదని అనిపించిందని మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అనిల్ రాథోడ్ తో ఎవరు బెస్ట్ ఎవరు బ్యాడ్ అనే టాస్క్ ఆడించింది అరియానా గ్లోరి. కీర్తి భట్ కు బ్యాడ్ అని ట్యాగ్ ఇచ్చాడు అనిల్. దీంతో అరియానా గ్లోరి షాక్ అయింది. ఇలా ఆసక్తికరంగా అనిల్ రాథోడ్ తో ఇంటర్వ్యూ జరిగింది.

నామినేషన్ లో ఆరుగురు..

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ 91 రోజులు 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. చూస్తుంటే ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో టైటిల్ విన్నర్ ఎవరా అని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 14వ వారం మాత్రం ఇంటి సభ్యుల్లో శ్రీహాన్ తప్పా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయ్యారు. శ్రీహాన్ ఫినాలేకు వెళ్లడంతో అతన్ని నామినేట్ చేయలేదు బిగ్ బాస్. దీంతో ప్రస్తుతం నామినేషన్లలో ఆరుగురు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X