Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Bigg Boss Telugu 6 హౌజ్ లో కూతురిని చూసి మురిసిపోయిన రేవంత్.. యవరాణి అంటూ బాహుబలి స్టైల్ లో!
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఆసక్తికరంగానే సాగుతోంది. ప్రస్తుతం హౌజ్ లో గత నాలుగు రోజులుగా టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. డిఫరెంట్ రౌండ్స్ తో ఈ టాస్క్ కంటిన్యూ అవుతోంది. ఇంటి సభ్యులు ఎవరికీ వారే గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఫినాలే టాస్క్ లో ఫైనల్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా రేవంత్ అండ్ శ్రీహాన్ వెళ్లారు. అయితే చివరిగా ఈ టికెట్ ను శ్రీహాన్ గెలుచుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 3 శనివారం నాటి 90వ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఆరుగురు డిస్ క్వాలిఫై..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో 8 మంది ఉన్నారు. ఇక గత నాలుగు ఎపిసోడ్స్ లలో టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగింది. ఇందులో 8 మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా ఆరుగురు డిస్ క్వాలిఫై అయి తొలగిపోయారు. చివరిగా ఆదిరెడ్డి, శ్రీహాన్ కి టై పడగా మరో గేమ్ పెట్టారు.
ఫినాలేకు తొలి కంటెస్టెంట్ గా..
టైర్ బ్రేక్ గేమ్ లో బెలూన్స్ ఊది తర్వాత సైకిల్ పిడేల్ తొక్కుతూ తమ ముందున్న రింగ్స్ ను వేయాల్సి ఉంటుంది. ఇందులో శ్రీహాన్ గెలిచాడు. దీంతో టికెట్ టు ఫినాలే టాస్క్ లో చివరిగా పాల్గొనే కంటెస్టెంట్స్ గా రేవంత్, శ్రీహాన్ నిలిచారు. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ లో శ్రీహాన్ గెలిచి నేరుగా ఫినాలేకు వెళ్లే మొదటి కంటెస్టెంట్ గా నిలిచినట్లు టాక్ వినిపిస్తోంది.
కన్ఫెషన్ రూమ్ లో రేవంత్..
ఇదిలా ఉంటే ప్రతి శని, ఆదివారాలు హోస్ట్ నాగార్జున వచ్చి ఎంటర్టైన్ తోపాటు రివ్యూస్ కూడా ఇస్తాడన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 3 శనివారం నాటి ఎపిసోడ్ లో కూడా హోస్ట్ నాగార్జున వచ్చారు. వచ్చి రాగానే గురువారం వరకు జరిగింది చూశాం.. శుక్రవారం నాడు జరిగిన విశేషాలు చూద్దామని చెప్పారు నాగార్జున. అలా చెప్పగానే రేవంత్ ను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలవడం చూపించారు.
విజిల్ వేసిన శ్రీహాన్..
బిగ్ బాస్ మీకు (రేవంత్) ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నారు. నిన్న (గురువారం) రాత్రి 11 గంటల 51 నిమిషాలకు మీకు కూతురు జన్మించింది అని బిగ్ బాస్ చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆనందంతో పొంగిపోయాడు రేవంత్. మరోవైపు ఇంటి సభ్యులు అరూస్తూ సంతోషాన్ని తెలియజేశారు. శ్రీహాన్ విజిల్ వేసి మరి తన ఆనందాన్ని చెప్పాడు. బిగ్ బాస్ చరిత్రలోనే చాలా అందమైన వేడుక అని నాగార్జున చెప్పారు.
మీ యువరాణి అంటూ..
తర్వాత బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని చెప్పి రేవంత్ భార్య అన్విత, వాళ్ల పాపను వీడియో కాల్ లో చూపించారు. ఇప్పుడు మీ యువరాణి జూనియర్ రేవంత్ అని ఇలా చూపించు (బాహుబలి స్టైల్ లో) అని సంతోషంతో రేవంత్ అన్నాడు. ఏ నా కూతురు అంటూ ఇంటి సభ్యులు రేవంత్ చెప్పాడు. ఇంటి సభ్యులంతా ఆనందంతో మురిసిపోయారు. తర్వాత తన కూతురని ముద్దాడిన రేవంత్.. సో సారీ ఈ సమయంలో నేను ఉండాలి. కానీ అంతా మంచే జరుగుతుంది అని రేవంత్ ఎమోషనల్ గా చెప్పాడు.
కమ్మనైన పాటతో..
చిట్టి తల్లి అంటూ వీడియోవైపు వెళుతూ లవ్ యూ సో మచ్.. అని రేవంత్ అంటే.. థ్యాంక్యూ డాడీ అంటుంది అని ఆయన భార్య అన్విత చెప్పింది. తర్వాత ఓ అందమైన పాట అలరించాడు రేవంత్. అనంతరం సార్ నేను ఇక్కడే గెలిచాను అంటూ రేవంత్ ఎమోషనల్ గా థ్యాంక్స్ చెప్పాడు.