Bigg Boss Telugu 6:హౌజ్ లో అతను సిగరెట్లు తాగకూడదు.. ఇంటి సభ్యుల కోసమా? ఆమె శాడిజమా?
బిగ్ బాస్ ఈసారి తెలివిగా మొదలుపెట్టిన బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ అయితే ఒకరు తప్పు చేసిన ఇతర సభ్యులపై మొత్తం ప్రభావం చూపుతోంది. అందుకే అందరూ కూడా చాలా తెలివిగా గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ విధమైన టాస్క్ తో భవిష్యత్తులో మరింత గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి టాలెంట్ చూపించేందుకు బిగ్ బాస్ ముందు ఎత్తు వేస్తున్నారు. ఇక బుధవారం అక్టోబర్ 12 నాడు ప్రసారమైన 38వ రోజు 39వ ఎపిసోడ్ లో ఒకరు తీసుకుని, అందరిచేత ఒప్పించిన నిర్ణయంతో మరొక కంటెస్టెంట్ హౌజ్ లో సిగరెట్స్ తాగకుండా చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కుటుంబాలతో కలిపే టాస్క్..
బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 12న కూడా తమ కుటుంబాలతో కలిపే టాస్క్ ను కొనసాగించాడు బిగ్ బాస్. ఎపిసోడ్ ప్రారంభంకాగానే బ్యాటరీ ఛార్జింగ 5 శాతమే ఉంది. దీంతో గీతా రాయల్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. లోపలికి వెళ్లిన గీతూ రాయల్ తో బ్యాటరీ రిఛార్జ్ చేసుకోవాలంటే ఇంటి సభ్యులంతా చక్కెర తినకూడదని, లేదా బాలాదిత్య స్మోకింగ్ మానేస్తే ఇంటి బ్యాటరీ 90 శాతం పెరుగుతుందని చెప్పాడు.

బ్యాటరీ రిఛార్జ్ కావాలంటే..
గీతూ బయటకు వచ్చి బిగ్ బాస్ చెప్పినట్టు కాకుండా వేరేగా చెబుతుంది. బ్యాటరీ రిఛార్జ్ కావాలంటే ఇంటి సభ్యులంతా ఫుడ్ అంటే చక్కెర, ఉప్పు తదితర సామాగ్రి అంతా స్టోర్ రూమ్ లో పెట్టేయాలి అని చెబుతుంది. అలాగే ఇంకో ఆప్షన్.. నా ఫేవరేట్.. బాలాదిత్య అన్న స్మోకింగ్ మానేస్తే ఇంటి బ్యాటరీ 90 శాతం పెరుగుతుందని బిగ్ బాస్ చెప్పాడు అని చెబుతుంది గీతూ రాయల్. అయితే చక్కెర విషయం చెప్పకుండా స్మోకింగ్ మాన్పిస్తా అని బిగ్ బాస్ కు ముదే చెబుతుంది గీతూ రాయల్. అయినా బిగ్ బాస్ కల్పించుకోకపోవడం గీతూ రాయల్ కు బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక గీతూ రాయల్ అలా చెప్పడంతో స్మోకింగ్ త్యాగం చేస్తాడు. దీంతో బ్యాటరీ ఛార్జ్ 90 శాతం పెరుగుతుంది.

గీతూపై బాలాదిత్య అసహనం..
అయితే ఇదే సిగరేట్ మానాలి అనే విషయాన్ని ముందే నాకు ప్రైవేట్ గా వచ్చి చెప్పుంటే బాగుండేది అని గీతూతో బాలాదిత్య అసహనం వ్యక్తం చేస్తాడు. దీనికి గీతూ.. ఇంటి సభ్యుల అందరిముందు నిర్ణయం తీసుకోమ్మని బిగ్ బాస్ చెప్పాడని కవర్ చేస్తుంది. అయినా ఒక్క మాట చెప్పుంటే బాగుండేది అని చెప్పి వెళ్లిపోతాడు బాలాదిత్య. ఫుడ్ మొత్తం కాదు చక్కెర మాత్రమే త్యాగం చేయాలని బిగ్ బాస్ చెప్పాడని ఆదిరెడ్డితో చెబుతుంది గీతూ రాయల్.

బాలాదిత్య మీద కోపంతోనో..
ఇక బాలాదిత్య స్మోకింగ్ మాన్పించడం ఇంటి సభ్యుల కోసమో (చక్కెర అందరికీ అవసరం పడుతుంది) లేదా బాలాదిత్య మీద కోపంతోనో (బాలాదిత్య నామినేట్ చేయడం, సుదీపతో ఎక్కువ అటాచ్ మెంట్ తో ఉండటం) ఇలా శాడిజం చూపిస్తుందో తెలియదు. కానీ శనివారం రోజున మాత్రం కన్ఫెషన్ రూమ్ లో గీతూ రాయల్ మాట్లాడిన వీడియో ప్లే చేస్తే మాత్రం మరింతగా గొడవలు జరిగే అవకాశం అయితే లేకపోలేదు.

తనదైన శైలిలో కామెడీ..
ఇక తర్వాత గీతూ రాయల్ కి ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళిపోతే బేజర్ గా ఉంది గీతూ అంటూ వాళ్ళ ఫాదర్ కాల్ చేసి చెప్పాడు. ఇక గీతూ తనదైన శైలిలో అక్కడ కామెడీ చేసింది. ఫోన్ కట్ అయినా కూడా అదే తరహాలో మాట్లాడింది. బిగ్ బాస్ ను కూడా బుద్ధి పడేస్తాను అంటూ తన మాటలతో హైలైట్ అయ్యేలా చేసింది. కట్ అయినా కూడా షో చేసింది అంటూ ఆది రెడ్డి వెంటనే ఆమె గాలి తీసేశాడు.

నాకు ముందు ఎందుకు చెప్పలేదు బిగ్ బాస్..
ఇదిలా ఉంటే శ్రీహాన్ చాలా బాధపడుతూ కనిపించాడు. బ్యాటరీ రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు నాకు ముందు ఎందుకు చెప్పలేదు బిగ్ బాస్ అని ఆవేదనగా మాట్లాడాడు. అయినా అందరిముందు మాత్రం నవ్వుతూనే కనిపించాడు. ఇక మరోసారి బ్యాటరీ ఛార్జ్ 5 శాతానికి పడిపోతే.. ఫైమాకు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తెలుగు సినిమా స్టోరీలను ఇంగ్లీషులో ఆమె చెబితే మిగతా హౌజ్ మేట్స్ అది ఏ సినిమానో కనిపెట్టాలి. ఇందులో ఫైమా మంచి పర్ఫామెన్స్ ఇవ్వడంతో అందరూ కరెక్ట్ గా తెలుగు సినిమా టైటిల్స్ ను చెబుతారు. దీంతో బ్యాటరీ ఛార్జ్ శాతం 80కి పెరిగింది.


Click it and Unblock the Notifications











