Don't Miss!
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Lifestyle
మీ జుట్టు ఒత్తుగా లేదా మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? వీటిని ఉపయోగించండి...
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Bigg Boss Telugu 6: నాగార్జునకు బిగ్ బాస్ ఆఫర్.. షోకే అన్ని కోట్లు.. రెంట్‌తో కలిపి ఎంతంటే!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే దానికీ అందనంత స్పందనను కూడగట్టుకుని ఐదారేళ్లుగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అస్సలు అంచనాలు లేకుండానే మన భాషలోకి పరిచయం అయిన దీనికి.. తెలుగు ప్రేక్షకులు ఆదరణను అందించారు. ఫలితంగా ఈ షో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌కు చేరింది.
ఇక, ఈ షో విజయంలో హోస్టుగా చేసిన స్టార్ హీరోల పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా మూడు, నాలుగు, ఐదు సీజన్లకు భారీ రేటింగ్ వచ్చేలా చేసి.. ఇప్పుడు ఆరో దాన్ని కూడా హోస్ట్ చేయబోతున్నాడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ నేపథ్యంలో ఆయనకు బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూరేషన్ చెల్లిస్తున్నారు అన్న వివరాలపై లుక్కేద్దాం పదండి!

ఐదు సీజన్లు.. ముగ్గురు స్టార్లు
తెలుగులో బిగ్ బాస్ షో ఐదు సీజన్లను ఎవరూ ఊహించని విధంగా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ఇంతలా సక్సెస్ అయిందంటే దానికి హోస్టులు కూడా కారణమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని, మూడు, నాలుగు, ఐదు సీజన్లను సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు.
రష్మిక మందన్నా అందాల ఆరబోత: ఇంతకు ముందెన్నడూ చూడనంత హాట్‌గా!

నాగార్జున ఎంట్రీతో మారింది
బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్టుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి షో రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఆయన నడిపించిన మూడు, నాలుగు, ఐదు సీజన్లు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్‌ను సాధించాయి. ఫలితంగా తెలుగు బిగ్ బాస్ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో ఆయననే నిర్వహకులు కంటిన్యూ చేస్తున్నారు.

కంటెస్టెంట్లను దారిలో పెట్టి
మూడో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి రికార్డుల మీద దండయాత్ర చేసిన అక్కినేని నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్లను ఎంతో స్పెషల్‌గా మార్చాడు. మంచిగా ఆడితే ప్రోత్సహించి అభినందించడం.. ఏదైనా తప్పులు చేస్తే కంటెస్టెంట్లను మందలించడం వంటివి చేసి మెప్పించాడు. ఇలా మొన్న ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వరకూ తన హోస్టింగ్‌తో మెప్పించాడు.
బాత్‌టబ్‌లో నగ్నంగా అషు రెడ్డి: స్నానం చేస్తున్న పిక్‌లతో రచ్చ.. ఇలా తెగించిందేంటి!

ఆరో సీజన్‌కు ఈ స్టార్ హీరోనే
బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఆరో సీజన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన పనులను కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఇక, ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కమింగ్ సూన్ ప్రోమో ద్వారానే నిర్వహకులు వెల్లడించారు.

నాగార్జున రెమ్యూనరేషన్ లీక్
అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్‌కు హోస్ట్ అక్కినేని నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. దీనికోసం ఆయనకు బిగ్ బాస్ నిర్వహకులు భారీ మొత్తాన్నే చెల్లిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ టెలివిజన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Meena Husband Vidyasagar: మీనా భర్త మృతికి ఆ పక్షులే కారణం.. హైదరాబాద్‌లోనూ డేంజర్ బెల్స్

ఆరో సీజన్ కోసం అన్ని కోట్లు
విశ్వసనీయంగా అందుతోన్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం అక్కినేని నాగార్జున రూ. 11 - 12 కోట్లు తీసుకుంటున్నాడట. ఇది అతడి షో జర్నీలోనే అత్యధిక మొత్తం అని తెలిసింది. మూడో సీజన్ కేవలం రూ. 3.50 కోట్లు మాత్రమే తీసుకున్న నాగ్.. ఆ తర్వాత రూ. 6 కోట్లు, రూ. 8 కోట్లు తీసుకున్నాడట. నాన్ స్టాప్ సీజన్‌కు రూ. 7 కోట్లు చార్జ్ చేశాడని తెలిసింది.


స్టూడియో రెంట్‌తో కలిపితే
ఆరో సీజన్‌కు రూ. 12 కోట్లు తీసుకోవడం ద్వారా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అక్కినేని నాగార్జున అరుదైన రికార్డును క్రియేట్ చేయబోతున్నాడట. ఇక, ఈ రెమ్యూనరేషన్‌తో పాటు ఆయనకు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బిగ్ బాస్ హౌస్ సెట్‌కు రెంట్ కూడా రాబోతుందట. ఇవన్నీ కలుపుకుంటే నాగార్జునకు ఆరో సీజన్ వల్ల రూ. 15 కోట్ల వరకూ ఆదాయం రాబోతుందని సమాచారం.