Bigg Boss Telugu 6: ఎమోషనల్ గా ఆడుకుంటున్న బిగ్ బాస్.. అతను మరో రెండు వారాలు రిస్క్ లోనే!
బిగ్బాస్ బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో సరికొత్త ట్విస్ట్ లు ఇస్తున్నాడు. కంటెస్టెంట్స్ ను ఒకవైపు ఉత్తేజ పరుస్తూనే మరొకవైపు ఎమోషనల్ గా టచ్ చేస్తున్నాడు. ఇక మధ్య మధ్యలో కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వస్తోంది. కంటెస్టెంట్స్ ఈ గేమ్ లో అయితే వారు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరు తప్పు చేసిన మిగతా వారిపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. కాబట్టి ఈ టాస్క్ ప్రతి ఒక్కరికి కీలకంగా కాబోతుంది. ఈరోజు ప్రసరం కాబోయే ఎపిసోడ్లో కూడా ఎన్నో ట్విస్ట్ లు చోటుచేసుకుపోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

చివరిసారిగా ఛాన్స్
ఫోన్ రింగు కాగానే సూర్య వెళ్లి దాన్ని లిఫ్ట్ చేసాడు. ఇక చివరిసారిగా ఇంటి బ్యాటరీ 100% పెంచుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నట్లు బిగ్ బాస్ తెలియజేసాడు. ఇక రాబోయే రెండు వారాలకు గాని రోహిత్ లేదా వాసంతి ఇద్దరిలో ఎవరో ఒకర నేరుగా నామినేట్ అయితే బ్యాటరీ 100 శాతానికి పెరుగుతుంది అన్నట్లు బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు.

రాబోయే రెండు వారాలకు
రాబోయే రెండు వారాలకు నేను నామినిట్ అవుతున్నాను అని రోహిత్ చెప్పేసాడు. ఇక ఇంటి బ్యాటరీ చివరిసారిగా 100% అవుతుంది. ఆ తర్వాత ఫైమాతోపాటు కెప్టెన్ రేవంత్, కీర్తి ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇక మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ తరుణంలో రేవంత్ అయితే ఒక్కసారైనా తన ఫ్యామిలీని చూద్దామని ఉన్నట్లు ఏడుస్తూ చెప్పాడు.

నీకు ఎవరూ లేరు అని బాధ పడవద్దు
ఇక కీర్తి కూడా చివరి నిమిషంలో చాలా ఎమోషనల్ అయింది. ఆ తర్వాత రేవంత్ కు ఏదో ఫోటో గిఫ్ట్ గా వచ్చింది. దాన్ని చూసి ఇంట్లో సభ్యులందరూ కూడా అతన్ని ఉత్తేజపరిచారు. ఇక తర్వాత ఒక ఆడియో మెసేజ్ వచ్చింది. నీకు ఎవరూ లేరు అని బాధ పడవద్దు అది కరెక్ట్ కాదు నీకోసమే నేను ఉంటాను అంటూ కీర్తికి ఒక మెసేజ్ వచ్చింది.

ఫైమా తల్లితో ఆనందంగా
ఇక ఫైమా తల్లి లైవ్ లో మాట్లాడడంతో ఆమె ఎగిరి గంతేసింది. ఇక నేను మేకప్ వేసుకోలేదు బాగున్నానా అంటూ ఫైవ్ తల్లి చెప్పడంతో నువ్వు ఎలా ఉన్నా కూడా మా కూతరివే అంటూ తల్లి చెప్పడంతో ఆమె ఎంతగానో సంతోషించింది. బిగ్ బాస్ అయితే ఈసారి కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాడు. ఇక ఈసారి అతి తక్కువ ఓట్లు అందుకుంటున్న సుదీప ఇంట్లో నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











