Bigg Boss Telugu 6: శ్రీహన్ తో ఆ అమ్మాయికి లింక్.. సిరి పేరు తీస్తూ.. ఉరికిచ్చి కొడతానని వార్నింగ్

బిగ్గెస్ట్ కాంట్రవర్సీస్ షో బిగ్ బాస్ 6వ సీజన్ ఈసారి ఏ విధంగా ఆసక్తిని రేపిస్తుంది అనే విషయంలో అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మంటెస్టెంట్స్ ఎవరూ కూడా పెద్దగా పేరున్న సెలెబ్రెటీలు కాదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కొంత మంది కెమిస్ట్రీ ఈ షోకు హైలైట్ అయ్యేలా ఉంది అనిపిస్తోంది. ఇక ఎక్కువగా అందరి ఫోకస్ అయితే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ పైనే ఉంది. అతను ఏ అమ్మాయితో క్లోజ్ అవుతాడో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు కొంత ఆసక్తిని రేపుతున్నాయి. అయితే రీసెంట్ గా ఆర్జే సూర్య అతనికి మరో అమ్మాయికి లింకు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

వాళ్ళు కెమిస్ట్రీతో కొనసాగే ఛాన్స్

వాళ్ళు కెమిస్ట్రీతో కొనసాగే ఛాన్స్

గొడవలు పడకుండా అమ్మాయిలు అబ్బాయిలు విభిన్నమైన కెమిస్ట్రీని హైలెట్ చేస్తూ ఉంటే వారికి కూడా మంచి క్రేజ్ అయితే పెరుగుతుంది. ఇక ఈసారి జోడీలుగా ఎవరు హైలైట్ అవుతారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. హ్యాండ్సమ్ బాయ్స్ బ్యూటిఫుల్ అమ్మాయిలు ఈసారి హౌస్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇక వారిలో శ్రీ సత్య, అర్జున్, ఆరోహి, కీర్తి, శ్రిహన్, నేహా, వాసంతి ఇలా కొంతమంది అయితే హౌస్ లో బిగ్ బాస్ రెగ్యులర్ కెమిస్ట్రీతో కొనసాగే ఛాన్స్ అయితే ఉంది.

ఫోకస్ అతనిపైనే

ఫోకస్ అతనిపైనే

అయితే అందరి ఫోకస్ అయితే ఎక్కువగా శ్రీహాన్ పైనే ఉంది. ఎందుకంటే అతను గత సీజన్ లో టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన సిరి బాయ్ ఫ్రెండ్ కావడంతో ఇప్పుడు అతను హౌస్ లో ఏ అమ్మాయితో జత కడతాడు ఇక వారిపై ఎలాంటి రూమర్లు వస్తాయి ఆ తర్వాత సిరి ఏ విధంగా స్పందిస్తుంది అనే సందేహాలు చాలానే వస్తున్నాయి.

శ్రీహాన్ ఎక్కడ కనిపించినా

శ్రీహాన్ ఎక్కడ కనిపించినా

అయితే ఆర్జె సూర్య మాత్రం రీసెంట్గా శ్రీహన్ కు మొదట ఒక అమ్మాయితో లింకు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు. ఆరోహి రావు. ఆరోహి ఇప్పటివరకు పెద్దగా టాస్కులలో హడావిడి చేసింది లేదు. చాలా సింపుల్ గానే కొనసాగుతోంది. ఇక ఇప్పుడు ఆమె ఎక్కువగా శ్రీహాన్ తో క్లోజ్ కావడానికి రెడీగా ఉందా అనే అనుమానం వస్తోంది. ఎందుకంటే శ్రీహన్ ఎక్కడ కనిపించినా కూడా ప్రేమగా మాట్లాడుతోంది.

శ్రీహన్ నా గ్యాంగ్

శ్రీహన్ నా గ్యాంగ్

గార్డెన్ ఏరియాలో రాత్రి సూర్య ఆరోహి కీర్తి అలాగే ఫైమా నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక అప్పుడే శ్రీహన్ అటువైపు వెళుతూ ఉండగా ఇక అప్పుడు కీర్తి మా గ్యాంగ్ లో ఉండవా అని అడుగుతుంది. పక్కనే ఉన్న ఆరోహి మనకు గ్యాంగ్ ఎక్కడ ఉంది అని అంటూ ఉండగా మళ్లీ శ్రీహన్ వైపు చూస్తూ అతను నా గ్యాంగ్ అంటూ సిగ్గుపడుతూ మాట్లాడింది. ఇక వెంటనే అలా ఉంటే గ్యాంగ్ అనరు జోడి అంటారు అంటూ మరోసారి కీర్తి మాట్లాడింది.

ఊరికించి మరి కొడతాను

ఊరికించి మరి కొడతాను

ఇక సూర్య మరింత రెచ్చిపోయి వారిద్దరికీ ఏదో నడుస్తుంది అన్నట్లు నవ్వుతూ మాట్లాడాడు. సిరి కూడా చూస్తోంది అని కామెంట్ చేశాడు. ఇక నాకు ఫ్రెండ్ అంటూ ఆరోహి మాట్లాడుతుండగా గట్టిగా నవ్వేసిన సూర్య వాళ్ళిద్దరూ సిగ్గుపడుతున్నారు అని కామెంట్ చేశాడు. దీంతో ఆరోహి కూడా నవ్వుతూనే కౌంటర్ ఇచ్చింది. ఇలా అంటే అసలు ఊరుకోను.. ఊరికించి మరి కొడతాను.. అంటూ ఆర్జె సూర్యకు నవ్వుతూనే వార్నింగ్ అయితే ఇచ్చింది. మరి నిజంగానే వీరి మధ్యలో ట్రాక్ కొనసాగుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X