Bigg Boss Telugu 6: విన్నర్ విషయంలో మరో లీక్.. అతన్ని గెలిపించాలని బిగ్ బాస్ ప్లాన్?
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే విషయంలో అయితే ఇప్పటికే జనాల్లో ఒక క్లారిటీ అయితే ఉంది. అయితే వారం వారం కూడా విన్నర్ ఎవరు అనే విషయంలో మరికొన్ని కొత్త తరహా రూమర్స్ అయితే ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచేందుకు మొత్తంగా ఏడుగురు పోటీలో ఉన్నారు. వారిలో ఎవరైనా విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని టామ్ వస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ పై ఈసారి తనపై ఒక నింద పడకుండా ఉండాలి అని ఒక కంటెస్టెంట్ ను గెలిపించే అవకాశం ఉందని కూడా మరొక కొత్త లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలలోకి వెళితే..

మరో ఆలోచనలతో
బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి చూసుకుంటే కూడా విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే విషయంలో జనాల్లో ఒక టాక్ బలంగా ఉంది. అతనే రేవంత్ అని బలంగా చెబుతున్నారు. ఎంత సీక్రెట్ గా ఉన్నప్పటికీ కూడా జనాలు అయితే తదుపరి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా ముందే ఊహిస్తున్నారు. అలాగే ఈసారి విన్నర్ రేవంత్ ఫిక్స్ అయినట్లుగా కూడా మరి కొంతమంది బలంగా కామెంట్ చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం మరో ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది.

అమ్మాయిల పరిస్థితేంటి?
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు మొత్తంగా 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఎప్పటి నుంచో వస్తున్న నినాదం ప్రకారం ఈసారి అమ్మాయిలు టైటిల్ అందుకోవాలని ఓవర్గం వారు కోరుకుంటున్నారు. అమ్మాయిలకు న్యాయం జరగడం లేదు అనే విధంగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమ్మాయిలలో కీర్తి ఇనయా సుల్తానా శ్రీ సత్య ముగ్గురు కూడా అనుకున్నంత స్థాయిలో అయితే హౌస్ లో మెప్పించడం లేదు. ఇనయా రావచ్చని ఓ వర్గం వారి నుంచి కాస్త ఎక్కువగా సపోర్ట్ అయితే వస్తోంది.

టాప్ లో ఆ ఇద్దరు?
ఇక మిగిలిన నలుగురు అబ్బాయిలలో రేవంత్ మొదట స్థానంలో ఉండగా ఆ తర్వాత శ్రీహన్ ప్రతిసారి అత్యధిక స్థాయిలో జనాల నుంచి ఓట్లు అయితే అందుకుంటున్నాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు అని ఇప్పటికే చాలా సర్వేల ద్వారా చెబుతున్నారు. రేవంత్ పై ఎంతగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయో అదే తరహాలో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక శ్రీహన్ అయితే ఏ మాట మాట్లాడినా కూడా నటించినట్లుగానే ఉందనే విధంగా నెగిటివ్ ట్రోలింగ్ కూడా వస్తోంది.

ఫైనల్ లో అతను వస్తే..
ఇక అబ్బాయిలలో మరొక కంటెస్టెంట్ రోహిత్ కూడా టాప్ 5లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు అనే చెప్పాలి. మొదట్లో జనాల నుంచి అతనికి పెద్దగా సపోర్ట్ అయితే దొరకలేదు. కానీ కాలం గడిచిన తర్వాత అతనికి మెల్లగా సపోర్ట్ అయితే దొరికింది. ఇక ప్రస్తుతం అతను ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో నిలవాలని అనుకుంటున్నాడు. ఒకవేళ అతను ఫైనల్ లోకి వస్తే గట్టి పోటీని ఇస్తాడు అని కూడా అనిపిస్తోంది.
ఆదిరెడ్డిని గెలిపించాలని..?
అయితే ఎప్పటినుంచో ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే అర్హత లేదా అనే విధంగా కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈసారి ఆ దాదాపు ఆ కేటగిరీలో వచ్చిన ఆదిరెడ్డి బిగ్ బాస్ టైటిల్ అందుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ తనపై నిందలు పడకుండా ఉండాలి అంటే ఆదిరెడ్డికి టైటిల్ను అందించి తన స్థాయిని పెంచుకోవాలి అనే ఆలోచనతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిరెడ్డి గెలిస్తే కనుక సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్నవారు బిగ్బాస్ హౌస్లో గెలవచ్చు అని ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వవచ్చు అనే తరహాలో బిగ్ బాస్ ఆలోచిస్తున్నట్లుగా కూడా ఒక టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే బిగ్ బాస్ ఫైనల్స్ వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











