twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: ఇంటి సభ్యులకు నోరు తిరగని డైలాగ్ లు.. హైలెట్ గా రేవంత్-ఆదిరెడ్డి డ్యాన్స్

    |

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పూర్తి కావడానికి ఇంకో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలేను ఎంతో ఘనంగా నిర్వహించి ఈ సీజన్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ఈ సీజన్ ఫినాలే సందడి దానికంటే ఒక్కరోజు ముందే మొదలైంది. బిగ్ బాస్ హౌజ్ లోకి గత సీజన్ లోని కంటెస్టెంట్స్ వచ్చి ఇంటి సభ్యులను ఎంటర్టైన్ చేయడంతోపాటు కాస్తా టెన్షన్ పెడతారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మిగిలి ఉన్న ఇంటి సభ్యులను ఎంటరైటైన్ చేసేందుకు గత సీజన్ కంటెస్టెంట్స్, బీబీ జోడి డ్యాన్స్ షో జంటలు ఎంట్రీ ఇచ్చాయి. వాళ్లు ఏం చేశారనే వివరాల్లోకి వెళితే..

     ఇతర భాషల్లోకి సైతం..

    ఇతర భాషల్లోకి సైతం..

    బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ రియాలిటీ షో వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఇంకొక్క రోజులో పూర్తి కానుంది.

    బీబీ జోడీ జంటల ఎంట్రీ

    బీబీ జోడీ జంటల ఎంట్రీ

    బిగ్ బాస్ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు ఇంటి సభ్యులను ఫినాలే వారంలోకి పంపించారు. అయితే, వీళ్లలో ఇటీవల శ్రీసత్య ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడింది. ప్రస్తుతం హౌజ్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఐదుగురు ఉన్నారు. వీరిని ఎంటర్టైన్ చేసేందుకు బీబీ జోడీలో పాల్గొంటున్న జంటలు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు. డిసెంబర్ 17 శనివారం నాటి 104వ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

     రెండోసారి చెప్పలేకపోయిన రోహిత్..

    రెండోసారి చెప్పలేకపోయిన రోహిత్..

    బిగ్ బాస్ హౌజ్ లోకి రవికృష్ణ, భానుశ్రీ ఎంట్రీ ఇచ్చారు. హౌజ్ మేట్స్ తో కలిసి డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు స్టెప్పులు వేశారు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జొన్నాడు అని కంటిన్యూగా చెప్పాలని భానుశ్రీ చెప్పింది. ఈ లైన్ ను రోహిత్ ట్రై చేశాడు. మొదటిసారి బాగానే చెప్పినా రెండో సారి సరిగ్గా చెప్పలేకపోయాడు. దీంతో హౌజ్ మేట్స్ అంతా నవ్వారు. తర్వా ఆరు ఎర్ర లారీలు, నాలుగు నల్ల లారీలు అని చెప్పాల్సిందిగా కీర్తితో అంది భానుశ్రీ.

     మ్యాజిక్ చేసేలా ఉందంటూ..

    మ్యాజిక్ చేసేలా ఉందంటూ..

    కీర్తికి ఆ లైన్ చెప్పరాలేదు. నీకు పనిష్ మెంట్ లా లేదు ఇది.. మాకు పనిష్ మెంట్ లా ఉందని భానుశ్రీ, రవికృష్ణ అన్నారు. తర్వాత ఆర్జే చైతూ, ఆర్జే కాజల్ జంటగా దర్శనమిచ్చారు. బీబీ డ్యాన్స్ షో అంటూ ఒక రోల్ చేసే రిబ్బన్ లాంటిది చూపించాడు ఆర్జే చైతూ. ఇది ఎలా ఉందో తెలుసా.. మ్యాజిక్ చేసేలా ఉందని రేవంత్ అన్నాడు. దాన్ని పట్టుకుని రోహిత్ తన చుట్టూ తిప్పుతూ బాగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు.

    ఆదిరెడ్డి-రేవంత్ డ్యాన్స్..

    ఆదిరెడ్డి-రేవంత్ డ్యాన్స్..

    ఇది డ్యాన్స్ ప్రాపర్టీ అని ఆర్జే కాజల్ ఒక స్టిక్ ను చూపిస్తే.. ఆదిరెడ్డితో ఇది మీకే అని రోహిత్ అందరినీ నవ్వించాడు. నడుముపై పెట్టుకుని రేవంత్ అండ్ ఆదిరెడ్డి కలిసి డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ తర్వాత అఖిల్ సార్థక్, తేజస్విని మదివాడ సందడి చేశారు. అఖిల్ సార్థక్ ఒక పిక్ చూపిస్తే.. అందులో ఏముందో దాన్ని తీసుకొచ్చి చూపించాలి. ఆ ఫొటోలో ఫ్లవర్ వాజ్ ఉన్నట్లు కనిపించింది.

    సందడిగా బిగ్ బాస్ హౌజ్

    ఫొటోలో ఉన్న ఫ్లవర్ వాజ్ ను వెంటనే వెళ్లి శ్రీహాన్ వాష్ రూమ్ నుంచి తీసుకొచ్చాడు. నాకు దొరికింది.. వాష్ రూమ్ కింగ్ ఇక్కడ అంటూ శ్రీహాన్ కామెడీ చేశాడు. బుల్లెటు సాంగ్ కి హౌజ్ మేట్స్ తో డ్యాన్స్ చేయించారు అఖిల్ సార్థక్ అండ్ తేజస్విని. ఇలా బీబీ జోడి జంటలైన గత సీజన్స్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 6 హౌజ్ సందడిగా మారింది.

    English summary
    BB Jodi Dance Show Contestants Into The Bigg Boss Telugu 6 House And Making Fun With Contestants December Day 104 Promo 2 Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X