For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: అనూహ్యంగా మరో కంటెస్టెంట్ ఎలిమినేట్!.. శాపంగా మారిన లవ్ ట్రాక్ ?

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తుంటాయి. కానీ, అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నేళ్ల క్రితం పరిచయం అయిన బిగ్ బాస్ ఒకటి. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా దీనికి మంచి ఆదరణ దక్కింది. అందుకే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఆరో కూడా అదే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీలు సడెన్ రీ ఎంట్రీలతోపాటు అనూహ్యమైన ఎలిమినేషన్లు సర్వసాధారణమే. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ నుంచి ఆ ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందట.

   ప్రేమయణాలు, స్ట్రాటజీలతో..

  ప్రేమయణాలు, స్ట్రాటజీలతో..

  బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇప్పటి వరకు 5 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా రసవత్తరంగా ఆరో సీజన్ సాగుతోందన్న విషయం తెలిసిందే. అరుపులు, కేకలు, గొడవలు, బూతులు, ప్రేమయణాలు, స్ట్రాటజీలతో మంచి కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బిగ్ బాస్ హౌజ్ మేట్స్.

   ఆసక్తికరంగా ఆరో సీజన్..

  ఆసక్తికరంగా ఆరో సీజన్..

  గత సీజన్ల కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని చెప్పినట్లుగానే.. బిగ్ బాస్ నిర్వహకులు ఆరో సీజన్‌ను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరంభంలోనే అదిరిపోయే టాస్కులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. అయినప్పటికీ ఈ సీజన్‌కు స్పందన కరువై రేటింగ్ అంతగా దక్కడం లేదు.

  ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్

  ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌ మొత్తం కలిపి 21 మంది ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మూడు వారాల్లో షానీ, అభినయ, నేహాలు ఎలిమినేట్ అయ్యారు.

  అనూహ్యంగా నేహ చౌదరి..

  అనూహ్యంగా నేహ చౌదరి..

  అయితే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మూడో వారం అనూహ్యంగా నేహ చౌదరి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ''ఇది బిగ్ బాస్. ఇక్కడ ఏమైనా జరగొచ్చు'' అన్న విషయానికి జస్టిఫికేషన్ గా నేహా చౌదరి ఎలిమినేషన్ ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు అదేవిధంగా మరో కంటెస్టెంట్ అనూహ్యంగా ఎలిమినేట్ కానుందని వార్తలు వస్తున్నాయి.

  నామినేషన్లలో పది మంది..

  నామినేషన్లలో పది మంది..

  బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో నాలుగో వారం ఎలిమినేషన్‌కు శనివారం సిద్దమైంది. బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ నాలుగో వారం నామినేషన్లలో బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేసిన అర్జున్ కల్యాణ్, కీర్తి భట్ తో పాటు సుదీప, ఆరోహి, శ్రీహాన్, ఇనయా సుల్తానా, రాజశేఖర్, సూర్య, రేవంత్, గీతూ రాయల్ 10 మంది ఉన్నారు.

  అంతగా రుచించని లవ్ ట్రాక్..

  అంతగా రుచించని లవ్ ట్రాక్..

  వీరిలో అనూహ్యంగా టీవి 9 యాంకర్ ఆరోహి రావు ఎలిమినేట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్జే సూర్య, ఆరోహి రావు మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులకు అంతగా రుచించలేదని సమాచారం. వారిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్, అలకలు, బుజ్జగింపులు, డ్రామా అనవసరంగా ఉన్నట్లు ఒక వర్గం ప్రేక్షకులు ఫీల్ అయ్యారట. అంతేకాకుండా ఆరోహి లేకుండా ఆర్జే సూర్య గేమ్ బాగానే ఆడగలడని అభిప్రాయపడుతున్నారట.

   తొమ్మిదో స్థానంలో ఆరోహి రావు..

  తొమ్మిదో స్థానంలో ఆరోహి రావు..

  మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే శనివారం పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఆరో సీజన్ నాలుగో వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్‌ ప్రకారం ఎనిమిదో స్థానంలో రాజశేఖర్, ఆరోహి రావు తొమ్మిది, సుదీప పది స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం రాజ్ సేఫ్ అయిన సుదీప కానీ ఆరోహి కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే సమాచారం అందింది.

  English summary
  Anchor Arohi Rao Eliminated In Bigg Boss Telugu 6th Season Fourth Week Elimination Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X