Bigg Boss Telugu 6: ఆరోహి రావు రెమ్యునరేషన్.. మొత్తం 4 వారాలకు ఎంతోచ్చిందంటే?
బిగ్ బాస్ లో ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. పెద్దగా స్టార్ హోదా ఉన్న వారిని తీసుకురాలేకపోయారని హౌస్ లో అనవసరం అనేవారే ఉన్నారు అన్నట్లుగా కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా మీమ్స్ సైతం వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఎలిమినేషన్ లో కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆరోహి రావు ఎలిమినేట్ కావడం కూడా పెద్దగా ఎవరికి నచ్చడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఆరోహి రావు ఉన్న నాలుగు వారాలకు మంచి గుర్తింపు అయితే అందుకుంది. ఇక ఆమెకు బిగ్ బాస్ ద్వారా ఎంత రెమ్యునరేషన్ అందింది అనే వివరాల్లోకి వెళితే..

ఆరోహి కూడా..
బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న చాలా మంది ఇండస్ట్రీలో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంటున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయిన వారు కూడా ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే అదే తరహాలో మంచి గుర్తింపు అందుకోవాలి అని ఈసారి చాలామంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. అందులో ఆరోహి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

పొరపాట్లు చేయడంతో..
ఆరోహి రావ్ అసలు ఇప్పట్లో వెళ్ళిపోదు అని కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. గతవారం ఆమె ఎలిమినేషన్లో ఊహించిన విధంగా చూపించిన పోటీ తత్వం కూడా చాలా మందిని ఆకట్టుకుంది. అంతేకాకుండా ఓట్లు కూడా బాగానే పెరిగాయి. అయితే ఈసారి మాత్రం ఆరోహి చేసిన కొన్ని పొరపాట్లు ఆమెకు ఓట్లు తగ్గేలా చేసాయి. ఇక చివరికి నాలుగో వారం ఆరోహి రావు బయటకు రావాల్సి వచ్చింది.

ఆమె కంటే తక్కువ ఓట్లు
ఒక విధంగా ఆరోహి ఎలిమినేట్ కావడం సంగతి పక్కన పెడితే ఆమె కంటే తక్కువ స్థాయిలో ఇంట్లో అనవసరంగా అనుకున్న వారు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది అని ఆరోహి కంటే ఎలిమినేట్ కావలసిన వాళ్లు మరొకరు ఉన్నారు అని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆరోహి రావు కంటే తక్కువ ఓట్లు అందుకున్న సుదీపను ఎందుకు ఇంకా హౌస్ లో ఉంచుతున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

వారానికి ఎంతంటే?
ఏదేమైనప్పటికీ ఆరోహి ఉన్నన్ని రోజులు కూడా చాలా హడావిడిగానే కనిపించే టాస్కులలో కూడా చాలా చలాకీగా పరిగెత్తింది. ఇక ఆమె ఉన్న నాలుగు వారాలకు ఎంత రెమ్యునరేషన్ దక్కించుకుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఆరోహి ఒక వారం రోజులకు 15వేల రూపాయల పారితోషికం తీసుకునే విధంగా డీల్ అయితే మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తం రెమ్యునరేషన్
ఇక మొత్తంగా ఆరోహి 4 వారాలకు ఎంత తీసుకుంది అనేది క్లారిటీ వచ్చే ఉంటుంది. దాదాపు 60 వేల వరకు ఆమెకు మొత్తం రెమ్యునరేషన్ బిగ్ బాస్ నుంచి వచ్చినట్లు సమాచారం. బిగ్ బాస్ ద్వారా సోషల్ మీడియాలో కొంత పాజిటివ్ ఫ్యాన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న ఆరోహి ఆ తర్వాత టెలివిజన్ ప్రపంచంలో అలాగే సినిమా ప్రపంచంలో కూడా బిజీగా మారాలని అనుకుంటుంది. మరి ఈ క్రేజ్ తో ఆమె భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు సాదిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











