twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: వారిద్దరి మధ్యలో రగులుతోంది మొగలిపొద.. సీక్రెట్ రూమ్ లో గీతూ గాసిప్!

    |

    బిగ్ బాస్ గడిచిన నాలుగు వారాల్లో కూడా విభిన్నమైన వాతావరణంతో కొనసాగింది. మొదటి రెండు వారాలు ఏదో నామమాత్రంగా కంటెస్టెంట్స్ అందరూ కనిపించారు. కానీ రెండు వారాల తర్వాత మూడో వారంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అనే చెప్పాలి. ప్రతి టాస్క్ లో కూడా ఎవరికి వారు వారి శక్తికి మించి పోరాడుతున్నారు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో బిగ్ బాస్ కు సంబంధించిన బర్త్ డే వేడుకలు జరగబోతున్నాయి. ఇక ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆర్జే సూర్య మిమిక్రి

    ఆర్జే సూర్య మిమిక్రి

    బిగ్ బాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఇంట్లోనే సభ్యులందరూ కూడా బిగ్ బాస్ ను వారి టాలెంట్ తో ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. అయితే మొదట ఆర్జె సూర్య ఎప్పటిలాగే తన మిమిక్రీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వాయిస్ లో అతను బిగ్ బాస్ తెలుగు ప్రజలకు నచ్చిన షో అంటూ వివరణ ఇచ్చాడు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు వాయిస్ తో కూడా ఆకట్టుకున్నాడు.

     అర్జున్ కు మండిపోయే విధంగా

    అర్జున్ కు మండిపోయే విధంగా

    ఇక అర్జున్ కు మండిపోయే విధంగా శ్రీ సత్య శ్రీహన్ తో కలిసి డాన్స్ చేసింది. ఆఖరికి శ్రీహన్ శ్రీ సత్య ని ఎత్తుకోవడంతో అతను అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరు కూడా దాదాపు లవర్స్ తరహాలో పెర్ఫామెన్స్ ఇవ్వడంతో అందరూ కూడా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. ఇక అర్జున్ మాత్రం శ్రీ సత్య విషయంలో మరోసారి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

     చంపేద్దామని చూస్తున్నావా?

    చంపేద్దామని చూస్తున్నావా?

    ఫైమా కామెడీ స్కిట్ చేసేందుకు ప్రయత్నం చేసింది. ఆమెతోపాటు కీర్తి కూడా కామెడీ చేసింది. పార్క్ లో నేను ఒక అబ్బాయిని చూసాను అంటూ డ్రామా మొదలుపెట్టిన ఈ ఇద్దరి మధ్యలోకి అర్జున్ కూడా వచ్చాడు. ఇక నీ హెల్త్ ఎలా ఉంది అనగానే అందరూ నవ్వేశారు. అర్జున్ నన్ను చంపేద్దామని చూస్తున్నావా? నువ్వు ఎవరినైనా చూసుకున్నావా? ఇప్పటినుంచి నువ్వు ఈ అందని దక్కించుకోవడానికి ట్రై చేయకు అని కామెంట్ చేయడంతో పక్కనే ఉన్న సూర్య షాక్ అయ్యాడు.

     సూర్య ఇనయా మధ్యలో..

    సూర్య ఇనయా మధ్యలో..

    ఇక బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి గీతూకి అనుమతి దొరికింది. చికెన్ తినడానికి మీకు అర్హత లభించాలి అంటే ఇంటి సభ్యుల గురించి ఏదైనా ఒక గాసిప్ చెప్పండి అని బిగ్ బాస్ చెప్పడంతో సూర్య ఇనయా మధ్యలో ఏదో రగులుతోంది మొగలిపొద అనిపిస్తోంది అని చెప్పడంతో బిగ్ బాస్ కూడా అందుకు తగ్గట్టుగానే కౌంటర్ ఇచ్చాడు. ఈ గాసిప్ తో చికెన్ వాసన చూడొచ్చు అని అన్నాడు.

     నాకు మండుతాంది..

    నాకు మండుతాంది..

    బిగ్ బాస్ ఇచ్చిన పంచులకి గీతు పగలబడి నవ్వేసింది. ఏంటి బిగ్ బాస్ ఈరోజు ఇంత కామెడీ అయిపోయావు అని గీతూ కామెంట్ చేసింది. ఇక తర్వాత బాలాదిత్య అన్న దీపు దీపు అంటా ఉంటే నాకు మండుతాంది బిగ్ బాస్ అని తెలిపింది దీంతో బిగ్ బాస్ కూడా అంత మంటతో ఈ స్పైసీ చికెన్ తినగలరా అని ఆన్సర్ ఇచ్చాడు. అలాగే అది తినవద్దు అని కూడా చెప్పడంతో గీతూ మళ్ళీ నవ్వేసిందే. మరి ఇలాంటి జోకులు ఇంకా బిగ్ బాస్ లో ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

    English summary
    Bigg boss telugu 6 birthday celebrations and geethu royal secret room gossip
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X