twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: ప్రైజ్ మనీ కోసం మరో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. రంగంలో ఆదిరెడ్డి vs రోహిత్!

    |

    బిగ్ బాస్ లో పరిస్థితులు మళ్లీ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. మొన్నటి వరకు చాలా స్నేహంగా ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడు ఊహించిన విధంగా విరోధులుగా మారిపోతున్నారు. చిన్నచిన్న కారణాలకు కూడా గొడవ పడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక 94వ రోజు ఎపిసోడ్ లోని కొన్ని హైలెట్స్ లోకి వెళితే.. టాప్ కంటెస్టెంట్స్ మధ్యలో కిచెన్ లో జరిగిన గొడవ ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా ప్రైజ్ మనీ లో మరికొంత డబ్బును గెలుచుకునేందుకు కూడా బిగ్ బాస్ ఈరోజు కంటెస్టెంట్స్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

     రేవంత్ గొడవలు

    రేవంత్ గొడవలు

    తిండి దగ్గర రేవంత్ శ్రీహాన్ మధ్యలో గొడవ మొదలైంది. కొన్ని తప్పులు ఒప్పుకునే ధైర్యం కూడా లేదు అని రేవంత్ పై అతను చాలా సీరియస్ అయిపోయాడు. నేను కూడా ముందు చెప్పింది గమనించాలి అని రేవంత్ కూడా తన వైపు నుంచి సమాధానాలను ఇచ్చాడు. అంతేకాకుండా వేస్ట్ గాడు ఉన్నట్లు మాట్లాడుతావని కూడా కౌంటర్ ఇచ్చాడు. శ్రీ సత్య తో కూడా అతనికి బాగానే గొడవ అయింది. ఆమె కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    20 వేల రూపాయలు

    20 వేల రూపాయలు

    ఇక ఇంటి సభ్యులందరూ కూడా ఐదవ చాలెంజ్ లో పోటీపడేందుకు రోహిత్ రెడ్డి ఆది రెడ్డిని ఎంచుకోవల్సి వచ్చింది. ఇక మీ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ ఛాలెంజ్లో మీ విజేతను ఎంచుకోవడానికి 20వేల రూపాయలు ఇస్తున్నారు. బిగ్ బాస్ మీ పేరు పిలిచినప్పుడు మీ దగ్గర ఉన్న 20వేల రూపాయలతో వారికి మద్దతును తెలపాల్సి ఉంటుంది.. అని బిగ్ బాస్ ఒక వివరణ అయితే ఇచ్చినట్లుగా రేవంత్ చదివి వినిపించాడు.

    సపోర్టర్స్ ను వెతుక్కున్నారు

    ఇక కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి సపోర్టర్స్ ను వెతుక్కున్నారు. ముందుగా రోహిత్ గెలుస్తాడని ఎంచుకున్న వారు అతని పక్కన వచ్చి నిలబడాలి అని బిగ్ బాస్ తెలియజేయడంతో మొదట అందరి కంటే ముందుగా శ్రీ సత్య వచ్చి నిలబడింది. ఇక ఆదిరెడ్డి గెలుస్తారని భావించినవారు తనకు మద్దతు తెలిపిన సభ్యులు ఆదిరెడ్డి పక్కనే వచ్చి నిలబడాలని అనగానే ఊహించినట్లుగానే రేవంత్ నుంచి సపోర్ట్ ఇచ్చాడు.

    ఎవరు నెగ్గుతారో?

    ఎవరు నెగ్గుతారో?

    అయితే ఆదిరెడ్డి పక్కనే ఎక్కువ మంది నిలబడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రేవంత్ తో పాటు శ్రీహన్ అలాగే ఇనయా సుల్తానా కీర్తి నలుగురు కూడా ఆదిరెడ్డి గెలుస్తాడు అని ఫిక్స్ అయ్యారు. ఇక బిగ్ బాస్ ఆ తర్వాత మనీ మేజ్ అనే ఛాలెంజ్ ఇచ్చారు. పజిల్ తో కూడిన ఆ గేమ్లో ఆదిరెడ్డి ఎప్పటిలానే ధీటుగా ఆడుతూ కనిపించాడు. రోహిత్ కూడా గట్టిగానే పోటీపడ్డాడు. ఇక వారిద్దరూ గేమ్ ఆడుతుంటే ఇంటి సభ్యులందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ కనిపించారు. మరి ఈ ఆటలో ఎవరు నెగ్గుతారో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 another Chance to receive the prize money..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X