For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: మళ్ళీ డబ్బు సంపాదించుకునే ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్.. ఇద్దరి మద్యే బిగ్ ఫైట్!

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మరోసారి యూటర్న్ తీసుకోబోతున్నట్లు అనిపిస్తుంది. చివరి దశకు చేరుకున్న తర్వాత బిగ్ బాస్ ఊహించిన విధంగా ఒక్కొక్కరికి షాక్ ఇచ్చే విధంగా టాస్క్ లను అయితే పెడుతున్నాడు. అంతేకాకుండా ఏకాభిప్రాయమనే ఒక మాటతో కూడా బిగ్ బాస్ మరింత చిరాకు తెప్పిస్తున్నాడు అనిపిస్తోంది. ఫైనల్ ఆటలో కూడా ఏకాభిప్రాయం అనేది ఏమిటో బిగ్ బాస్ కే తెలియాలి. అయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు వారు పోగొట్టుకున్న ప్రైజ్ మనీని మళ్లీ దక్కించుకునే ఒక అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతున్నాడు. నేటి ఎపిసోడ్లోని హైలెట్స్ లోకి వెళితే..

  అతనితోనే..

  అతనితోనే..

  హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లలో శ్రీహాన్ ఒక్కడే ఫైనల్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ అతనితోనే గేమ్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాడు. మీ అభిప్రాయంలో ఏ ఒక్క ఇంటి సభ్యుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మీరు అనుకుంటున్నారు ఆ సభ్యులకి అన్ డిజైర్వ్ బ్యాచ్ ఇవ్వాలి అని శ్రీహన్ కు బిగ్ బాస్ తెలియజేసాడు. దీంతో అతను వెళ్లి ఆఖరి స్థానంలో కొనసాగుతున్న రోహిత్ కు ఇచ్చాడు.

   నేను మారలేదు

  నేను మారలేదు

  రోహిత్ గురించి మాట్లాడిన శ్రీహాన్ మీరు మారింది నిజమే.. గేమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. కానీ పదవ వీక్ వరకు నువ్వు ఒకే తరహాలో ఆడావు. కానీ తర్వాత అంత ఇంపాక్ట్ అనిపించలేదు అన్నట్లుగా అతను వివరణ ఇచ్చారు. అయితే తాను మాత్రం కొంచెం కూడా మారలేదు అని రోహిత్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. స్టార్టింగ్ నుంచి నేను ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను అంటూ.. నువ్వు అయితే ఎవరితోనో ఈక్వల్ గా ఇంటరాక్ట్ అవ్వలేదు అని శ్రీహన్ కు కౌంటర్ ఇచ్చాడు.

  జాక్ పాట్ లాంటి ఆఫర్

  జాక్ పాట్ లాంటి ఆఫర్

  ఇక బిగ్ బాస్ ఈసారి కంటెస్టెంట్ కు జాక్ పాట్ లాంటి మరో ఆఫర్ ఇవ్వబోతున్నాడు. ఇంటి సభ్యులందరూ కూడా విన్నర్ యొక్క ప్రైజ్ మనీ నుంచి ఖర్చుపెట్టి ఎలక్షన్ పాస్ గెలుచుకున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ కూడా ఆ డబ్బులు తిరిగి సంపాదించుకునే అవకాశం ఇస్తున్నారు. బిగ్ బాస్ కొన్ని చాలెంజ్ లు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒక్కో ఛాలెంజ్ లో ఇద్దరు పాల్గొంటారు. ఇక వారు ఎవరెవరు అనేది ఇంటి సభ్యులు ఏక అభిప్రాయంతో నిర్ణయించుకోవాలని కూడా చెప్పడంతో కంటెస్టెంట్స్ అందరూ మళ్ళీ కన్ఫ్యూజన్లో పడ్డారు.

   బిగ్ బాస్ మరో ప్లాన్

  బిగ్ బాస్ మరో ప్లాన్

  అయితే ఒక ఛాలెంజ్ లో రోహిత్ శ్రీ సత్య ఇద్దరు పోటీ పడ్డారు. ఇక కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ అందరి చేత ఒక ఓటు ప్రక్రియను కూడా నియమించాడు. ఇద్దరు ఇంటి సభ్యులు పోటీ పడినప్పుడు ఎవరైతే ఓడిపోతారు అని అనుకుంటున్నారో వారి పేరు మీద స్టాంపు వేసి వాలెట్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ అందరికీ అవకాశం ఇచ్చారు.

  వారిద్దరిలో శ్రీహన్ సపోర్ట్ ఎవరికి?

  ఇక మొదట శ్రీ సత్య రోహిత్ మధ్యలో ఒక టాస్క్ అయితే కొనసాగింది. గోనిసంచిలో పరిగెత్తుకుంటూ ఈ ఆట ఆడాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఈ ఆటను అయితే చాలా విభిన్నంగా ప్లాన్ చేసినట్లు అర్థం అవుతుంది. శ్రీహన్ శ్రీ సత్య ఇద్దరు కూడా పోటాపోటీగా ఈ ఆటలో వారి బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇక ఇటీవల శ్రీహన్, శ్రీ సత్యం మధ్యలో వైరం ఎక్కువైన విషయం తెలిసిందే. మరి వారి ఇద్దరిలో శ్రీహన్ ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తాడో చూడాలి.

  English summary
  Bigg boss telugu 6 another jackpot offer to housemates
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X