twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6:చిరుతల్లా పోరాడిన అమ్మాయిలు.. ఉన్మాదుల్లా రేవంత్-శ్రీహాన్.. బిగ్ బాస్ పక్షపాతం!

    |

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో అరుపులు, కేకలు, ఫ్రస్టేషన్, ఎంకరేజ్ మెంట్, కన్నింగ్ చూపిస్తున్నారు ఇంటి సభ్యులు. బలహీనతలపై కొడుతూ ఎమోషనల్ గా దెబ్బతీసైనా గేమ్ విన్ అవ్వాలనుకుంటున్నారు. ఇలాంటి తదితర అంశాలతో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌజ్ లో తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ మిషన్ పాసిబుల్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బ్లూ టీమ్ లోని ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు చిరుతల్లా పోరాడితే.. రెడ్ టీమ్ లోని మగాళ్లు ఉన్మాదుల్లా బిహేవ్ చేసినట్లు కనిపించింది.

    ఆ ముగ్గురు తప్పా..

    ఆ ముగ్గురు తప్పా..

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్లలో మొత్తం 10 మంది ఉన్న విషయం తెలిసిందే. కెప్టెన్ అయిన కారణంగా శ్రీహాన్ నామినేషన్ నుంచి తప్పించుకోగా వాసంతి, రాజ శేఖర్ ని ఎవరు నామినేట్ చేయలేదు. అయితే ప్రస్తుతం ఉన్న 13 మంది కంటెస్టెంట్లందరికీ తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా మిషన్ పాసిబుల్ గేమ్ ఆడాల్సి ఉంది.

     గ్రైనేట్ ఉన్న కారణంగా..

    గ్రైనేట్ ఉన్న కారణంగా..

    ఆదిరెడ్డి, బాలాదిత్య, రోహిత్, రాజ శేఖర్, వాసంతి, మెరీనా, ఇనయా సుల్తానా బ్లూ టీమ్ గా.. గీతూ రాయల్, శ్రీహాన్, రేవంత్, శ్రీ సత్య, కీర్తి భట్, ఫైమా రెడ్ టీమ్ గా మిషన్ పాసిబుల్ టాస్క్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా బేటన్ టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో బేటన్ టాస్క్ తో అపోనెంట్ టీమ్ వాళ్లను టేబుల్ పై నుంచి బేటన్ తో కింద పడేయాలి. గ్రైనేట్ ఉన్న కారణంగా రెడ్ టీమ్ అపోనెంట్ వాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది.

    వీక్ గా ఉంటారని..

    వీక్ గా ఉంటారని..

    బ్లూ టీమ్ లో బలహీనంగా ఉంటారని, మహిళలని మెరీనా, ఇనయా సుల్తానా, వాసంతిలను పోటీగా రమ్మన్నారు. వారికి పోటీగా రెడ్ టీమ్ నుంచి రేవంత్, శ్రీహాన్, ఫైమా వెళ్లారు. ఇక సంచాలక్ గా గీతూ రాయల్ ఉంది. ముందుగా గీతూ కొన్ని రూల్స్ పెట్టింది. రెండు కాళ్లు కిందపెడితే ఔట్ అని ఒకరి బేటన్ మరొకరు వాడకూడదని చెప్పింది. కానీ గేమ్ విషయానికొచ్చేసరికి మాత్రం రెడ్ టీమ్ లో ఫైమా బేటన్ తీసుకుని శ్రీహాన్ ఆడాడు. దానికి ఏమాత్రం అడ్డుచెప్పలేదు.

    అబ్బాయిలకు గట్టి పోటి..

    అబ్బాయిలకు గట్టి పోటి..

    ఇక మెరీనా, వాసంతి, ఇనయాలపై చాలా అగ్రెషన్ తో గేమ్ ఆడారు శ్రీహాన్, రేవంత్. రెడ్ టీమ్ వాళ్లు ఎంత ప్రయత్నించినా.. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ గట్టి పోటీ ఇచ్చారు ఆ ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు. శ్రీహాన్, రేవంత్ ఎంత ప్రయత్నించినా.. వాళ్లు కేవలం ఒక కాలు కిందపెట్టి వాళ్లను వాళ్లు కాపాడుకున్నారు. చివరిగా అబ్బాయిలను ఈ లేడీ చిరుతలు ఓడించారు. అయితే వాళ్లు ఒక కాలు పెట్టడంతో రెడ్ టీమ్ కు కష్టమైపోయింది.

     ఒక కాలు పెట్టిన ఔట్..

    ఒక కాలు పెట్టిన ఔట్..

    ఇంతలో బిగ్ బాస్ నుంచి ఇకనుంచి ఒక కాలు పెట్టిన ఔట్ అని అనౌన్స్ మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. నా తర్వాతి రూల్ ఇదే అని గీతూ తెలిపింది. ఒక కాలు కింద పెడితే రెడ్ టీమ్ వాళ్లు గెలవలేరు. ఎందుకంటే అమ్మాయిలైన సరే ఎంతో అగ్రెషన్ తో ఆడుతున్న శ్రీహాన్, రేవంత్ లను ఓడించడంతో ఓవరాల్ గా గెలవలేరనిపించింది. అందుకే బిగ్ బాస్ కూడా టీమ్ గెలవాలన్న ఇంటెన్షన్ తోనే ఆ అనౌన్స్ మెంట్ చేసినట్లు అనిపిస్తోంది. గీతూ రాయల్ ఎలాంటి తప్పులు చేసిన బిగ్ బాస్ మాత్రం వారించడు. అందుకే గీతూను బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటూ పిలుస్తున్నారు నెటిజన్లు.

    గాల్లోనే తోశారని చెబుతూ..

    గాల్లోనే తోశారని చెబుతూ..

    శ్రీహాన్, రేవంత్ లు ఇద్దరు తమ కాళ్లు కింద పెట్టి బ్లూ టీమ్ వాళ్లను చేతులతో తోసేయడం వంటివి చేశారు. కానీ దానికి గీతూ గాల్లోనే తోశారని చెబుతూ రెడ్ టీమ్ కే సపోర్ట్ చేసింది. గేమ్ కన్నా ముందే సంచాలక్ ఫేయిర్ గా ఉండాల్సిన అవసరం లేదు. రెడ్ టీమ్ గెలిచేలా చేస్తా అని గీతూ అంది. అలానే చేసింది. బ్లూ టీమ్ వాళ్లు కిందపడిపోతే.. బయటకెళ్లు అంటూ రేవంత్ అరిచే అరుపులు, శ్రీహాన్, శ్రీ సత్య చేసిన వెకిలీ చేష్టలు ఉన్మాదులను తలపించిందనే చెప్పాలి.

    చుక్కలు చూపించిన చిరుతలు..

    గేమ్ లో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా వద్దన్నారు ఓకే.. కానీ మొహానికి తాకుతుందని ఒక మనిషిగా ఆలోచించడం మాత్రం మరిచిపోయింది రెడ్ టీమ్. గేమ్ అంతా రెడ్ టీమ్ ఫ్రస్టేషన్ లో ఉంటే.. బ్లూ టీమ్ అబ్బాయిలు మాత్రం వాళ్ల పోటీదారులకు సూపర్ ఎంకరేజ్ మెంట్ ఇచ్చారు. టైగర్స్, రౌడీలు అంటూ చప్పట్లతో మెరీనా, వాసంతి, ఇనయాలకు ఫుల్ జోష్ ఇచ్చారు. బేటాన్ టాస్క్ లో బ్లూ టీమ్ ఓడిపోయిన కానీ, వీక్ గా ఉంటారని అమ్మాయిలను సెలెక్ట్ చేసిన రెడ్ టీమ్ కి మాత్రం బ్లూ టీమ్ చుక్కలు చూపించింది.

    English summary
    Blue Team Vs Red Team In Mission Possible Task Of Bigg Boss Telugu 6 Season November 2 Day 59 Episode 60 Highlights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X