Bigg Boss Telugu 6: రేవంత్ కు పోటీగా ఇప్పుడు అతనొక్కడే.. శ్రిహాన్ కంటే దూకుడుగా..
బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతుంటాయి. ఇక మొదటి వారంలోనే వెళ్ళిపోతారు అనుకున్న కొందరు ఊహించిన విధంగా టాప్ 5 లో కూడా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో కూడా అలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు అయితే టాప్ కంటెస్టెంట్ గా సింగర్ రేవంత్ కొనసాగుతున్నాడు. అతనికి పోటీగా ఒక నలుగురు పేర్లు వినిపించాయి. అయితే అందులో పెద్దగా సెలబ్రిటీ హోదా లేని కంటెస్టెంట్ ఇప్పుడు పోటీగా నిలిచేందుకు రెడీ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

బిగ్ బాస్ షాక్
బగ్ బాస్ 6వ సీజన్ చాలా నీరసంగా కొనసాగుతోంది అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. మొదట్లో రేటింగ్స్ తక్కువగా రావడంతో కూడా నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక నాగార్జున అయితే రెండవ వారం నుంచి కంటెస్టెంట్స్ అందరిని కూడా అలెర్ట్ అయ్యేలా చేశాడు. దీంతో అప్పటినుంచి కూడా అందరూ సీరియస్ గానే గేమ్ ఆడుతున్నారు. ఇక మొదటివారం ఎలిమినేషన్ లేకపోయినా రెండో వారం డబుల్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఝలక్ ఇచ్చి అందరిని అలెర్ట్ అయ్యేలా చేశాడు.

అనవసరమైన వివాదాలతో
ఒకసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కువ రోజులు ఉండాలి అని కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా టాస్కులలో ఆడితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. అయితే కొందరు అదే తరహాలో గేమ్ ఆడుతున్నప్పటికీ మరికొందరు మాత్రం అనవసరమైన వివాదాలతో నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నారు. ఇక గీతూ చాలా గట్టిగానే గేమ్ ఆడింది కానీ ఆ తర్వాత ఆమె నోటి దురుసు కారణంగా మెల్లగా ఓట్లు కోల్పోతుంది.

శ్రీహాన్ ఉన్నప్పటికీ
మొదటివారం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా సింగర్ రేవంత్ ఓట్లు అయితే భారీగానే పెరుగుతున్నాయి. అతను ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారి కూడా అత్యధిక ఓట్ల అందుకున్న కంటెస్టెంట్ గా ఉంటున్నాడు. ఇక అతనికి పోటీగా అయితే శ్రీహాన్ కొనసాగుతూ వచ్చాడు. మధ్యలో గీతూ రాయల్ పోటీ ఇచ్చినప్పటికీ ఆమె అతిగా మాట్లాడడం వలన తన హోదాను కోల్పోయి తక్కువ స్థాయిలో అయితే ఓట్లు అందుకుంటున్నాడు.

ఛాన్స్ వస్తే..
ఇక ఇప్పుడు ఉన్నవారిలో సింగర్ రేవంత్ కు బలమైన పోటీ ఇచ్చే వారిలో ఎక్కువగా అయితే శ్రీహన్ అని చెబుతున్నారు. కానీ శ్రీహన్ మాత్రం కొన్నిసార్లు ఎక్కువ స్థాయిలో గొడవ పడకుండా చాలా సున్నితంగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆదిరెడ్డి మాత్రం అలా కాదు ఛాన్స్ వస్తే దూసుకుపోతున్నాడు ఎవరిని కూడా లెక్క చేయకుండా గేమ్లో తన బలాన్ని చూపిస్తున్నాడు.

చివరి వరకు పోటీ ఇస్తాడా?
ఇక సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా ఆదిరెడ్డికి సంబంధించిన విషయాల వైరల్ గా మారుతున్నాయి. తప్పకుండా టాప్ కంటెస్టెంట్స్ లో ఒకటిగా నిలుస్తారు అని చెబుతున్నారు. ముఖ్యంగా సింగర్ రేవంత్ కు అతను పోటీగా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని కేవలం యూట్యూబ్లో రివ్యూలు చెప్పుకొని ఇక్కడి వరకు వచ్చిన ఆది ఇప్పుడు ఏకంగా నెంబర్ వన్ స్థానానికి ఎసరు పెట్టినట్లుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఆదిరెడ్డి ఊహించినట్లే రేవంత్ కు చివరి వరకు పోటీ ఇస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











