For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నామినేషన్లలో చలాకి చంటికి బిగ్ బాస్ చురకలు.. శ్రీహాన్ ఓవరాక్షన్

  |

  రేటింగ్ సంగతి ఎలా ఉన్నా జోరుగా దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్. మంచి కంటెంట్ ఇచ్చేందుకు ఇంటి సభ్యులు బాగానే కష్టపడుతున్నారు. అరుపులు, కేకలతో మరోసారి మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు హౌజ్ మేట్స్. మూడో వారం ఎవరూ ఊహించని విధంగా నేహా చౌదరి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక నాలుగో వారం నామినేషన్లను అర్జున్ కల్యాణ్, కీర్తి భట్ లను నేరుగా నామినేట్ చేస్తూ ప్రారంభించాడు బిగ్ బాస్. సోమవారం 22వ రోజు 23వ ఎపిసోడ్ లో ఆ నామినేషన్ల పర్వం కొనసాగింది. ఈ నామినేషన్లలో చలాకి చంటికి బిగ్ బాస్ చురకలు అంటించగా.. శ్రీహాన్ ఓవరాక్షన్ చేశాడు.

  నామినేషన్లలో పది మంది..

  నామినేషన్లలో పది మంది..

  బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. ఈ వారం నామినేషన్లలో బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేసిన అర్జున్ కల్యాణ్, కీర్తి భట్ తో పాటు సుదీప, ఆరోహి, శ్రీహాన్, ఇనయా సుల్తానా, రాజశేఖర్, సూర్య, రేవంత్, గీతూ రాయల్ 10 మంది ఉన్నారు. ఈ నామినేషన్ల ప్రక్రియ మంచి జోరుగానే సాగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరు ఇంటి సభ్యులపై టమాటోలను స్మాష్ చేయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు.

   రేవంత్-కీర్తి భట్ గొడవ..

  రేవంత్-కీర్తి భట్ గొడవ..

  ఈ నామినేషన్లలో భాగంగా సింగర్ రేవంత్ ను కీర్తి భట్ నామినేట్ చేసింది. ఈ క్రమంలో రేవంత్ అండ్ కీర్తి బాగా అరుచుకున్నారు. 'ప్రతి ఒక్కరికీ ప్లాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి గేమ్ పై ఫోకస్ పెట్టాలి' అని రేవంత్ మాట్లుడుతుండగా.. 'బాధ వల్ల బాధ వల్ల అని పదే పదే అంటున్నారు. నా బాధ ఎవరికి ఎఫెక్ట్ అయింది' అంటూ కీర్తి అరిచింది. 'బాధ అనే టాపిక్ తీసుకురాకండి. బాధ ఉంటే ఈ బిగ్ బాస్ హౌజ్ కు వచ్చేదాన్ని కాదు' అంటూ మాట్లాడింది కీర్తి భట్.

  కామెడీ చేయబోయిన చంటి..

  కామెడీ చేయబోయిన చంటి..


  ఇలా రేవంత్ అండ్ కీర్తి ఒకరినొకరు అరుచుకుంటూ ఉండగా చలాకి చంటి కామెడీ చేయబోయాడు. ఇది గమనించిన బిగ్ బాస్ ''చంటి.. మీరు ఇంతకుముందు చేసేందుకు ప్రయత్నించిన కామెడీ.. నామినేషన్లలో కాకుండా మిగతా రోజుల్లో చేస్తే బాగుంటుందని బిగ్ బాస్ అభిప్రాయపడుతున్నారు'' అంటూ చంటికి బిగ్ బాస్ చురకలు అంటించాడు. దీంతో సైలెంట్ గా ఉండిపోయాడు చంటి.

  ఎలక పేరుతో ఉదాహరణ..

  ఎలక పేరుతో ఉదాహరణ..


  ఇక ఇదిలా ఉంటే మళ్లీ పిట్ట గొడవ టాపిక్ తీసుకొస్తూ.. 'నేను వాడు అంటే తీసుకోలేకపోయావు నన్ను పిట్టా ఎలా అంటాడు' అని ఇనయా మాట్లాడిన విధానాన్ని చెబుతూ ఆమెను నామినేట్ చేశాడు శ్రీహాన్. అప్పటికే ఆ విషయంపై నాగార్జున క్లారిటీ ఇచ్చినప్పటికీ నామినేషన్లలో ఎలక పేరుతో ఓ ఉదాహరణ చెబుతూ ఇది నీ మెంటాలిటీ అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత శ్రీహాన్ ను నామినేట్ చేసేందుకని టమాటోతో శ్రీహాన్ దగ్గరికి వచ్చింది ఇనయా.

   వెటకారంగా ఆవలిస్తూ..

  వెటకారంగా ఆవలిస్తూ..

  ఆమె వచ్చాక ఒక్క నిమిషం అంటూ వెటకారంగా నిద్ర వస్తున్నట్లుగా ఆవలిస్తూ ఓవరాక్షన్ చేశాడు. తర్వాత 'నా వయసు ఎక్కువ అని ఎలా అంటావ్. మీ కంటే నేను బాడీలో అన్నిట్లోనూ పెద్దగా అనిపించినప్పుడు ఏజ్ పెద్దగా అనిపిస్తుందా' అని ఇనయా ప్రశ్నించింది. దీంతో 'నేను అన్ని అన్నానా' అంటూ శ్రీహాన్ ఆశ్చర్యపోతూ.. 'నేను నువ్వు పెద్దదానివి అనలేదు' అన్నాడు. 'ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం ప్రాణం ఇస్తాను' అంటూ ఇనయా చెప్పగా దీంతో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని శ్రీహాన్ కౌంటర్ ఇచ్చాడు. అయితే వీరి వాగ్వాదంలో ఇనయా చాలానే చిరాకు తెప్పించింది.

   శ్రీహాన్ ఓవర్ పర్ఫామెన్స్..

  శ్రీహాన్ ఓవర్ పర్ఫామెన్స్..

  వీరి వాగ్వాదంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని ఇనయా అనగానే.. నాకు నచ్చితే చెప్తాను అంటూ శ్రీహన్ చెప్పాడం ప్రోమోలో కనపించింది కానీ ఎపిసోడ్ లో కనిపించలేదు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 26న ప్రసారమైన 22వ రోజు 23వ ఎపిసోడ్ ప్రారంభంలో ''ఇక ఏ వీక్ అయినా అస్సలు తగ్గకుండా ఆడాలి. చావొచ్చిన పర్వాలేదని అనిపిస్తుంది. ఫుల్ హండ్రెడ్ పర్సంట్ పెట్టేయాలి ఇక. మళ్లీ మళ్లీ రాదు ఈ అవకాశం. వచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని ఇదే ఆఖరి అవకాశం అనుకోని ఫ్రూవ్ చేసుకోవాలి'' అంటూ మాట్లాడటం కావాలనే పర్ఫామెన్స్ ఇస్తున్నట్లుగా అనిపించింది. ఆడాలంటే గేమ్ ఆడాలి కానీ, ఇలా కెమెరాల ముందు చెప్పుకునే జబ్బు ఈ బిగ్ బాస్ ప్రతి సీజన్ లో సాధారణమే.

  English summary
  Bigg Boss Warning To Chalaki Chanti For Trying To Do Comedy And And Shrihan Overaction In Bigg Boss Telugu 6 Fourth Week Nominations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X