Bigg Boss Telugu 6: నాగార్జునకు బిగ్ బాస్ ఆఫర్.. షోకే అన్ని కోట్లు.. రెంట్‌తో కలిపి ఎంతంటే!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే దానికీ అందనంత స్పందనను కూడగట్టుకుని ఐదారేళ్లుగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అస్సలు అంచనాలు లేకుండానే మన భాషలోకి పరిచయం అయిన దీనికి.. తెలుగు ప్రేక్షకులు ఆదరణను అందించారు. ఫలితంగా ఈ షో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌కు చేరింది.

ఇక, ఈ షో విజయంలో హోస్టుగా చేసిన స్టార్ హీరోల పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా మూడు, నాలుగు, ఐదు సీజన్లకు భారీ రేటింగ్ వచ్చేలా చేసి.. ఇప్పుడు ఆరో దాన్ని కూడా హోస్ట్ చేయబోతున్నాడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ నేపథ్యంలో ఆయనకు బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూరేషన్‌ చెల్లిస్తున్నారు అన్న వివరాలపై లుక్కేద్దాం పదండి!

ఐదు సీజన్లు.. ముగ్గురు స్టార్లు

ఐదు సీజన్లు.. ముగ్గురు స్టార్లు

తెలుగులో బిగ్ బాస్ షో ఐదు సీజన్లను ఎవరూ ఊహించని విధంగా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ఇంతలా సక్సెస్ అయిందంటే దానికి హోస్టులు కూడా కారణమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని, మూడు, నాలుగు, ఐదు సీజన్లను సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు.

నాగార్జున ఎంట్రీతో మారింది

నాగార్జున ఎంట్రీతో మారింది

బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్టుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి షో రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఆయన నడిపించిన మూడు, నాలుగు, ఐదు సీజన్లు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్‌ను సాధించాయి. ఫలితంగా తెలుగు బిగ్ బాస్ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో ఆయననే నిర్వహకులు కంటిన్యూ చేస్తున్నారు.

 కంటెస్టెంట్లను దారిలో పెట్టి

కంటెస్టెంట్లను దారిలో పెట్టి

మూడో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి రికార్డుల మీద దండయాత్ర చేసిన అక్కినేని నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్‌లను ఎంతో స్పెషల్‌గా మార్చాడు. మంచిగా ఆడితే ప్రోత్సహించి అభినందించడం.. ఏదైనా తప్పులు చేస్తే కంటెస్టెంట్లను మందలించడం వంటివి చేసి మెప్పించాడు. ఇలా మొన్న ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వరకూ తన హోస్టింగ్‌తో మెప్పించాడు.

 ఆరో సీజన్‌కు ఈ స్టార్ హీరోనే

ఆరో సీజన్‌కు ఈ స్టార్ హీరోనే

బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఆరో సీజన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన పనులను కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఇక, ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కమింగ్ సూన్ ప్రోమో ద్వారానే నిర్వహకులు వెల్లడించారు.

నాగార్జున రెమ్యూనరేషన్ లీక్

నాగార్జున రెమ్యూనరేషన్ లీక్

అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్‌కు హోస్ట్ అక్కినేని నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. దీనికోసం ఆయనకు బిగ్ బాస్ నిర్వహకులు భారీ మొత్తాన్నే చెల్లిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ టెలివిజన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఆరో సీజన్‌ కోసం అన్ని కోట్లు

ఆరో సీజన్‌ కోసం అన్ని కోట్లు

విశ్వసనీయంగా అందుతోన్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం అక్కినేని నాగార్జున రూ. 11 - 12 కోట్లు తీసుకుంటున్నాడట. ఇది అతడి షో జర్నీలోనే అత్యధిక మొత్తం అని తెలిసింది. మూడో సీజన్ కేవలం రూ. 3.50 కోట్లు మాత్రమే తీసుకున్న నాగ్.. ఆ తర్వాత రూ. 6 కోట్లు, రూ. 8 కోట్లు తీసుకున్నాడట. నాన్ స్టాప్ సీజన్‌కు రూ. 7 కోట్లు చార్జ్ చేశాడని తెలిసింది.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
స్టూడియో రెంట్‌తో కలిపితే

స్టూడియో రెంట్‌తో కలిపితే

ఆరో సీజన్‌కు రూ. 12 కోట్లు తీసుకోవడం ద్వారా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అక్కినేని నాగార్జున అరుదైన రికార్డును క్రియేట్ చేయబోతున్నాడట. ఇక, ఈ రెమ్యూనరేషన్‌తో పాటు ఆయనకు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బిగ్ బాస్ హౌస్ సెట్‌కు రెంట్ కూడా రాబోతుందట. ఇవన్నీ కలుపుకుంటే నాగార్జునకు ఆరో సీజన్ వల్ల రూ. 15 కోట్ల వరకూ ఆదాయం రాబోతుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X