Bigg Boss Telugu 6: అర్జున్ చేసిన తప్పులు ఇవే.. అతని రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్ బాస్ 6వ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో గేమ్ అడడం లేదని కామెంట్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో గాని ఉండాల్సిన వాళ్ళు వెళ్లిపోతున్నారు.. అర్హత లేని వాళ్ళు అలానే ఉంటున్నట్లు కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక 7వ వారం అర్జున్ కళ్యాణ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక అతను ఈ 7 వారాలకు ఎలాంటి రెమ్యునరేషన్ అందుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

టాప్ లో ఉంటాడు అనుకుంటే..
బిగ్ బాస్ లో చివరి వరకు ఉంటారు అని అనుకున్న కొంతమంది కంటెస్టెంట్స్ ఊహించని విధంగా కొన్ని రోజులకే వెళ్ళిపోతున్నాను. ఇక టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటారు అనుకున్న అర్జున్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను గత రెండు మూడు వారాలలో చేసిన మిస్టేక్స్ కూడా అతని బయటికి పంపించడానికి కారణమయ్యాయి.

అమ్మాయిలతో అలా..
ఈసారి చాలావరకు కొన్ని విషయాలలో ఆడియోన్స్ నుంచి అయితే నెగటివ్ కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. ముఖ్యంగా ఎవరూ కూడా చాలా బలంగా వారి క్యారెక్టర్ ను హైలెట్ చేయడం లేదు. ఆ విషయంలో కూడా అర్జున్ ఫెయిల్ అయ్యాడు. అతను అమ్మాయిలతో అప్పుడప్పుడు కాస్త రొమాంటిక్ గా ఉండేందుకు ప్రయత్నం చేశాడు కానీ అందులో కూడా ఆడియన్స్ కు పెద్దగా ఆకట్టుకున్నది లేదు.

నెగిటివ్ కామెంట్స్
ముఖ్యంగా బిగ్ బాస్ మొదలైనప్పుడు టాస్క్ లలో కూడా అతను పెద్దగా పోరాడింది ఏమీ లేదు దొంగ పోలీస్ ఛాలెంజ్ లో కూడా అతను చాలావరకు వెనకడుగు వేశాడు. ఒక విధంగా ఆటలో ఎదురించి పోరాడాలి కానీ ఎవరైనా తప్పు చేస్తే వారిని సమర్థిస్తూ వెళ్లడం కూడా మరింత పెద్ద తప్పు అవుతుంది. కొన్నిసార్లు ఆ విధంగా కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే అందుకున్నాడు.

సత్య, వాసంతి లతో
అర్జున్ నాలుగో వారం లేదా 5 వారం వెళ్ళిపోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత అతను మళ్ళీ ఒక్కసారిగా ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపించింది. అలాగే మిగతా అమ్మాయిలతో కూడా సరదాగా ఉండడం షోలో హైలెట్ గా నిలిచింది. సత్య, వాసంతి లతో కూడా అతను అప్పుడప్పుడు చాలా క్లోజ్ గా కనిపించాడు. కానీ ఆ కెమిస్ట్రీ ఎక్కువ రోజులు హైలెట్ కాలేకపోయింది.

రెమ్యునరేషన్ ఎంతంటే?
ఏదేమైనా కూడా రొమాంటిక్ బాయ్ గా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో హైలైట్ గా నిలుస్తాడు అని అనుకున్న అర్జున్ చాలా తొందరగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక అతను ఎనిమిది వారాలపాటు బిగ్ బాస్ ద్వారా తన రేంజ్ కు తగ్గట్టుగా బాగానే అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక వారానికి రూ.20 వేలు అందుకుంటూ వచ్చిన అర్జున్ కళ్యాణ్ మొత్తంగా 7 వారాలకు 1.40 లక్షలు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











