Bigg Boss Telugu 6 బిగ్‌బాస్ బిగ్ పనిష్ మెంట్.. అకస్మాత్తుగా కిందపడిపోయిన రేవంత్

ముందుగా హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ షో ఆ తర్వాత వివిధ భాషల్లోకి పాకింది. అందులో భాగంగానే తెలుగులోనూ స్టార్ట్ చేశారు. అయితే ఈ షో మొదలు పెడుతున్నప్పుడు అనేక కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. వాటన్నింటిని దాటుకుని గ్రాండ్ గా ప్రారంభమైంది ఈ షో. అనంతరం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ సీజన్లపై సీజన్లతో ముందుకు వస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో కంటెస్టెంట్ల తీరుపై అక్టోబర్ 18న ప్రసారమైన ఎపిసోడ్ లో బిగ్ బాస్ మండిపడిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్లందరకీ అక్షింతలు చల్లాడు బిగ్ బాస్. అయితే తాజాగా మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటనే వివరాల్లోకి వెళితే..

ఇంటి సభ్యుల నిర్లక్ష్యం

ఇంటి సభ్యుల నిర్లక్ష్యం

బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 18న ప్రసారమైన ఎపిసోడ్ లో ఇంటి సభ్యులపై బిగ్ బాస్ మండిపడిన విషయం తెలిసిందే. అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్ తలంటాడు. ఇంటి సభ్యుల నిర్లక్ష్యం. టాస్క్ ల పట్ల నిర్లక్ష్యం. బిగ్ బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం. మీ నిర్లక్ష్యం బిగ్ బాస్ ను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరాశ పరుస్తున్న కారణంగా కెప్టెన్సీ పోటీ దారులు టాస్క్ రద్దు చేయడం జరిగింది అంటూ బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బయటకు వెళ్లిపోవచ్చు..

బయటకు వెళ్లిపోవచ్చు..

బిగ్ బాస్ కోపంతో అలా అనేసరికి కంటెస్టెంట్స్ అందరు కూడా క్షమాపణలు చెప్పడం స్టార్ట్ చేశారు. ప్రేక్షకుల పట్ల అలాగే ఈ షో పట్ల గౌరవం లేని వారు తక్షణమే ముఖ ద్వారం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు అని ఆదేశాలు వచ్చాయి. అలాగే తక్షణమే వాళ్ల కాస్ట్యూమ్స్ ని కూడా స్టోర్ రూమ్ లో పెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. అంతేకాకుండా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ను కూడా రద్దు చేశాడు బిగ్ బాస్. ఆ తరువాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ కాగా తాజాగా బిగ్ బాస్ మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌజ్ లో దొంగలు..

బిగ్ బాస్ హౌజ్ లో దొంగలు..

అక్టోబర్ 19న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ లో దొంగలు పడినట్లు తెలుస్తోంది. ఇంట్లోని ఆహారం మొత్తం తీసుకెళ్లిపోయే టాస్క్ వచ్చింది. దీంతో ఇంటి సభ్యులు ఆకలితో ఎక్కడా పడితే అక్కడ పడుకుని ఆకలేస్తుంది అని బిగ్ బాస్ తో చెప్పుకోవడం తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. సాపాటు ఎటూ లేదు.. అంటూ రేవంత్ పాటలు పాడాడు. ఆర్జే సూర్య అయితే స్పూన్ కి ఉన్న చక్కెర తీసుకుని తిన్నాడు.

 పోరాడి సంపాదించుకోవాలని..

పోరాడి సంపాదించుకోవాలని..

డబ్బాలో అడుగున ఉన్న ఆహారాన్ని తింటూ గీతూ రాయల్ కనిపించింది. ఈ పనిష్ మెంట్ తీసుకోక తప్పదు అని కీర్తి చెప్పడం, ఆకలేయడం స్టార్ట్ అవుతోంది బిగ్ బాస్ అని వాసంతి చెబుతుంది. కాసేపటి తర్వాత గార్డెన్ లో ఫుడ్ పెట్టారు. అయితే ఆ ఫుడ్ ని పోరాడి సంపాదించుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఇంటి సభ్యుల మధ్య కబడ్డీ పోటీ పెట్టారు. రెండు బృందాలుగా విడిపోయిన ఇంటి సభ్యులు కబడ్డీ ఆడారు.

ప్రతీసారి స్టోర్ రూమ్ కు..

ఈ గేమ్ మధ్యలో రేవంత్ కాలు స్లిప్ అయిన పడిపోయాడు. అయితే రేవంత్ కాలికి తీవ్రమైన నొప్పి రావడంతోనే పడిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఎపిసోడ్ లో రేవంత్ కాలికి గాయం అయిందని నాగార్జునతో గీతూ చెప్పింది. అప్పుడే ప్రతీసారి స్టోర్ రూమ్ కు గీతూ రాయల్ ను పంపి ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు అదే గాయం ఎక్కువైనట్లు అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X