Bigg Boss Telugu 6: ఎలిమినేట్ అయిన 'పప్పు'!.. ఆమె కోసం తహతహలాడి ఇలా.. ఇక లేని లవ్ ట్రాక్?

తెలుగు రియాలిటీ షోలలో అధికంగా పాపులర్ అయినదాంట్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు కొత్త సీజన్ లు తీసుకొస్తూ ఆద్యంతం బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది ఈ రియాలిటీ షో. మొన్నటివరకు చప్పగా సాగిన ఇంటి సభ్యుల ఆట తీరును హుషారెత్తించాడు బిగ్ బాస్. ఫుడ్ టాస్క్, ఎలిజిబిలటీ టాస్క్, డిజాస్టర్ టాస్క్ ఇచ్చి హౌజ్ మేట్స్ లో ఫైర్ తీసుకొచ్చాడు. ఇక శని, ఆదివారాలు వచ్చాయంటే వారిలో ఒకరు ఎలిమినేట్ అయి బయటకు వెళతారని తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు వెళ్లిపోయిన ఈ హౌజ్ నుంచి ఇప్పుడు మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఆ కంటెస్టెంట్ ఎవరనే పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ నుంచి మరో వికెట్ పడింది. అనేక అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో చైల్డ్ ఆర్టిస్ట్ లు బాలాదిత్య, సుదీప (పింకీ)తోపాటు కీర్తి భట్, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌ ఉన్నారు.

 తప్పించుకున్న ఇద్దరు..

తప్పించుకున్న ఇద్దరు..

ఈ 21 మంది ఇంటి సభ్యుల్లో ఆరు వారాల్లో వరుసగా షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ మొత్తం ఆరుగురు ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 15 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. ఇక ఈ ఉన్నవాళ్లలో ఈ ఏడో వారం 13 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. కెప్టెన్ అయిన కారణంగా ఆర్జే సూర్య నామినేషన్ నుంచి తప్పించుకోగా గీతూ రాయల్ ను ఎవరు నామినేట్ చేయలేదు.

డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని..

డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని..

అయితే ఈ ఏడో వారం 13 మంది నామినేషన్లలో ఉన్నందును డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు. కానీ సింగిల్ ఎలిమినేషన్ జరగనుందట. ఈ సింగిల్ ఎలిమినేషన్ లో అర్జున్ కల్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళనున్నాడని టాక్ వినిపిస్తోంది. అర్జున్ కల్యాణ్ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో కాలు మోపినప్పటి నుంచి గేమ్ ఆడటం కన్నా శ్రీ సత్యపైనే కాన్సంట్రేట్ చేశాడు.

 ఆమెపైనే అర్జున్ ఫోకస్..

ఆమెపైనే అర్జున్ ఫోకస్..

ఏదో నామ మాత్రంగా టాస్క్ లు ఆడటం, ఎక్కువగా శ్రీ సత్య చుట్టూ తిరగడంతోనే రోజులు గడిపేశాడు అర్జున్ కల్యాణ్. మరి అలా తిరగడంతో ఏదైనా లాభం ఉందా అంటే.. అది కూడా లేదు. శ్రీ సత్య చుట్టూ అర్జున్ కల్యాణ్ ఎంత తిరిగినా ఆమె పట్టించుకుంది లేదు. అయినా ఆమెపైనే అర్జున్ ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అతని గేమ్ డల్ గా ఉండటమే కాకుండా, హౌజ్ లో అతని పట్ల చులకన భావం కూడా ఏర్పడింది.

అర్జున్ ని పప్పు అని..

అర్జున్ ని పప్పు అని..

కానీ, గత రెండు రోజుల్లో జరిగిన టాస్క్ లో మాత్రం కాస్తా ఫైర్ అయ్యాడు అర్జున్ కల్యాణ్. అది కూడా అర్జున్ ని పప్పు అని రేవంత్ పిలవడం, అలా పిలిస్తే ఊరుకుంటావా అని శ్రీ సత్య మందలించడంతో వచ్చిందని కూడా ఉంది. ఇక అర్జున్ ను అవసరమైనప్పుడు వాడుకోవడం, లేనిచోట నువ్ గేమ్ ఆడాలని కబుర్లు చెప్పడం వంటివి చేస్తూ నెట్టుకొచ్చింది శ్రీ సత్య.

కంటెంట్ వచ్చే పరిస్థితి లేదనే..

కంటెంట్ వచ్చే పరిస్థితి లేదనే..

ఆమె అర్జున్ ని బాగా వాడుతుందని ఇదివరకు బీబీ కేఫ్ కు వచ్చిన మాజీ కంటెస్టెంట్లు కూడా అభిప్రాయపడ్డారు. తన గేమ్, పరిస్థితిని అర్థం చేసుకోలేని అర్జున్ కల్యాణ్ తో కంటెంట్ వచ్చే పరిస్థితి లేదనే.. బిగ్ బాస్ అతని వీడ్కోలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఇన్ని పరిణామాల మధ్య అర్జున్ కల్యాణ్ ఎలిమినేషన్ అయినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X