Bigg Boss Telugu 6: ఆరోహి, సూర్య ఎమోషన్ డ్రామా.. అతనికి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్!

బిగ్ బాస్ 4వ వారానికి వచ్చేసరికి సరికొత్త టాస్క్ లతో ఎంతో ఆసక్తికరంగా మారుతొంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా కాస్త బార్డర్లు దాటేసి వారి అసలైన రూపాలను బయటపెడుతున్నారు. ఇక ఇప్పుడు అసలైన యూటర్న్ తీసుకునే సమయం కూడా వచ్చింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సరికొత్త ఎత్తులను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన ప్రోమో విడుదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లామరస్ బ్యూటీలతో..

గ్లామరస్ బ్యూటీలతో..

బిగ్ బాస్ హోటల్ టాస్క్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కొంతమందికే చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అర్జున్ అయితే గ్లామరస్ బ్యూటీలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా బిల్డప్ ఇస్తున్నాడు. ఇక వాళ్లను చూసి ఏమిటి ఈ ఘోరమంటూ శ్రీహన్ నేలపై కూర్చుండిపోయాడు. మా సింగిల్స్ ఏమైపోవాలి అని పొరపాటున అనేశాడు. ఇక సిరి సింగిల్ అంట అంటూ పక్కనే ఉన్న శ్రీ సత్య మాట్లాడింది. ఇక్కడ సింగిలే అంటూ శ్రీహాన్ కామెడీగా చెప్పాడు.

వారిద్దరి మధ్యలో

వారిద్దరి మధ్యలో

ఇక మరోవైపు అర్జున్ శ్రీ సత్య మధ్యలో ఏదో కెమిస్ట్రీ నడుస్తున్నట్లుగా హైలైట్ అవుతుంది. ఇక వారి నుంచి గ్యాప్ వచ్చేందుకు అనవసరంగా ఏదో ఊహించుకోకండి అని సుదీప అతనికి అర్థం చేసుకునే విధంగా చెప్పింది. అయినప్పటికీ అతను అలానే కొనసాగాడు. ఇక రేవంత్ కూడా మీరు ఊబిలో పడిపోతున్నారు అంటూ కామెడీగా హెచ్చరించారు.

ఎమోషనల్ ట్రాక్

ఎమోషనల్ ట్రాక్

ఇక మరోవైపు అందరూ ఆహ్లాదకరంగా టాస్క్ కొనసాగిస్తూ ఉంటే మరోవైపు సూర్య ఆరోహి మధ్యలో ఎమోషనల్ డ్రామా కొనసాగింది. తనకు నచ్చలేదు అంటే నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెబుతాను అంటూ శ్రీ సత్య చెప్పగా నాకు కూడా నీ విధానంలో ఒకటి నచ్చడం లేదు అని ఆరోహి చెప్పింది. సరే చెప్పు మార్చుకుంటాను అని ఇతరులతో క్లోజ్ గా ఉండడం నీకు నచ్చడం లేదు కదా అని చెప్పిన సూర్య తనకు కూడా అలానే అనిపిస్తుంది అని అన్నాడు.

ఫోకస్ చేయాలి అంటూ

ఫోకస్ చేయాలి అంటూ

అందుకే నువ్వు నిన్ను మార్చుకోవాలి అని నేను చెప్పానా అని సూర్య ప్రశ్నించాడు. తర్వాత నేను నలుగురితో కనెక్ట్ అయ్యాను నువ్వు ఇద్దరితో కనెక్ట్ అయ్యావు అంటూ సూర్య చెప్పడంతో ఆరోహి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది. ఇక తర్వాత సూర్య ఏ మాత్రం ఆలోచించకుండా గేమ్ పై ఫోకస్ చేయాలి అంటూ తనను తానే మోటివేట్ చేసుకున్నాడు.

సీక్రెట్ టాస్క్

ఇక తర్వాత చివరలో టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ చంటికి సీక్రెట్ టాస్క్ ఇస్తున్నట్లుగా చెప్పాడు. చలాకీ చంటి కి ఇప్పటివరకు గేమ్ లో హైలైట్ అయ్యే విధంగా ఒక్క అవకాశం కూడా రాలేదు. ఒక విధంగా అతను అంతగా మెప్పించడం లేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అతనికి బిగ్ బాస్ అయితే గేమ్ మార్చేసే ఒక మంచి టాస్క్ అయితే ఇచ్చాడు. మరి ఆ సీక్రెట్ టాస్క్ తో చంటి గేమ్ ను ఎలా చేంజ్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X