For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: అతనికి బిగ్ బాస్ అన్యాయం!.. టాప్ 5లో వాళ్లను ఉంచేందుకేనా?

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికీ ఈ సీజన్ 87 రోజులు 88 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇంకొన్ని వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. అయితే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రేవంత్ తన విపరీతమైన కోపం, మాటలు జారడంతో ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా అతను గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నందున మిగతా ఇంటి సభ్యులు సైతం ఎప్పుడు లేనిది అతని నెగెటివ్స్ ను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ మాత్రం ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కు అన్యాయం చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ షికార్లు చేస్తున్నాయి

  2017లో అనేక అనుమానాల మధ్య..

  2017లో అనేక అనుమానాల మధ్య..

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తొలుత హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమై భారీగా ప్రేక్షకాదరణ పొందింది. ఇలా ఇప్పటికీ ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది

  కంటెస్టెంట్లుగా 21 మంది ఎంట్రీ..

  కంటెస్టెంట్లుగా 21 మంది ఎంట్రీ..

  విపరీతమైన ప్రేక్షకాదరణతో వరుస పెట్టి సీజన్లతో ముందుకు సాగుతున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సెప్టెంబర్ 4న 6వ సీజన్ ను ప్రారంభించారు. ఈ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌‌లు ఇలా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు.

   ప్రస్తుతం 8 మంది ఇంటిసభ్యులు..

  ప్రస్తుతం 8 మంది ఇంటిసభ్యులు..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 12 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. తాజాగా 12వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంచారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్ 13 మంది వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌజ్ లో 8 మంది మిగిలారు.

   నామినేషన్లలో ఆరుగురు..

  నామినేషన్లలో ఆరుగురు..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం మిగిలిన 8 మందికి 13వవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత వాడీ వేడిగా సాగింది. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. దీంతో మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరంత ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నారు. ఇక ఇటీవల వీళ్లకు నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

  డిఫెండ్ చేసుకున్న సీన్లు..

  డిఫెండ్ చేసుకున్న సీన్లు..

  టికెట్ టు ఫినాలే టాస్క్ లో శ్రీసత్య, ఇనయా తొలగిపోగా ఆరుగురి మధ్య పోటీ సాగుతోంది. ఇదిలా ఉంటే ముందు నుంచి కూల్ అండ్ కామ్ గా ఉండి, తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్న రోహిత్ సహ్నికి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఎలా అంటే నామినేషన్లలో కానీ, టాస్క్ ల్లో కానీ రోహిత్ డిఫెండ్ చేసుకునే సీన్లను టెలికాస్ట్ చేయట్లేదని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

   మెరినాకు రోహిత్ విషెస్..

  మెరినాకు రోహిత్ విషెస్..

  రోహిత్ డిఫెండ్ చేసుకునే విషయాలే కాకుండా తన భార్యకు (మెరినా అబ్రహం) మ్యారేజ్ యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్పిన విషయాన్ని కూడా టెలీకాస్ట్ చేయలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నవంబర్ 29న రోహిత్-మెరినాల వెడ్డింగ్ యానివర్సరీ. అయితే ఉదయం మ్యూజిక్ ప్లే చేసిన తర్వాత మెరీనాకు విషెస్ తెలియజేశాడు రోహిత్. అలాగే రేవంత్ కూడా మెరీనా-రోహిత్ లకు విషెస్ చేశాడు. కానీ దానికి సంబంధించిన ఏ వీడియోను ప్లే చేయలేదు బిగ్ బాస్ టీమ్.

  మేనేజ్ మెంట్ కోటాలో వాళ్లకు..

  అయితే బిగ్ బాస్ టీమ్.. రోహిత్ కు ఎక్కువ ఓట్లు పడకుండా ఉండేందుకు, మేనేజ్ మెంట్ కోటాలో వచ్చిన కంటెస్టెంట్స్ ని టాప్ 5లో ఉంచేందుకే అలా చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. రోహిత్ అసలైన ఆట తీరు ప్రేక్షకులు చూస్తే కచ్చితంగా అతనికి ఓట్లు పడే అవకాశం ఉందని బీబీ టీమ్ భయపడుతోందని.. దీంతో తాము మేనేజ్ మెంట్ కోటాలో తెచ్చుకున్న కంటెస్టెంట్స్ టాప్ 5లో ఉండలేరనే అలా చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ కి మేనేజ్ మెంట్ కోటాలో ఎవరు వెళ్లారనేది స్పష్టత రాలేదు.

  English summary
  Bigg Boss Telugu 6 Season Plans To Remove Rohit Sahni For Management Quota Contestants To Top 5 News Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X