twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: రేవంత్ తో 'పప్పు' గొడవ.. ఉన్నది తిన్లేవా?.. అతనికే టైటిల్ ఫిక్సా? నవ్వండి బ్రో

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మంచి జోరుగా సాగుతోంది. అరుపులు, గొడవలు, వాగ్వాదాలు, ప్రేమయణాలు, ఓవరాక్షన్ లతో సెప్టెంబర్ 28 బుధవారం నాడు ప్రసారమైన 24వ రోజు 25వ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ప్రతి సీజన్ లో జరిగే హోటల్ టాస్క్ ఈ సీజన్ లోనూ సాగింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు జరగనివి జరగడం మాములే. సైలెంట్ గా కామ్ గోయింగ్ పర్సన్ కోపంతో ఊగిపోవచ్చు.. ఎప్పుడూ చిటపటలాడే కంటెస్టెంట్స్ సైలెంట్ గా ఉండిపోవచ్చు. ఇలానే తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో సింగర్ రేవంత్ పై బాలాదిత్య ఫైర్ అయ్యాడు. పప్పు తినే విషయంలో రేవంత్ ప్రవర్తనపై బాలాదిత్య మండిపడ్డాడు. ఆ వివరాళ్లోకి వెళితే..

    వారిపై తిరిగే విధంగా ప్రయత్నాలు..

    వారిపై తిరిగే విధంగా ప్రయత్నాలు..

    బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో హోటల్ టాస్క్ మొదలైన తరువాత కంటెస్టెంట్స్ మధ్యలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది చాలా కామెడీగా తీసుకుంటే మరి కొంతమంది సీరియస్ గా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎవరికి వారు కెమెరాలు అన్నీ కూడా వారిపై తిరిగే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు కూడా మామూలుగా లేవు.

     కాపలాగా రేవంత్..

    కాపలాగా రేవంత్..

    ఇక హోటల్ టాస్క్ లో బీబీ హోటల్ మేనేజర్ సుదీప, గ్లామ్ పారడైజ్ హోటల్ మేనేజర్ ఫైమా మధ్య మంచి గొడవే జరిగింది. వాష్ రూమ్ ఉపయోగించుకునే డీల్ కు సంబంధించి ఇద్దరి మధ్య వార్ నెలకొంది. ఆ తర్వాత ఏకాభిప్రాయంతో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అందుకు గ్రూపుగా సమావేశమై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే వాష్ రూమ్ కు ఎవరు వెళ్లకుండా డోర్ వేసుకుని కాపలాగా రేవంత్ ఉన్నాడు.

    వాళ్లు చెప్పినట్లు చేయాలి..

    వాళ్లు చెప్పినట్లు చేయాలి..

    అప్పుడు గెస్ట్ గా ఉన్న ఆది రెడ్డి వచ్చి బాత్ రూమ్ కి వెళ్తా అని అడిగితే .. లేదు బ్రో.. మా వాళ్లు మీటింగ్ పెట్టారు. వాళ్లు చెప్పినట్లు చేయాలి. ఇక్కడ వచ్చేది రూపాయి లేదు. ఎవరికీ వాళ్లు వాళ్ల ఫేవరేట్ మనుషులను కాపాడుకుంటున్నారు. కాబట్టి, అది ఎలాగు తేలదు కానీ.. వాళ్లు చెప్పింది చేస్తే కనీసం రూ. వందో రెండొందలో ఇస్తారు అని రేవంత్ చెబుతాడు. ఇంతలో వచ్చిన మరో గెస్ట్ రోహిత్.. బాత్రూమ్ వద్ద ఉన్న రేవంత్ ను చూసి నవ్వుతాడు.

    ఎవరెంత నవ్వుతారో నవ్వండి..

    ఎవరెంత నవ్వుతారో నవ్వండి..

    అది చూసి ఆది రెడ్డి కూడా గట్టిగా నవ్వుతాడు. ఇది చూసిన రేవంత్ ''నవ్వండి బ్రో.. ఎవరెంత నవ్వుతారో నవ్వండి.. రేపటి రోజున బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ ను నేను ఇలా పట్టుకున్నప్పుడు మీ నవ్వులు ఏమవుతాయో చూస్తాను'' అని అంటాడు. రేవంత్ మాటలు, కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతనికే టైటిల్ ను ముందే ఫిక్స్ చేసుకున్నారేమో అని డౌట్ వస్తుంది. అలాగే బిగ్ బాస్ హౌజ్ రావడానికి ముందు కూడా సోషల్ మీడియా వేదికగా టైటిల్ కొడతానని చాలా గట్టిగా చెబుతూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

    బాలాదిత్య ఫైర్..

    బాలాదిత్య ఫైర్..

    ఇక టైటిల్ ఫిక్స్ విషయంలో ఎంత నిజముందో తెలియదు గానీ రేవంత్ మాత్రం చాలా గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రేవంత్ పప్పు ఎక్కువ వేసుకుని తినడంపై బాలాదిత్య ఫైర్ అయ్యాడు. ఇంతేనా ఇంతేనా అని ఎన్నిసార్లు.. అంటూ మెరీనాకు చెబుతుంటే నేను ఇప్పుడు ఏమనట్లేదుగా బ్రో అంటూ అన్నం తిన్నాడు రేవంత్. ఇలానే బాధపడతావా అని బాలాదిత్య అంటే అవును సమాధానమిస్తాడు రేవంత్.

    ఇంతే ఉంది బ్రో..

    ఇంతే ఉంది బ్రో..

    ఆ తర్వాత ఈ విషయం గురించి సుదీప, చంటికి చెబుతాడు బాలాదిత్య. ''రేవంత్ కు పప్పు మూడు సార్లు వేశాను. వేసిన ప్రతిసారి.. ఇంతే ఉంది బ్రో.. ఇంతే ఉంది బ్రో.. అన్నాడు. నాకు మండిపోయింది. ఎన్నిసార్లు అంటాడు. ఉన్నది తినలేడా. నేను రాత్రి ఆ పప్పు కూడా తినలేదు. అసలు పప్పు ఉన్నట్లు నాకు రిజిస్టర్ కూడా కాలేదు'' అని కోపంతో చెప్పాడు బాలాదిత్య.

    English summary
    Hero Baladitya Fires on Singer Revanth And Is Bigg Boss Telugu 6 Season Title Fixed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X